ETV Bharat / business

క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు! - క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ ప్రోసెస్

క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకునే వారు తప్పనిసరిగా కార్డు మూసివేత అభ్యర్థనను చేసుకోవచ్చు. అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దు.

Credit Card
క్రెడిట్ కార్డ్
author img

By

Published : Nov 10, 2022, 12:04 PM IST

ఈ రోజుల్లో క్రెడిట్‌కార్డు పొందడం చాలా సులువు. క్యాన్సిల్‌ చేయడం మాత్రం.. అంత సులభం కాదు. క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ కస్టమర్లను కోల్పోకుండా అనేక మార్గాలను వెతుకుతుంటాయి. క్రెడిట్‌ కార్డు కస్టమర్లు కార్డు క్లోజ్‌ చేయడం కోసం సంస్థకు కాల్‌ చేసినప్పుడు.. కార్డు కొనసాగింపు కోసం కస్టమర్లను ఒప్పించేందుకు కార్డు పరిమితి పెంచడం, కార్డు అప్‌గ్రేడ్‌, వార్షిక ఛార్జీల నుంచి మినహాయింపు వంటి ఆఫర్లు ఇస్తుంటాయి. కార్డు మూసివేతకు ముందు రెండు మూడుసార్లయినా సంస్థ నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తుంటాయి.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. క్రెడిట్‌ కార్డు రద్దు కోసం కార్డుదారుడి నుంచి అభ్యర్థన వస్తే జారీ చేసిన సంస్థ ఆ అభ్యర్థనను తప్పనిసరిగా స్వీకరించాలి. కార్డుపై ఎటువంటి బకాయిలూ లేకపోతే ఏడు రోజుల్లోగా రద్దు ప్రక్రియ పూర్తిచేయాలి. ఒకవేళ నిర్దేశిత గడువులోగా కార్డును రద్దు చేయకపోతే, రద్దు చేసేంత వరకు రోజుకు రూ. 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

కార్డు మూసివేత అభ్యర్థనను ఈ-మెయిల్‌, ఎస్ఎంఎస్‌, ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ (ఐవీఆర్‌), ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌ లేదా మరేదైనా మార్గం ద్వారా పంపవచ్చు. అయితే పోస్టాఫీసు (అభ్యర్థన స్వీకరించడం ఆలస్యం కావచ్చు) ద్వారా మాత్రమే మూసివేత అభ్యర్థన పంపమని క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు కస్టమర్లను బలవంతం చేయలేవు. అలాగే, రద్దు చేసిన తర్వాత సంబంధిత సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా గానీ, ఈ-మెయిల్‌ ద్వారా గానీ కస్టమర్లకు తెలియజేయాలి.

ఎప్పుడు రద్దు చేసుకోవాలి?
మీ వద్ద ఎక్కువ క్రెడిట్‌కార్డులు ఉండి నిర్వహించడం కష్టమవుతోందని భావించినప్పుడు; క్రెడిట్‌ కార్డు అందించే ప్రయోజనాల కంటే వార్షిక ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు; వడ్డీరేటు అధికంగా ఉన్నప్పుడు మీ క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్‌ కార్డు, సెక్యూర్డ్‌ కార్డును వాడుతున్నవారైతే.. రెగ్యులర్‌ కార్డుగా మార్చుకునేందుకు కార్డును క్యాన్సిల్‌ చేసుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు క్యాన్సిల్‌ చేసేముందు..
బకాయిలు చెల్లించండి: కార్డు రద్దుకు ముందు కార్డుపై ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలి. ఒకవేళ ఔట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ ఉండగా రద్దు కోసం అభ్యర్థించినా.. కార్డు జారీ సంస్థలు మీ అభ్యర్థనను తిరస్కరిస్తాయి. అందువల్ల ఎలాంటి బకాయిలూ లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రద్దు కోసం కార్డు జారీ సంస్థను సంప్రదించాలి.

వినియోగంలో లేని కార్డుల విషయంలో: కొందరు చాలా రోజులుగా కార్డు ఉపయోగించడం లేదు కాబట్టి రద్దు చేయాలని, ఔట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేయకుండానే రద్దు కోసం అభ్యర్థిస్తారు. మీరు కార్డు ఉపయోగించకపోయినా, సంస్థలు ఛార్జీలను వర్తింపజేస్తూనే ఉంటాయి. కార్డు వార్షిక రుసుములు, వడ్డీ, ఆలస్యపు రుసుములు.. ఇలా వర్తించే ఛార్జీలతో చెల్లించాల్సిన మొత్తం పెరిగిపోవచ్చు. ఇవన్నీ చెల్లిస్తే తప్ప కార్డు రద్దుకు అనుమతించరు. అందువల్ల కార్డు అవసరం లేదనుకుంటే.. ఇలాంటి ఛార్జీలు వర్తింపజేయకముందే క్లోజ్‌ చేసేయడం మంచిది.

పెనాల్టీలు: కార్డు క్లోజ్‌ చేయాలనుకున్నప్పుడు మీ క్రెడిట్‌ కార్డు సంస్థ అనుసరించే నియమాలను తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల రద్దు సమయంలో ఏయే కారణాలతో పెనాల్టీలు వేస్తారో తెలుస్తుంది. చివరి నిమిషంలో ఎలాంటి ఛార్జీలు, పెనాల్టీలూ పడకుండా క్రెడిట్‌ కార్డు చివరి స్టేట్‌మెంటును పరిశీలించండి.

రివార్డు పాయింట్లు: వస్తు, సేవలను కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డును వినియోగించినప్పుడు.. ఖర్చు పెట్టిన మొత్తంపై జారీ సంస్థలు రివార్డుపాయింట్లను అందిస్తాయి. వీటిని ఉపయోగించడం ద్వారా కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అందువల్ల కార్డు రద్దు చేసేముందు రివార్డు పాయింట్లను పూర్తిగా రిడీమ్‌ చేసుకోవాలి.

ఆటోమేటిక్‌ బిల్లు చెల్లింపులు: ఆటోమేటిక్‌ బిల్లు చెల్లింపులు, బదిలీలు, చెల్లింపులకు నిర్ధిష్ట సూచనలు ఉంటే ముందుగా వాటిని రద్దు చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి సూచనలను రద్దు చేయడం మర్చిపోయి.. కార్డు రద్దు కావడానికి ముందే ఏదైనా చెల్లింపులు చేస్తే కార్డులో తిరిగి ఔట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ కనిపిస్తుంది. దీంతో మళ్లీ పెనాల్టీలు తప్పువు.

రద్దు తేదీ తెలుసుకోండి: కార్డు రద్దు కోసం అభ్యర్థన సమర్పించిన తర్వాత ఎన్ని రోజులకు రద్దు చేస్తారో కచ్చితమైన తేదీని కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి నిర్ధారించుకోండి. అలాగే, కార్డు రద్దు చేసిన తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తూ కార్డు జారీ సంస్థ నుంచి రాతపూర్వక నిర్ధారణను పొందడం మంచిది.

క్రెడిట్‌స్కోరు: క్రెడిట్‌ కార్డు రద్దు చేసినప్పుడు ఆ ప్రభావం క్రెడిట్‌ స్కోరుపై పడుతుంది. బ్యాలెన్స్‌ క్లియర్‌ చేయకుండా అభ్యర్థిస్తే క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. అలాగే, కార్డు మూసివేసినప్పుడు మీ మొత్తం క్రెడిట్‌ లిమిట్‌ తగ్గిపోయి, క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో పెరుగుతుంది. ఇది కూడా క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చివరిగా..
కార్డు వినియోగించట్లేదని అనుకున్నప్పుడు.. కార్డును రద్దు చేయడంలో తప్పులేదు. అయితే కార్డు రద్దుకు ముందు బకాయిలు పూర్తిగా చెల్లించడం, కార్డుపై ఉన్న ఆటోమేటిక్‌ పేమెంట్స్‌ను రద్దు చేయడం ముఖ్యం. అలాగే, క్రెడిట్‌ కార్డును క్యాన్సిల్‌ చేసినప్పుడు, దానికి అనుబంధంగా తీసుకున్న యాడ్‌-ఆన్‌ కార్డులు కూడా రద్దవుతాయి. కార్డు క్లోజ్‌ అయ్యిందని నిర్ధారించుకున్న తర్వాత కార్డును ముక్కలు చేసి నాశనం చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.