- ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు
ఏలూరులో మొత్తం 47 డివిజన్ లకు కౌంటింగ్ కొనసాగుతుంది. మరికాసేపట్లో 8 డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 27 టీఎంసీలు కావాలి: కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ లేఖ
కృష్ణా బోర్డుకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శకి లేఖ రాశారు. రాయసీమలో తాగు, సాగు నీటి అవసరాలకు, చెన్నై తాగు నీటి అవసరాలకు 27 టీఎంసీలు అవసరమని.. ఈ నీరు తీసుకునేందుకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో ఆరు రకాల పాఠశాలలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులు రానున్నాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురాబోతుంది. ఇకపై రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. జూనియర్ కళాశాలలతో హైస్కూల్ ప్లస్ ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాస్త శాంతించిన గోదావరి
ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో రెండు రోజులుగా తెలంగాణలోని భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి... ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఉదయం రెండు అడుగుల నీటిమట్టం తగ్గి ప్రస్తుతం 46.7 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగా 39,742 మందికి కరోనా
దేశంలో కొత్తగా 39,742 మందికి కరోనా సోకింది. మరో 39 వేల మందికి పైగా కోలుకోగా.. 535 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనాభా నియంత్రణ సాధ్యమేనా?
జనాభా నియంత్రణపై ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల తాజా నిర్ణయాలతో దేశంలో మరోసారి జనాభా చర్చనీయాంశంగా మారింది. నిరక్షరాస్యత, పేదరికం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి మూడు అంశాలు సంతానం పెరిగేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఇలాంటి చర్యలను పకడ్బందీగా అమలు చేస్తే, ప్రత్యేక నియంత్రణలతో అవసరం తక్కువగానే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మర్మాంగం కోసి దారుణ హత్య
ప్రేమ వ్యవహారంలో ఓ యువతి సోదరులు క్రూరత్వానికి పాల్పడ్డారు. తన సోదరి ప్రేమించిన వ్యక్తిపై దాడి చేసి, మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుని కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి వద్దే దహనం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎల్‌ఐసీ ఐపీఓ!
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో ఎల్‌ఐసీ ఐపీఓ ఎంతో కీలకం. తొలివిడతలో 5-6 శాతం వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కష్టాల కడలిని దాటి..
మీరాబాయి చాను.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్‌లో వెండి గెలుచుకున్న ఈ మణిపురి వెయిట్‌లిఫ్టర్(Tokyo olympics Meerabai chanu).. విశ్వక్రీడల్లో భారత పతకాల పట్టికను తెరిచింది. గత రియో ఒలింపిక్స్‌లో కనీస ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడిన మీరా.. ప్రస్తుతం ఈ ఘనత సాధించడం వల్ల కోట్లాదిమంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే దీని వెనక మీరా అసాధారణ కృషి దాగి ఉంది. దాని గురించే ఈ కథనం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యువ నటికి తీవ్ర గాయాలు!
యువ నటికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో తన స్నేహితురాలు ఘటన స్థలంలోనే మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.