ETV Bharat / business

18 ఏళ్లకే డాక్టర్​.. 22 ఏళ్లకే ఐఏఎస్​ ఆఫీసర్​.. 30 ఏళ్లకే రూ.2600 కోట్ల బిజినెస్​!..అతను ఎవరో తెలుసా?

author img

By

Published : Jul 9, 2023, 4:18 PM IST

Unacademy Roman Saini : ఓ యువకుడు కేవలం 18 ఏళ్లకే వైద్యుడు అయ్యాడు. 22 ఏళ్లకే కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు రూ.2600 కోట్లు విలువైన కంపెనీ స్థాపనలో కీలక పాత్ర వహించాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతనే రోమన్​ సైనీ..

roman saini
unacademy roman saini life story

Unacademy Roman Saini Success story : భారతదేశంలో ఎంతో మంది యువతీయువకులకు ఐఏఎస్​ సాధించడం ఒక కల. అందుకోసం ఏళ్ల తరబడి, ఎంతో ఏకాగ్రతతో చదువుతూ ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కేవలం 22 ఏళ్లకే యూపీఎస్​సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై.. నేరుగా ఐఏఎస్​కు ఎంపిక అయ్యాడు. కొన్నాళ్లు సివిల్​ సర్వెంట్​గా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాడు. కానీ అది తనకు సరిపడదని గ్రహించిన ఆ యువకుడు.. దానిని వదిలేసి, తన స్నేహితులతో కలిసి ఒక ఎడ్​-టెక్​ ప్లాట్​ఫాంను స్థాపించాడు. తరువాత దానిని అంచెలంచెలుగా రూ.2600 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దాడు. అతనే రోమన్​ సైనీ.

షార్ప్​ మైండ్
Roman Saini life story : భారతదేశంలోని మంచి ప్రతిభావంతులైన యువకుల్లో రోమన్​ సైనీ ఒకరు. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్​ ఎంట్రన్స్ ఎగ్జామ్​లో క్వాలిఫై అయ్యాడు. ఎలాంటి ఆటంకం లేకుండా ఎమ్​బీబీఎస్​ పూర్తి చేసి వైద్యునిగా పట్టా అందుకొన్నాడు. తరువాత నేషనల్​ డ్రగ్​ డిపెండెన్స్​ ట్రీట్​మెంట్​ సెంటర్​లో 6 నెలలపాటు పనిచేశాడు.

రోమన్​ సైనీ వైద్య విద్య పూర్తి చేసి, అనుభవం సంపాదించిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్​ సర్వీస్​ పరీక్షలపై దృష్టి పెట్టారు. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే యూపీఎస్​సీ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఐఏఎస్​ ఆఫీసర్​గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్​లో జిల్లా కలెక్టర్​గా సేవలు అందించారు.

యూట్యూబ్​ ప్రస్థానం
Unacademy YouTube channel : కలెక్టర్​గా ఉన్న సమయంలోనే తన స్నేహితులు గౌరవ్​ ముంజాల్​, హిమేష్​ సింగ్​లతో కలిసి.. యూట్యూబ్​లో సివిల్​ సర్వీస్​కు సంబంధించి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రోమన్​ సైనీ. ఇందుకోసం 'అన్అకాడమీ' అనే ఛానల్​ పెట్టారు. సివిల్స్ సాధించాలని తపించే యువతకు ఈ వేదిక ద్వారా ఉచితంగా పాఠాలు చెప్పారు. దీనికి దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది అభ్యర్థులు కేవలం అన్​అకాడమీ ప్లాట్​ఫాం ఉపయోగించుకుని సివిల్స్​ సాధించారంటే, అతిశయోక్తి కాదు.

అన్​అకాడమీ - కంపెనీ
Unacademy Business : వాస్తవానికి యూట్యూబ్​లో అన్​అకాడమీ ఛానల్​ బాగా పాపులర్ అయిన తరువాత దానిని బిజినెస్​గా మార్చాలని రోమన్​ సైనీ స్నేహితుడు గౌరవ్ ముంజాల్​ భావించారు. అనుకున్నదే తడవుగా ప్రత్యేకంగా అన్​అకాడమీ కంపెనీ స్థాపించారు. ఆన్​లైన్​లో సివిల్​ సర్వీస్​ ఉద్యోగార్థులకు కోచింగ్​ ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. తరువాత కాలంలో ఇదే వేదిక నుంచి మిగతా కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​కు కూడా కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా జేఈఈ, నీట్​, గేట్​, సీఏ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలతో పాటు, రెగ్యులర్​ అకడమిక్​ కోర్సులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.

ఈ విధంగా దినదినాభివృద్ధి చెందిన అన్​అకాడమీ కంపెనీ నేడు రూ.2600 కోట్ల విలువైన కంపెనీగా మారింది. బిజినెస్ ఐడియా గౌరవ్​ ముంజాల్​దే అయినా ఈ ఘనమైన ప్రస్థానానికి మూలం మాత్రం రోమన్​ సైనీనే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.