ETV Bharat / business

స్పైస్​జెట్​లో వాటా విక్రయం.. వారితో సంప్రదింపులు.. దూసుకెళ్లిన షేరు - స్పైస్​జెట్ వాటా విక్రయం

Spicejet stake sale: స్పైస్​జెట్ ప్రమోటరు అజయ్ సింగ్ సంస్థలో ఉన్న తన వాటాలో కొంతభాగాన్ని విక్రయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఓ సంస్థ స్పైస్​జెట్​లో 24 శాతం వాటా కొనేందుకు సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధుల సేకరణ యత్నాలు ప్రారంభమయ్యాయన్న సంకేతాలతో స్పైస్​జెట్ షేరు దూసుకెళ్తోంది.

SPICEJET
SPICEJET
author img

By

Published : Aug 4, 2022, 7:31 AM IST

Updated : Aug 4, 2022, 7:47 AM IST

Spicejet stake sale: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నిధుల కొరత సమస్య నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. నిధులు సమీకరించే నిమిత్తం సంస్థ ప్రమోటరు అజయ్‌ సింగ్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకోసమని ఓ మధ్యప్రాచ్య విమానయాన సంస్థతో పాటు మన దేశానికి చెందిన దిగ్గజ కార్పొరేట్‌ సంస్థతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

విమానయాన సేవలను నిరాటంకంగా కొనసాగించాలంటే.. స్పైస్‌జెట్‌ సత్వరం మూలధన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 'నిధుల సమీకరణ కోసం పెట్టుబడిదార్లతో కంపెనీ చర్చలు జరుపుతోంది. ఇవి ఫలవంతమైతే ఆ వివరాలను నియంత్రణ సంస్థలకు తెలియజేస్తామ'ని స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో అజయ్‌ సింగ్‌కు 60 శాతం వాటా ఉంది. 'ఓ మధ్యప్రాచ్య సంస్థతో అజయ్‌ సింగ్‌ చర్చలు సాగిస్తున్నారు. ఆ సంస్థ 24 శాతం వాటా కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కంపెనీ బోర్డులో సభ్యత్వాన్ని అడుగుతోంది. ఓ దిగ్గజ దేశీయ సంస్థతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయ'ని స్పైస్‌జెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

  • స్పైస్‌జెట్‌ను 2004-05లో అజయ్‌ సింగ్‌ ప్రారంభించారు. తదుపరి కళానిధి మారన్‌ చేతికి వెళ్లినా, మళ్లీ 2015లో అజయ్‌సింగ్‌ ఆధీనంలోకి వచ్చింది.
  • ప్రస్తుతం దేశీయంగా 51 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రాంతీయ విమాన సేవల కింద పాక్యోంగ్‌, ఝార్సుగూడ, కాండ్లా, దర్భాంగా, కాన్పూర్‌, అజ్మీర్‌ (కిషన్‌గఢ్‌) తదితర గమ్యస్థానాలకూ సేవలను అందిస్తోంది.
  • ఇతర సంస్థలతో పోలిస్తే వేతనాలు తక్కువగా ఉన్నాయనే ఆందోళన కంపెనీ ఉద్యోగుల్లో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఉద్యోగులకు ఫామ్‌-16 కూడా ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ వార్తలు వెలుగులోకి వచ్చాయి.

5 రోజుల్లో 40 శాతం లాభం
నిధుల సమీకరణ యత్నం వార్తల నేపథ్యంలో, స్పైస్‌జెట్‌ షేరు ఇటీవల దూకుడు కనబరుస్తోంది. గత ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో షేరు 39.61% (రూ.14.20) పెరిగింది. బీఎస్‌ఈలో బుధవారం ఒక్క రోజే షేరు 12.73 శాతం (రూ.5.65) దూసుకెళ్లి రూ.50.05 వద్ద స్థిరపడింది.

Last Updated : Aug 4, 2022, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.