ETV Bharat / business

కారు ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు! - Smart Tips for Renewing Car Insurance

Car Insurance Renewal Tips : మీ కారు ఇన్సూరెన్స్ గడువు త్వరలో ముగుస్తోందా? రెన్యూవల్ చేసుకోబోతున్నారా? అయితే.. మీరు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Car Insurance
Car Insurance
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 5:03 PM IST

Renewing Car Insurance Remember Things : వాహనం కొనుగోలు చేసినప్పుడు ప్రతి వాహనానికీ బీమా తీసుకుంటారు. కానీ.. రెన్యూవల్ విషయానికి వచ్చే సరికి చాలా మంది పక్కన పెట్టేస్తారు. అయితే.. ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెన్యూవల్ సమయంలో ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌ - ఆఫ్​ లైన్? : మీ కారు ఇన్సూరెన్స్​ ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేయాలా? ఆఫ్​ లైన్​లో చేసుకోవాలా? అన్నప్పుడు.. ఆన్​లైన్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రీమియంపై రాయితీ పొందే ఛాన్స్ ఉంటుంది. ఆన్‌లైన్‌ పాలసీని విక్రయించడానికి బీమా కంపెనీకి ప్రత్యేకంగా ఏజెంట్లు లేదా ఆన్‌-బోర్టింగ్‌ బ్రోకర్లు అవసరం లేదు. దీంతో కంపెనీకి ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి మీకు కారు బీమా పాలసీ పునరుద్ధరణపై తగ్గింపు ఇస్తారు. అలాగే.. మీరు ఆన్‌లైన్‌లో వివిధ బీమా కంపెనీలు అందించే విభిన్న పాలసీ ప్లాన్స్‌ను సరిపోల్చుకొని అవకాశం ఉంటుంది. కంపేర్ చేసుకొని మెరుగైన పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.

AAI మెంబర్‌షిప్‌ : ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(AAI) మెంబర్‌షిప్‌ పొందడం ద్వారా మీ కారు బీమా ప్రీమియం మొత్తంపై కొన్ని అదనపు తగ్గింపులు లభిస్తాయి. కాబట్టి మెంబర్ షిప్​ గురించి ఆలోచించండి.

డెబిట్ కార్డ్​తో ఫ్రీగా ఇన్సూరెన్స్​ కవరేజ్​! ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?

క్లెయిమ్ సెటిల్మెంట్‌ హిస్టరీ : మీరు కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ ప్రీమియం తక్కువగా ఉండాలనే చూడొద్దు. ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిం సెటిల్మెంట్‌ రేషియోను కూడా గమనించాలి. క్లెయిమ్ ప్రక్రియ వేగంగా.. సజావుగా చేసే పేరున్న బీమా కంపెనీ నుంచి పాలసీ తీసుకోవాలి.

గడువు లోగా : గడువు తేదీలోపు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడం కుదరకపోతే టెన్షన్​ అవసరం లేదు. మరో 90 రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంటుంది. ఈ లోపు పాలసీ రెన్యువల్ చేసుకుంటే NCB లాంటి ప్రయోజనాలు కోల్పోకుండా ఉంటారు. ఒకవేళ మీరు అప్పటికీ రెన్యువల్‌ చేయకపోతే కొత్త పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు దానిపై అధిక ప్రీమియం కూడా చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల ఇన్ టైమ్​లో రెన్యూవల్ చేయండి.

మినహాయింపులు : పాలసీ రెన్యూవల్ సమయంలో స్వచ్ఛంద మినహాయింపును (voluntary deductible) ఎంచుకోవడం వల్ల ప్రీమియం కాస్త తగ్గుతుంది. అయితే.. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే.. ఈ మేరకు మీరు భరించాల్సి ఉంటుంది. కాబట్టి.. ఈ మినహాయింపులను జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.

యాంటీ-థెఫ్ట్‌ పరికరం : మీ కారు చోరీకి గురికాకుండా.. యాంటీ-థెఫ్ట్‌ పరికరం ఇన్‌స్టాల్‌ చేయండి. కారులో ఆటోమొబైల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ARAI) ఆమోదించిన యాంటీ-థెఫ్ట్‌ పరికరాలను తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వీటిని మీ వాహనంలో ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంపై తగ్గింపును కూడా అందిస్తాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రెన్యూవల్ చేసుకుంటే.. మీకు ప్రీమియం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Vehicle Insurance Renewal Guidelines : వాహన బీమా​ పాలసీని రెన్యూవల్​ చేస్తున్నారా!.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఫారిన్ ట్రిప్​కు వెళ్తున్నారా? ప్రయాణ బీమా మస్ట్! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.