ETV Bharat / business

Vehicle Insurance Renewal Tips : వెహికల్​ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తున్నారా?.. ఈ విషయాలు గుర్తుంచుకోండి! - comprehensive vehicle insurance

Vehicle Insurance Renewal Tips In Telugu : వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ త్వరలో ముగుస్తోందా? అయితే వెంటనే వెహికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కచ్చితంగా పునరుద్ధరించుకోండి. దీని కంటే ముందు వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vehicle Insurance Renewal guidelines
Vehicle Insurance Renewal Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 4:45 PM IST

Vehicle Insurance Renewal Tips : భారతీయ చట్టాల ప్రకారం ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. సాధారణంగా వాహన బీమాలో.. కాంప్రిహెన్సివ్​, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్​ అనే రెండు రకాలుంటాయి. రోడ్డుపైన వాహనం తిరగాలంటే కచ్చితంగా థర్ట్‌ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అందుకే గడువు ముగిసిన వెంటనే పాలసీని కచ్చితంగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. (Vehicle Insurance Renewal). అయితే వాహన బీమా పాలసీని రెన్యువల్‌ చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తుంచుకోవాలి! అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేరమాడితే తప్పేం కాదు..
వెహికల్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేసుకునే సమయంలో.. కంపెనీవారు చెప్పిన ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. మంచి పాలసీని కోరుతూనే.. ప్రీమియాన్ని తగ్గించమని కోరే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుంది. వాహనం తీసుకొని ఎన్నేళ్లు అవుతోంది? మార్కెట్‌లో ప్రస్తుతం దాని విలువ ఎంత? ప్రస్తుతం వాహనం ఉన్న కండిషన్‌ను అనుసరించి ప్రీమియంను నిర్ధరిస్తుంటారు. ఒక వేళ మీ వాహనంలో ఏ లోపాలూ లేవని భావిస్తే.. కచ్చితంగా ప్రీమియం తగ్గించమని కోరవచ్చు. వారు మీ బండిని సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల మేరకు ప్రీమియం అమౌంట్​ను తగ్గించే అవకాశం ఉంటుంది.

కొత్త బండికి.. సమగ్ర పాలసీ..
Comprehensive Vehicle Insurance : వాహనం కొత్తదైతే.. సమగ్ర పాలసీ తీసుకోవడం మేలు. దీంట్లో ఓన్‌ డ్యామేజ్‌తో పాటు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్​ కూడా ఉంటుంది. వాహనం మరీ పాతదైతే ‘ఓన్‌ డ్యామేజ్‌’ను తీసుకోకపోయినా ఫరవాలేదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ప్రీమియంపై కొంత మేరకు ఆదా చేసుకునే వీలుంటుంది. ఓన్‌ డ్యామేజ్‌ను వదులుకోవడం అనేది మీరు వాహనం నడిపే తీరు, వాహనం విలువ, మీ ఆర్థిక స్తోమత ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ముందే పునరుద్ధరించాలి..
Vehicle Insurance Renewal After Expiry : సాధారణంగా గడువు ముగియడానికి ముందే వాహన బీమా పాలసీని పునరుద్ధరించడం ఉత్తమమని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రీమియంలో కొంత మేరకు రాయితీ లేదా ఆఫర్స్​ పొందే అవకాశం ఉంటుంది. అలాగే నో-క్లెయిం-బోనస్‌ కూడా పొందవచ్చు. గడువు ముగిస్తే దీన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

యూసేజ్‌ ఆధారిత పాలసీలు..
Vehicle Insurance Based On Usage : కొన్ని బీమా సంస్థలు యూసేజ్‌ ఆధారిత పాలసీలను అందిస్తున్నాయి. అంటే మన వాహన వినియోగాన్ని అనుసరించి పాలసీలను నిర్ధరిస్తారు. డ్రైవింగ్‌ బిహేవియర్‌, మైలేజ్‌, ఇప్పటి వరకు వాహనం ప్రయాణించిన దూరం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పాలసీని అందిస్తారు. ప్రీమియం కూడా అందుకు అనుగుణంగానే మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు తరచుగా వాహనాన్ని బయటకు తీసే అవసరం లేకపోతే.. ఇటువంటి పాలసీలను పరిశీలించవచ్చు. ఫలితంగా మీపై ప్రీమియం భారం తగ్గుతుంది.

యాడ్‌-ఆన్‌లు..
Vehicle Insurance Add On Covers : సాధారణ ఇన్సూరెన్స్‌ పాలసీకి కొన్ని యాడ్‌-ఆన్‌లను జత చేసుకుంటే అది మరింత సమగ్రమైన కవరేజ్​ను అందిస్తుంది. దీని వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది. తరచూ వరదలు ముంచెత్తే ప్రాంతాల్లో ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ ఉంటే మేలు జరుగుతుంది. ఒకవేళ ఇంజిన్‌లోకి నీరు వెళ్లి డ్యామేజ్ అయినా.. ఇన్సూరెన్స్‌ కవరేజ్​ వర్తిస్తుంది. అలాగే ‘రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌’ యాడ్‌-ఆన్‌ను తీసుకుంటే.. ప్రయాణం మధ్యలో వాహనం ఎక్కడైనా మొరాయించినప్పుడు.. ఖర్చు లేకుండా దానిని సర్వీసింగ్‌ చేసుకోవడానికి వీలవుతుంది.

సరైన బీమా కంపెనీ..
How To Choose Best Vehicle Insurance Policy : వాహన బీమా పాలసీ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ కంపెనీ విశ్వసనీయతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ‘క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో’ బాగా ఉన్న కంపెనీల్లో పాలసీ తీసుకోవడం ఉత్తమం. అలాగే వేగంగా.. తక్కువ పేపర్‌ వర్క్‌తో ఇన్సూరెన్స్​ అమౌంట్​ సెటిల్‌ చేసేలా ఉండాలి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందన్న కారణంతో అనామక కంపెనీల పాలసీలను ఎంచుకోకూడదు. ఆ బీమా సంస్థ క్లెయిం పరిష్కార చరిత్ర, అందించే సేవలను పూర్తిగా తెలుసుకున్నాకే వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

వివరాల్లో తప్పులుండొద్దు..
బీమా పాలసీ తీసుకునేటప్పుడు వాహనం వివరాలు, యజమాని వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. మీ దృష్టికి వచ్చిన అన్ని తప్పులను తక్షణమే బీమా సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలి. మోసపూరిత క్లెయింలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే ఇది శిక్షార్హమైన నేరం. వాహన బీమా పూర్తి జాగ్రత్తలతో తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే.. కష్టకాలంలో మన జేబుకే చిల్లు పడే అవకాశం ఉంటుంది.

Amazon Great Indian Festival 2023 : అమెజాన్ పండుగ సేల్​..​ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్​పై 80%.. టీవీలపై 60% వరకు డిస్కౌంట్!

Upcoming EV SUV Cars In India 2023 : రూ.10లక్షల్లోపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కార్లు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 450కి.మీ. రేంజ్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.