ETV Bharat / business

ట్విట్టర్‌పై మస్క్‌కు ఎందుకంత మక్కువ? ప్లాన్‌-బి ఏంటి?

Elon Musk Twitter: ఇప్పటివరకు ట్విట్టర్​లో 9.2శాతం వాటా కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్.. ఆ తర్వాత ట్విట్టర్​ బోర్డులో సభ్యునిగా చేరతారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అందుకు నిరాకరించిన మస్క్.. మిగిలిన షేర్లన్నీ అమ్మేయండంటూ ట్విట్టర్​కు ఆఫర్​​ కూడా ఇచ్చారు. అయితే అసలు మస్క్​కు ట్విట్టర్​పై ఎందుకంత మక్కువ? ఇంకేమైనా ప్లాన్​లో మస్క్​ ఉన్నారా? అని వ్యాపార నిపుణులు చర్చించుకుంటున్నారు.

Elon Musk Twitter
Elon Musk Twitter
author img

By

Published : Apr 15, 2022, 12:40 PM IST

Elon Musk Twitter: ఇతర సామాజిక మాధ్యమాలతో పోలిస్తే కొన్ని విషయాల్లో ట్విట్టర్‌ చాలా చిన్నదనే చెప్పాలి! ఇంకా పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోతోందంటూ పెట్టుబడిదారులు విసుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. ఫేస్‌బుక్‌ తరహాలో బిలియన్ల కొద్దీ క్రియాశీలక వినియోగదారులను ఆకర్షించడంలో ట్విట్టర్‌ విఫలమైందని టెక్‌ నిపుణులు చెబుతుంటారు. ట్విట్టర్‌తో పోలిస్తే ఫేస్‌బుక్‌ రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 11 రెట్లు అధికం. క్రితం త్రైమాసికంలో గూగుల్‌ నేతృత్వంలోని యూట్యూబ్‌తో పోలిస్తే ట్విట్టర్‌ ప్రకటనల ఆదాయం ఐదింతలు తక్కువ.

అయినా, ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మస్క్‌.. మిగిలిన వాటాలనూ కొనుగోలు చేస్తానని ప్రతిపాదించారు. ఒక్కో ట్విట్టర్‌ షేరును 54.20 డాలర్లు చొప్పున కొనుగోలు చేస్తామని, ఇందుకు 43 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.22 లక్షల కోట్లు)కు పైగా చెల్లిస్తామని ఆఫర్‌ చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించారు.

ట్విట్టర్‌ బోర్డు ఆమోదిస్తుందా? మస్క్‌ ఆఫర్‌ తమకు అందిందని, వాటాదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్‌ ప్రకటించింది. దీనిపై నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ 9.2 శాతం వాటా కొనుగోలు చేయడానికి ముందు ట్విట్టర్‌ షేరు విలువ 39.91 వద్ద ట్రేడయ్యింది. ప్రస్తుతం ఆయన ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రీమియం చాలా ఎక్కువ ఉన్నందుకు బోర్డు ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదని కొంతమంది టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మస్క్‌ కొనుగోలు ప్రతిపాదనకు ట్విట్టర్‌ బోర్డు అంగీకరించే అవకాశాలు చాలా చాలా తక్కువని మరికొందరు టెక్‌ పండితులంటున్నారు. క్రితం వేసవిలో ట్విట్టర్‌ షేరు ధర 70 డాలర్ల వరకు వెళ్లిందని.. దాంతో పోలిస్తే మస్క్‌ ఆఫర్‌ తక్కువేనంటున్నారు.

మస్క్‌కి ప్లాన్‌-బి ఉందా? తన ప్రతిపాదనను ట్విట్టర్‌ అంగీకరిస్తుందో లేదో తనకు ఏమాత్రం అవగాహన లేదని ఎలాన్ మస్క్‌ అన్నారు. గురువారం జరిగిన టెడ్‌ 2022 సమావేశంలో మాట్లాడుతూ.. ఒకవేళ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడంలో విఫలమైతే తన వద్ద ప్లాన్‌-బి ఉందని స్పష్టం చేశారు. కానీ, అదేంటో మాత్రం వెల్లడించలేదు.

మస్క్‌ ఎందుకు కొనాలనుకుంటున్నారు? డబ్బు కోసం తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం లేదని మస్క్‌ టెడ్‌ సమావేశంలో చెప్పారు. భవిష్యత్తు నాగరికతకు అందరి ఆమోదం పొందిన ఒక సమగ్రమైన ప్రజా వేదిక అవసరమని తాను భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు అనువైన ప్లాట్‌ఫామ్‌గా ట్విట్టర్‌ అవతరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కొనుగోలు ప్రతిపాదన సమయంలో చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు వాక్‌ స్వాతంత్య్రం అవసరమన్నారు. అయితే ప్రస్తుతం ట్విట్టర్‌ నడుస్తున్న తీరు ఆ విధంగా లేదన్నారు. ట్విట్టర్‌ ప్రైవేట్‌ కంపెనీగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆయన కొన్ని మార్పులను కూడా సూచించిన విషయం తెలిసిందే.

గుప్పిట్లోకి శక్తిమంతమైన సాధనం? మస్క్‌ ట్విట్టర్‌ను సొంత చేసుకున్నా.. లేకపోయినా.. దాంట్లో మార్పులు జరిగినా.. జరగకపోయినా.. ఈ మాధ్యమం ఎంత విలువైందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. చాలా విషయాల్లో ఇప్పటికే ఇది ప్రభావవంతమైన వేదికగా పేరు తెచ్చుకుంది. పెద్ద పెద్ద వ్యక్తులకు ఇది ఒక శక్తిమంతమైన సమాచార సాధనంగా మారింది. మరోవైపు ఎలాంటి గుర్తింపు లేని సామాన్య ప్రజల గొంతుకను ‘ట్రెండింగ్‌’ పేరిట వెలుగులోకి తెస్తోంది. రోజుకి 200 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లే ఉన్నప్పటికీ.. రాజకీయాల రూపురేఖల్నే మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ట్విట్టర్‌ ప్రభావం పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌ నుంచి బహిష్కరణకు గురయ్యేంత వరకు దాన్ని ఎంత విరివిగా ఉపయోగించారో చూశాం. అలా ట్విట్టర్‌ నిషేధానికి గురైన చాలా మంది ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువవుదామని చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

అందుకే కొత్త నిబంధనలు.. ట్విట్టర్‌కు ఇంత విలువ ఉన్నప్పటికీ.. కొందరు అపవాదునూ అంటించారు. అసంబద్ధ కుట్ర సిద్ధాంతాలు, కొవిడ్‌ సమయంలో హానికరమైన ఆరోగ్య విషయాలు, సామాజిక అసహనం, అల్లర్లు, హింసకూ కొన్ని ట్వీట్లు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ట్విట్టర్‌ ఇటీవల అనేక కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో ట్వీట్‌లకు ట్యాగ్‌లు తగిలించడం ప్రారంభించింది. ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తోందన్నది కొందరి వాదన. బహుశా ఈ కారణాల వల్లే మస్క్‌ ట్విట్టర్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత ప్రభావవంతమైన మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడం సహా.. చర్చకు.. వాదోపవాదాలకు దారితీసే సమాచారాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలనే భావనతోనే మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలుకు ముందుకు వచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీడియాపై నియంత్రణ? కొంతమంది నిపుణులు మరో వాదననూ తెరపైకి తీసుకొస్తున్నారు. బిలియనీర్ల జాబితాలో ఆయన సహచరులైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇప్పటికే వాషింగ్టన్‌ పోస్ట్‌ను కొనుగోలు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించారు. మరోవైపు పాట్రిక్‌ సూన్‌ షియోంగ్‌ లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ను, లారెన్‌ పావెల్‌ జాబ్స్‌ అట్లాంటిక్‌ను, మైకేల్‌ బ్లూమ్‌బెర్గ్‌.. బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ను సొంతం చేసుకున్నారు. అదే తరహాలో మస్క్‌ సైతం ట్విట్టర్‌ ద్వారా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీరంతా ప్రభ కోల్పోయిన మీడియా సంస్థలకు కొత్త రూపాన్నిస్తే.. మస్క్‌ మాత్రం అత్యంత ప్రభావవంతమైన ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటుండడం గమనార్హం.

భవిష్యత్తు ఇంధనం కోసమా? సమాచారమే ఆధునిక ఇంధనమని మనమంతా విని ఉన్నాం. బహుశా మస్క్‌ ఆసక్తికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా ఆచార్యుడు కారెన్‌ నార్త్‌ తెలిపారు. ట్వీట్ల కంటే ట్విట్టర్‌లో ఉన్న వినియోగదారుల సమాచారంపైనే మస్క్‌ గురి ఉండొచ్చని విశ్లేషించారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని మరింత పెంచడం వల్ల ప్రజలు చాలా స్వేచ్ఛగా తమ భావాల్ని వ్యక్తపరుస్తారని అన్నారు. ఫలితంగా ఆ సమాచారాన్నంతా సొమ్ము చేసుకోవచ్చన్నది మస్క్‌ వ్యూహమై ఉంటుందని వివరించారు.

ఇవీ చూడండి: 'ట్విట్టర్​ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్​.. అగర్వాల్​ ఏం చేసేనో?

ట్విట్టర్​ బోర్డ్​లో చేరేందుకు మస్క్ నో- నిరాశ్రయుల శిబిరంగా సంస్థ హెడ్​క్వార్టర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.