వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ దూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో సోమవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను మూడు రోజులు క్రితం అదుపులోకి తీసుకుంది సీబీఐ.
వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. 71 ఏళ్ల దూత్‌తో పాటు కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా 2018లో చందా కొచ్చర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారింది. తద్వారా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వేణుగోపాల్ దూత్ స్థాపించిన నూపవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో దీపక్ కొచ్చర్ పెట్టుబుడులు పెట్టారని సీబీఐ ఆరోపించింది.