ETV Bharat / business

Upcoming Tata EV Cars : 500 కి.మీ రేంజ్​తో​.. సూపర్ స్టైలిష్​ లుక్స్​తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే! - Tata Sierra EV launch date

Upcoming Tata EV Cars In Telugu : టాటా కార్​ లవర్స్​కు గుడ్ న్యూస్. టాటా మోటార్స్ రానున్న ఒకటి, రెండేళ్లలో 5 ఎలక్ట్రిక్​ కార్లను ఇండియన్​ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి అవేమిటో ఓ లుక్కేద్దామా?

Upcoming Tata Cars in 2024
Upcoming Tata EV Cars
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 12:53 PM IST

Upcoming Tata EV Cars : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​.. రానున్న ఒకటి, రెండేళ్లలో 5 ఎలక్ట్రిక్​ కార్లను ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా హారియర్​ ఈవీ, పంచ్ ఈవీ, సియెర్రా ఈవీ, సఫారీ ఈవీ, కర్వ్​ ఈవీ కార్లను అందుబాటులోకి తెచ్చి.. తన ఈవీ పోర్ట్​ఫోలియోను మరింతగా విస్తరించుకోవాలని టాటా మోటార్స్​ ప్రణాళిక వేస్తోంది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Tata Punch EV Car Launch Date : టాటా మోటార్స్ బహుశా 2023 చివరిలోనే ఈ టాటా పంచ్​ ఈవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. చిన్న బడ్జెట్​లో మంచి ఎలక్ట్రిక్​ కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కారు మోడల్​ పలుమార్లు ఇండియన్​ రోడ్లపై కనిపించింది. ఈ కారు చాలా వరకు ICE పంచ్​ డిజైన్​లోనే ఉంది. అయితే జెన్​-2 సిగ్మా ఆర్కిటెక్చర్​తో, ఈవీ స్పెసిఫిక్​ డిజైన్​తో దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా పంచ్​ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది.

Tata Punch EV Car Range : ఈ టాటా పంచ్​ ఈవీలోని బ్యాటరీలను ఒకసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే.. దాదాపు 300 కి.మీ - 350 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

tata punch
టాటా పంచ్​

Tata Harrier EV Launch Date : 2023 ఆటో ఎక్స్​పోలో టాటా హారియర్​ ఈవీని ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్​ కారును బహుశా 2024లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.

Tata Harrier EV Range : ఈ టాటా హారియర్​ ఎలక్ట్రిక్​ కారులో 60 కిలోవాట్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందని.. దీనిని ఒకసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కారు డ్యూయెల్ మోటార్​ ఏడబ్ల్యూడీ సెటప్​తో వస్తుందని కూడా సమాచారం అందుతోంది.

Tata Harrier EV
టాటా హారియర్ ఈవీ కార్​
Tata Harrier EV
టాటా హారియర్ ఎలక్ట్రిక్​ కార్​

Tata Safari EV Launch Date : టాటా మోటార్స్​ కంపెనీ.. హారియర్​ ఈవీతోపాటే, సఫారీ ఈవీని కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టాటా సఫారీ కారు డిజైన్​ దాదాపు ICE సఫారీలానే ఉంటుంది. హారియర్​ ఈవీలో అమర్చిన పవర్​ట్రైన్​, ఏడబ్ల్యూడీ సిస్టమ్​లనే..​​ టాటా సఫారీలో కూడా పొందుపరచారని సమాచారం.

Tata Safari EV
టాటా సఫారీ ఈవీ
Tata Safari EV
టాటా సఫారీ ఈవీ

Tata Curvv EV Launch Date : టాటా మోటార్స్​ కంపెనీ గతేడాది ఏప్రిల్​లో ఈ కర్వ్​ ఈవీని పరిచయం చేసింది. సెకెండ్ జనరేషన్​ ఈవీ ఆర్కిటెక్చర్​తో దీనిని రూపొందించారు. ఈ కారు మల్టిపుల్​ బాడీ టైప్స్​, పవర్​ట్రైన్స్​తో వస్తుంది. బహుశా దీనిని 2024లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.

Tata Curvv EV Range : ఈ టాటా కర్వ్​ ఈవీ కారు రేంజ్ 400 కి.మీ - 500 కి.మీ ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Tata Curvv EV
టాటా కర్వ్​ ఎలక్ట్రిక్​​ కార్​
Tata Curvv EV
టాటా కర్వ్​ ఈవీ
Tata Curvv EV
టాటా కర్వ్​ ఈవీ

Tata Sierra EV Launch Date : 2023 ఆటో ఎక్స్​పోలో టాటా సియెర్రా ఈవీని ప్రదర్శించారు. బహుశా దీనిని 2025 సంవత్సరంలో ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో కూడా హారియర్​, సఫారీ లాంటి పవర్​ట్రైన్​నే అమర్చారని సమాచారం.

Tata Sierra EV
టాటా సియెర్రా ఎలక్ట్రిక్​ కార్​
Tata Sierra EV
టాటా సియెర్రా ఈవీ
Tata Sierra EV
టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్​

ఈవీ కార్స్ ​- మల్టిపుల్ ఆప్షన్స్​!
నేటి కాలంలో ఎలక్ట్రిక్​ కార్లకు విపరీతంగా డిమాండ్​ పెరుగుతోంది. అందుకే మారుతి సుజుకి, హ్యుందాయ్​, మహీంద్రా, టయోటా, హోండా, కియా సహా టాప్​ బ్రాండ్ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ సరికొత్త ఈవీ కార్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అంటే బయ్యర్లకు మల్టిపుల్​ ఆప్షన్స్​ లభించనున్నాయి.

Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : దీపావళికి మంచి కారు కొనాలా?.. రూ.15 లక్షల బడ్జెట్​లో బెస్ట్ కార్స్ ఇవే!

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.