ETV Bharat / city

108,104 వాహన నిర్వహణలో మార్పులు..సంస్థల ఎంపికకు రివర్స్ టెండరింగ్

author img

By

Published : Dec 12, 2019, 8:57 AM IST

108,104 వాహన నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేపట్టంది.అత్యవసర స్పందన కేంద్రం, వాహనాల నిర్వహణ.. వేర్వేరు సంస్థల ద్వారా సాగేలా టెండర్లు ఆహ్వానించింది.

108104-changes-in-vehicle-maintenance-reverse-tendering-for-company-selection

108,104 వైద్యసేవల పటిష్టతకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అత్యవసర స్పందన కేంద్రం, వాహనాల నిర్వహణ.. వేర్వేరు సంస్థల ద్వారా సాగేలా టెండర్లు ఆహ్వానించింది. టెండర్లలో పేర్కొన్న అంశాలను వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ.... జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీకి పంపించింది. సుమారు 13 వందలకు పైగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు రాగా వాటిని కమిటీ పరిశీలించి మార్పులు సూచించింది. జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ ఆమోదంతో టెండర్లు ఆహ్వానించినట్లు వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ తెలిపారు. ఈ నెల 20 లోగా దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందన్నారు. ప్రస్తుతం 108 పథకం కింద వాహనాలు, అత్యవసర స్పందన కేంద్రం నిర్వహణ.. ఒకే సంస్థ ద్వారా సాగుతోందని... దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వేర్వేరు సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని సుజాతారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏడేళ్ల ఒప్పందంతో సంస్థల ఎంపిక జరగనుంది. ఏడాదికి 400 కోట్లు వరకూ వ్యయం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నాటికి మరో 423 కొత్త 108 వాహనాలు, మరో 676.. కొత్తగా 104 సంచార అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చదవండి : రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.