ETV Bharat / city

శంషాబాద్​ విమానాశ్రయంలో సుమారు కిలో బంగారం సీజ్​

author img

By

Published : Mar 14, 2021, 2:48 AM IST

శంషాబాద్​ విమానాశ్రయంలో శుక్ర, శనివారాల్లో 1,065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో షార్జా నుంచి వచ్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో సుమారు కిలో బంగారం సీజ్​
శంషాబాద్​ విమానాశ్రయంలో సుమారు కిలో బంగారం సీజ్​

శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం.. బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన సదరు వ్యక్తి.. ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో పేస్ట్​ రూపంలో 672 గ్రాముల పసిడిని దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో గుర్తించిన అధికారులు.. 594 గ్రాముల నికర బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నోట్లో దాచిపెట్టి..

శుక్రవారం.. షార్జా నుంచి శంషాబాద్​ విమానాశ్రయానికి వచ్చిన నలుగురి ప్రయాణికుల వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేస్తుకున్నారు. దీని విలువ రూ.20.67 లక్షలు ఉంటుందని అంచనా వేస్తోంది. వీరంతా బంగారం ముక్కలను నోట్లో దాచిపెట్టుకున్నారు. గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.

ఇవీచూడండి: యువకుడి నగ్న వీడియోలతో రూ.2 లక్షలు వసూలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.