ETV Bharat / business

How Can We Maximize Returns From Fixed Deposits: ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తున్నారా..? ఈ లాజిక్ మిస్సయితే ఇబ్బందే! - ఎఫ్‌డీ ల్యాడరింగ్

What is FD Laddering and How Can We Maximize Returns From Fixed Deposits?: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ సింపుల్​ టిప్​ పాటించినట్లయితే మీ దగ్గర ఉన్న డబ్బులతోనే లక్షల్ల రూపాయల్లో ప్రయోజనం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

How Can We Maximize Returns From Fixed Deposits
What is FD Laddering
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 1:35 PM IST

What is FD Laddering and How Can We Maximize Returns From Fixed Deposits : కష్టపడి సంపాదించిన డబ్బులను రిస్క్ లేని పెట్టుబడి మార్గంలో పెట్టాలని చాలా మంది ఆశపడతారు. అలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు బాగా పాపులర్ అయ్యాయి. స్థిరమైన రాబడి వస్తుందన్న నమ్మకంతో వినియోగదారులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రోజుల్లో బ్యాంకులు కూడా అనేక రకాల ఫీచర్లు, మంచి వడ్డీ రేట్లు అమలు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

అయితే.. ఒకసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకూ లాక్ అయి ఉంటుంది. మధ్యలో ఏదైనా అత్యవసరం అయ్యి డబ్బు కావాల్సి వస్తే.. తీసుకోడానికి వీలు ఉండదు. కొన్ని బ్యాంకులు ప్రీ మెచ్యూర్ విత్ డ్రాకు అనుమతించినా.. ఫైన్​లు విధిస్తాయి. అయితే.. మీరు ఓ స్ట్రాటజీ ద్వారా ఇటువంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎఫ్‌డీ ల్యాడరింగ్(FD Laddering). అసలు ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి..? లాంటి వివరాలను ఇక్కడ చూద్దాం.

SBI Wecare Special Fixed Deposit Scheme: ఎస్​బీఐ నుంచి సూపర్ స్కీం.. కొద్దిరోజులే ఛాన్స్!

ఎఫ్‌డీ ల్యాడరింగ్ అంటే ఏమిటి?
What if FD Laddering..?: మీ దగ్గర ఉన్న డబ్బులను ఒకే ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టకుండా వివిధ టెన్యూర్లలో చిన్న చిన్న మొత్తాలుగా విభజించి ఇన్వెస్ట్​ చేయడాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ ల్యాడరింగ్ అంటారు. ఇది లిక్విడిటీ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్న సమయంలో మంచి లాభాలను అందుకునే అవకాశం కల్పిస్తుంది.

ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయలను.. 5 ఏళ్ల ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారనుకోండి. దీనికి బదులుగా మీరు 5 వేర్వేరు ఎఫ్​డీ ఖాతాలను ఓపెన్​ చేయాలి. 1 లక్ష రూపాయలను 5 భాగాలుగా విభజించి.. ఒక్కొక్క దానిలో 20వేల రూపాయల చొప్పు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలి. 5 అకౌంట్​ల మెచ్యూరిటీ పీరియడ్​ వరుసగా.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు ఉండేలా చూసుకోవచ్చు. బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల ప్రకారం టెన్యూర్‌ ఉండాలి.

తక్కువ వడ్డీకి తక్కువ టెన్యూర్‌, ఎక్కువ వడ్డీకి ఎక్కువ కాలం మెచ్యూరిటీ పీరియడ్‌ ఉండేలా చూసుకోవాలి. టెన్యూర్‌, వడ్డీ ప్రకారం పెట్టుబడి పెట్టాలి. ఇలా మీ పెట్టుబడిని విభజించి వేరు వేరు టెన్యూర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వివిధ సమయాల్లో మెచ్యూరిటీ సొమ్ము మీ చేతికి వస్తుంది. అవసరాలకు తగిన డబ్బు తీసుకుని మిగిలిన దాన్ని మళ్లీ ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయవచ్చు. ఎఫ్‌డీ ల్యాడర్ ని ఎంపిక చేసుకున్న తర్వాత వడ్డీల పెరుగుదల, తగ్గుదల గురించి చింతించాల్సిన అవసరం లేదు.

EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్​ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?

ఫిక్స్‌డ్ డిపాజిట్ ల్యాడరింగ్​ను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ కొన్ని దశలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. వడ్డీ రేటు ట్రెండ్‌లను పర్యవేక్షించడం(Monitor Interest Rate Trends): అధిక రేట్ల వద్ద మళ్లీ పెట్టుబడి పెట్టే అవకాశాలను గుర్తించడానికి వడ్డీ రేటు ట్రెండ్‌లు, సూచనలను ఫాలో అవ్వాలి.
2. మెచ్యూరిటీలను మళ్లీ పెట్టుబడి పెట్టడం(Reinvest Maturities): ప్రతి FD మెచ్యూర్ అయినప్పుడు, అధిక రాబడిని పొందడం కోసం ల్యాడరింగ్​లో ఎక్కువ కాలం ఉన్న కొత్త FDలో ఆదాయాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టండి.
3. లిక్విడిటీ అవసరాలను అంచనా వేయడం(Assess Liquidity Needs): FD ల్యాడరింగ్​ను అమలు చేయడానికి ముందు మీ లిక్విడిటీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను పరిగణించండి. మీకు అధిక లిక్విడిటీ అవసరమైతే, తక్కువ కాల వ్యవధి FDలలో ఎక్కువ మొత్తాలను పెట్టుబడి పెట్టండి.

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

FD ల్యాడరింగ్​ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Benefits of FD Laddering:

  • రెగ్యులర్ లిక్విడిటీ(Regular Liquidity): FD ల్యాడరింగ్​లో వివిధ వ్యవధిలో FDలు మెచ్యూర్ అయినందున ఆవర్తన ద్రవ్యతను అందిస్తుంది. పెట్టుబడిదారులు ఆర్థిక లక్ష్యాలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం నిధులను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
  • అధిక రాబడికి సంభావ్యత(Potential for Higher Returns): స్వల్పకాలిక FDల నుంచి వచ్చే ఆదాయాన్ని అధిక వడ్డీ రేట్ల వద్ద తిరిగి పెట్టుబడి పెట్టడం వలన ఒకే దీర్ఘకాలిక FDతో పోల్చితే అధిక మొత్తం రాబడులు పొందవచ్చు.
  • ఫ్లెక్సిబిలిటీ( Flexibility): మారుతున్న వడ్డీ రేటు ట్రెండ్‌లు, ఆర్థిక లక్ష్యాలు, లిక్విడిటీ అవసరాల ఆధారంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని సర్దుబాటు చేసుకోవడానికి FD ల్యాడరింగ్​ ఉపయోగపడుతుంది.

FD Rates For Senior Citizens : సీనియర్​ సిటిజన్స్​కు గుడ్​న్యూస్​.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 9.1% వడ్డీ!

FD VS T Bills : ఫిక్స్​డ్​ డిపాజిట్స్ Vs ట్రెజరీ బిల్స్​.. ఏది బెస్ట్​ ఛాయిస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.