Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice : గతంలో ఏ పనికైనా నగదు లావాదేవీలు జరిగేవి. కానీ.. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రాజ్యం నడుస్తోంది. దీంతో.. ప్రతిదీ రికార్డ్ అవుతోంది. "పెద్ద" వ్యవహారాలపై ఐటీ అధికారులు వెంటనే నిఘా పెడుతున్నారు. మరీ ముఖ్యంగా.. ఒక 5 రకాల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది. మరి, అవేంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఐటీ నోటీసులు పంపేందుకు అవకాశం ఉన్న టాప్ 5 నగదు లావాదేవీలివే..
These 5 Cash Transactions Could Land You an IT Notice :
బ్యాంక్ ఎఫ్డీ (Fixed Deposit) : ఎవరైనా ఖాతాదారుడు.. బ్యాంకులో డిపాజిట్ చేసే నగదు.. రూ.10 లక్షలకు మించకూడదు. అంతకుమించి డిపాజిట్ చేసే వారిపై ఆదాయపు పన్ను శాఖ కన్నేస్తుంది. అంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై వివరణ అడుగొచ్చు.
పొదుపు / కరెంట్ అకౌంట్( Savings Account Deposits) : ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా పొదుపు ఖాతాలో(Savings Account) నగదు డిపాజిట్ రూ.10 లక్షల కంటే ఎక్కువగా చేస్తే.. ఐటీ శాఖ ప్రశ్నించవచ్చు. కరెంట్ ఖాతాదారులకు ఈ పరిమితి ₹50 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని దాటినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు (Credit Card Bill Payment) : ప్రస్తుత రోజుల్లో శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే.. ఎవరైనా ఒకేసారి రూ.లక్ష కంటే ఎక్కువ నగదును ఈ క్రెడిట్ కార్డు బిల్లు(Credit Card Bill) చెల్లింపు కోసం వినియోగిస్తే.. వారిని ఐటీ అధికారులు ప్రశ్నించవచ్చు. అదేవిధంగా.. ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే.. ఆదాయపు పన్ను అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయవచ్చు.
రియల్ ఎస్టేట్ (Real Estate) : ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా నగదు రూపంలో పెద్ద లావాదేవీలు చేసినా.. అలాంటి వాటిని ఐటీ శాఖ గమనిస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని నగదు రూపంలో చెల్లింపు చేసినట్లయితే.. ఆ సమాచారం రిజిస్ట్రార్ తరపున ఐటీ శాఖకు తప్పక వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో ఆదాయపు పన్ను అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు పంపుతారనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
స్టాక్ మార్కెట్ / మ్యూచువల్ ఫండ్ / బాండ్ / డిబెంచర్(Investments) : పైన తెలిపిన పెట్టుబడుల నుంచి పొందిన నగదును.. బ్యాంకు అకౌంట్లో వేసి అందులో నుంచి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కూడా ఐటీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. రూ. 10 లక్షలకు మించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను అధికారులు తనిఖీ చేస్తారు. అందువల్ల.. పెట్టుబడి పెట్టే ముందే.. పరిమితులు, రూల్స్ గురించి తెలుసుకోవడం మంచిది.
ITR Refunds Big Update : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఐటీ రిఫండ్‌పై కీలక ప్రకటన!