ETV Bharat / business

Tips For Choosing A Credit Card : సరైన​​​ క్రెడిట్ కార్డ్​ను ఎంచుకోవాలా?.. ఈ టిప్స్​ పాటించండి! - personal finance tips in telugu

Tips For Choosing A Credit Card In Telugu : మీరు.. మీ అవసరాలకు సరిపోయే మంచి క్రెడిట్​ కార్డ్​ను ఎంచుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. నేడు మార్కెట్​లో బెస్ట్ ఆఫర్స్​, డిస్కౌంట్స్ ఇచ్చే ఎన్నో క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు సరిపోయే ది బెస్ట్ క్రెడిట్ కార్డును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to choose the right credit card for you
Tips For Choosing A Credit Card
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 1:31 PM IST

Tips For Choosing A Credit Card : భారతదేశంలో క్రెడిట్ ల్యాండ్​స్కేప్​ అనేది చాలా వేగంగా, నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బ్యాంకులు మంచి క్రెడిట్​ హిస్టరీ ఉన్నవారికి లోన్స్​, క్రెడిట్​ కార్డులు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే నేడు కస్టమర్లు తమకు నచ్చిన క్రెడిట్ కార్డ్​ను​ ఎంపిక చేసుకునే అవకాశాలు చాలా మెరుగయ్యాయి. అయితే మీ అవసరాలకు సరిపోయే మంచి క్రెడిట్​ కార్డ్​ ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.

క్రెడిట్ హిస్టరీ బాగుండాలి!
Credit History Importance : నేటి కాలంలో మంచి క్రెడిట్ హిస్టరీ లేకపోతే.. బ్యాంక్​ లోన్స్​, క్రెడిట్ కార్డులు పొందడం అనేది చాలా కష్టం అవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మాత్రం.. బ్యాంకులు, రుణ సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు, క్రెడిట్​ కార్డులు మంజూరు చేస్తాయి. వీటిని దైనందిన ఖర్చులకు, కొనుగోళ్లకు ఉపయోగించడం వల్ల మన పని సులువు అవుతుంది. కానీ క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకోవడం ఖాయం.

ఆర్థిక భద్రత ముఖ్యం!
Credit Card Usage Tips : నేడు అనేక రకాల క్రెడిట్​ కార్డులు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. గ్యాడ్జెట్స్​ కొనుగోలు, విహారయాత్రలు, అత్యవసర వైద్య ఖర్చులు.. ఇలా భిన్నమైన అవసరాలకు అనుగుణంగా.. భిన్నమైన క్రెడిట్ కార్డులు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు క్రెడిట్​ కార్డును తీసుకునే ముందు.. మీ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకోవాలి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, ప్రస్తుతం ఉన్న రుణం తదితర అంశాలన్నింటినీ బేరీజు వేసుకోవాలి. ఆ తరువాత మాత్రమే.. మీ ఆర్థిక పరిధికి మించని క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా భద్రంగా ఉంటారు.

క్రెడిట్ కార్డు బెనిఫిట్స్
Credit Card Benefits : క్రెడిట్ కార్డు అంటే చాలా సులువుగా అప్పు తీసుకునే ఒక మార్గం అని గుర్తుంచుకోవాలి. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా, తెలివిగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలి. అప్పుడే మీకు ఉపయోగం ఉంటుంది. వాస్తవానికి మీకు ఇచ్చిన క్రెడిట్​ కార్డుకు ఒక పరిమితి (లిమిట్) ఉంటుంది. ఆ పరిమితిలో కేవలం 30 శాతం వరకు మాత్రమే మీరు ఉపయోగించుకోవడం మంచిది.

క్రెడిట్​ కార్డు ఉపయోగించడం వల్ల మీకు రివార్డ్ పాయింట్స్, లాయల్టీ ప్రోగ్రామ్స్​ లాంటి ప్రయోజనాలు అందుతాయి. వీటి ద్వారా మీరు కొనుగోలు చేసిన ప్రతిసారీ కొంత మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు గడువులోగా మీ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేస్తే.. వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైగా మీ క్రెడిట్ స్కోర్ పెరిగే ఛాన్స్​ కూడా ఉంటుంది. ఫలితంగా మీకు క్రెడిట్​ కార్డ్ ఆఫర్స్​ కూడా అధికంగా లభిస్తాయి.

స్పెసిఫిక్​ యూసేజ్​ కోసం..
Specific Usage Credit Card : క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు.. మీ ఖర్చులను (స్పెండింగ్​ హ్యాబిట్స్​) కూడా బాగా నియంత్రించుకోవాలి. లేదంటే కష్టం. సాధారణంగా క్రెడిట్ కార్డులు అందించే బ్యాంకులు క్యాష్​ బ్యాక్​, డిస్కౌంట్స్​ అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గృహావసర వస్తువులు, హోటల్​ బిల్స్​, ఎంటర్​టైన్​మెంట్​, ట్రావెల్​ ఖర్చులు చేసినప్పుడు.. క్యాష్ బ్యాక్​, డిస్కౌంట్స్ లభిస్తాయి. కానీ, కొన్ని క్రెడిట్ కార్డులను స్పెసిఫిక్​ యూసేజ్​ కోసం మాత్రమే అందిస్తారు. ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటే.. మీ క్రెడిట్​ కార్డు వినియోగంపైన.. ఎయిర్​ మైల్స్​, హోటల్ బుకింగ్ ఛార్జ్​లపై డిస్కౌంట్స్ అందిస్తూ ఉంటారు. దీని వల్ల మీ ప్రయాణ ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవడానికి వీలవుతుంది.

నిబంధనలు అన్నీ కచ్చితంగా తెలుసుకోవాలి?
Credit Card Rules And Regulations : మీరు ఎలాంటి క్రెడిట్ కార్డు ఎంచుకున్నప్పటికీ.. కచ్చితంగా వాటి నిబంధనలు అన్నీ చదువుకోవాలి. ముఖ్యంగా సదరు క్రెడిట్ కార్డు వడ్డీరేట్లు, యాన్యువల్ ఫీజు, పెనాల్టీస్​.. ఇలా అన్నింటి గురించి ముందుగానే తెలుసుకోవాలి.

బెస్ట్ క్రెడిట్ కార్డ్​ ఎంచుకోవడం ఎలా?
How To Choose Right Credit Card : నేడు బెస్డ్​ క్రెడిట్ కార్డును ఎలా ఎంచుకోవాలో.. తెలిపే​ ఆన్​లైన్​ కంపారిజన్​ టూల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ అర్హతలు, అవసరాలకు అనుగుణంగా మీకు ఎలాంటి క్రెడిట్ కార్డు అయితే సరిపోతుందో తెలియజేస్తాయి. వీటిని ఉపయోగించి మీరు.. మీకు సరిపోయే మంచి క్రెడిట్ కార్డును ఎంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించుకోవడం ఎలా?
Credit Card Usage Tricks :

  • ముందుగా రీసెర్చ్​ చేయాలి : మీకు సరిపోయే క్రెడిట్​ కార్డును ఎంచుకున్న తరువాత, దాని వడ్డీ రేట్లు, యాన్యువల్​ ఫీజు, పెనాల్టీ, నియమ, నిబంధనలు అన్నీ కచ్చితంగా తెలుసుకోవాలి.
  • తక్కువ లిమిట్ ఉన్న కార్డులను వాడాలి : మీరు మొదటిసారిగా క్రెడిట్ కార్డు వాడుతున్నట్లు అయితే.. తక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్​ కార్డును ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా మీ ఖర్చులు ఆ కార్డు పరిమితిలో 30 శాతానికి మించకుండా చూసుకోవాలి.
  • సకాలంలో బిల్లులు చెల్లించాలి : క్రెడిట్​ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ మరింత పెరుగుతుంది. ఒక వేళ మీరు సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే.. లేట్ పేమెంట్ ఫీజు/ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీ క్రెడిట్ స్కోర్​ కూడా తగ్గుతుంది.
  • క్రెడిట్ రెస్పాన్స్​బిలిటీ : క్రెడిట్ కార్డు ఉపయోగించేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కార్డ్​ పరిమితికి మించి ఖర్చు చేయకూడదు. బిల్లులను పెండింగ్ ఉంచకూడదు. అప్పుడే మీరు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా, సురక్షితంగా ఉంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.