ETV Bharat / city

2021 ఆగస్టు వరకు విద్యా సంవత్సరం: మంత్రి సురేశ్

నవంబర్ 2వ తేదీ నుంచి 9, 10, ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుందని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. పాఠశాలల పనిదినాలు 180 రోజులు ఉంటాయని తెలిపారు.

adimulapu suresh
adimulapu suresh
author img

By

Published : Oct 31, 2020, 8:44 PM IST

Updated : Oct 31, 2020, 9:14 PM IST

సోమవారం నుంచి రాష్ట్రంలో బడిగంటలు మోగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తున్నామని చెప్పారు. విద్యా సంవత్సరం కవర్ చేసుకునేలా సిలబస్ రూపొందించామని తెలిపారు. మంత్రి సురేశ్‌ శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి 9, 10, ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. నవంబరు 16 నుంచి ఇంటర్ తొలిఏడాది తరతులు నిర్వహిస్తామన్నారు. నవంబరు 23 నుంచి 6,7, 8 తరగతులు... డిసెంబరు 14 నుంచి 1-5 వరకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. నవంబరు 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్ ఇచ్చామని చెప్పారు.

2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుందని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. పాఠశాలల పనిదినాలు 180 రోజులు ఉంటాయని తెలిపారు. ఇంటర్ ప్రవేశాల్లో గందరగోళంపై ఆయన స్పందించారు.

ఇంటర్‌ అడ్మిషన్లల్లో గందరగోళం లేదు. పదో తరగతి పాసైన వారికి సమానంగా ఇంటర్‌ సీట్లున్నాయి. సీట్ల కోసం అదనంగా కొత్త 153 కళాశాలలకు అనుమతి ఇచ్చాం. రేకుల షెడ్డుల్లో కళాశాలలు నడిపితే చూస్తూ ఊరుకోవాలా?. అందుకే కొన్ని కళాశాలల అనుమతిని పునరుద్ధరించలేదు. 611 కళాశాలలకు అనుమతులు రద్దు చేశాం. ఫీజులు 30 శాతం తగ్గించాలని విద్యాసంస్థలను ఆదేశించాం- ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్

Last Updated : Oct 31, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.