ETV Bharat / business

కారు ఇన్సూరెన్స్ - ఈ ప్లాన్​​ తీసుకోకపోతే జేబులోంచి డబ్బు తీయాల్సిందే!

Zero Depreciation Car Insurance Policy : కారు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? అయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే.. బీమా తీసున్నా కూడా మీరు జేబులోంచి డబ్బు తీయాల్సి వస్తుంది. మరి.. ఆ వివరాలేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!

Zero Depreciation
Zero Depreciation Car Insurance Policy
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 1:54 PM IST

Zero Depreciation Car Insurance Policy : కొత్తగా కొనుగోలు చేసిన వాహనం రోడ్డు మీదకు రావడానికి ముందే.. కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది వాహన బీమా. ఊహించని ప్ర‌మాదాలు, ప్ర‌కృతి వైప‌రీత్యాల కారణంగా వాహనం దెబ్బతిన్నప్పుడు కలిగే న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డానికి.. ఇన్సూరెన్స్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అయితే.. మీరు సెలక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి? అన్నదానిపైనే మీకు బీమా ఎంత కవర్ అవుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే.. మీ కారు కోసం ఎలాంటి బీమా తీసుకుంటున్నారో ఓసారి చెక్ చేసుకోండి.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేశాడు. కొంత కాలం తర్వాత కారు ప్రమాదానికి గురైంది. కారు గట్టిగానే దెబ్బ తిన్నది. రిపేర్ చేయడానికి సుమారు రూ. లక్ష వరకు ఖర్చవుతుందని షో రూమ్ ప్రతినిధులు తెలిపారు. వాహనం కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా.. క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుందిలే అని భావించాడు. బీమా సంస్థను సంప్రదించాడు. సదరు సంస్థ లెక్కలు వేసి.. అతనికి ఇన్సూరెన్స్ కింద కేవలం 50 వేల రూపాయలు మాత్రమే వస్తాయని చెప్పింది. దీంతో.. ఆ వ్యక్తి షాకయ్యాడు. అదేంటని ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు అసలు విషయం చెప్పారు. వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాని తరుగును లెక్కిస్తారు. ప్రమాదం జరిగే నాటికి కారు తరుగుదల ఎంత అన్నది లెక్కించి.. క్లెయిమ్ చేసిన మొత్తం నుంచి.. డిప్రిసియేషన్ కింద రూ. 50 వేలు మైనస్ చేశారన్నమాట.

కారు సేఫ్టీ కోసం సూపర్ ఇన్సూరెన్స్ - ఈ యాడ్-ఆన్స్​ కచ్చితంగా ఉండాల్సిందే!

ఇప్పుడు కారు రిపేర్​కు కావాల్సిన మిగతా 50 వేలను ఆ ఓనరు సొంతంగా భరించాల్సి ఉందన్నమాట. అంటే.. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ పూర్తిగా బీమా డబ్బులు రాలేదు. ఇలాంటి బీమాను కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. కానీ.. "జీరో డిప్రిసియేషన్" బీమాను కొనుగోలు చేసిన వారికి ఈ పరిస్థితి రాదు. వాహనం తరుగుదలతో సంబంధం లేకుండా.. ఎంత నష్టం జరిగితే.. అంత మొత్తాన్నీ ఈ ప్లాన్ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయి. సో.. వాహన బీమా తీసుకునేటప్పుడు జీరో డిప్రిసియేషన్‌ ప్లాన్ తీసుకుంటే.. ఎలాంటి నష్టం లేకుండా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అందరికీ జీరో డిప్రిసియేషన్‌ ప్లాన్ ఇవ్వరు..!

  • జీరో డిప్రిసియేషన్‌ బీమాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.
  • ఈ పాలసీ కొత్త కార్ల‌కు, లేదా నాలుగు సంవ‌త్స‌రాలలోపు కార్ల‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • అందువ‌ల్ల కారు కొన్న ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ పాలసీని తీసుకోవ‌డం కొంచెం క‌ష్టంతో కూడుకున్న పని.
  • 10 ఏళ్లు దాటిన కారుకు ఈ బీమా అస్సలే ఇవ్వరు.

ప్లాన్ ధర అధికం..

జీరో డిప్రిసియేషన్‌ కవర్‌ ఆప్షన్‌ లేని పాలసీ తీసుకుంటే.. పాలసీదారు రూ.13,000 నుంచి రూ.14,000 వరకు ప్రీమియం చెల్లిస్తారు. అదే.. జీరో డిప్రిషియేషన్‌ ప్లాన్ తీసుకుంటే.. ప్రీమియం రూ.21,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది. ప్రీమియం మొత్తం పెరిగినప్పటికీ.. బీమా అవసరమైనప్పుడు జేబులోంచి రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం రాదు. అందుకే.. ఇప్పుడు కార్లు కొనుగోలు చేస్తున్నవారు ఈ పాలసీని తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Motor Insurance Tips : వాహన బీమా తీసుకుంటున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి!

అయితే.. కారు ఎంత పాతది అన్నదాన్ని బట్టి.. ఈ పాలసీ ప్రీమియం ఉంటుంది. ఇంకా.. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో నివసించేవారి వాహనాలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే వారి కార్లకు ప్రీమియం మరికాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే.. మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఈ ప్రీమియం మారుతూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే "జీరో డిప్రిషియేషన్‌" పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వేరే ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయంలో క్లెయిమ్‌లపై ఎలాంటి పరిమితీ లేదు. అందువల్ల.. అన్నీ ఆలోచించి తగిన పాలసీని ఎంచుకోండి.

Online Car Insurance : ఆన్​లైన్​లో కార్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటే ఇన్ని లాభాలా!

కొత్త కారు కొంటున్నారా?.. ఈ 5 ఐదు విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.