ETV Bharat / business

లీటర్ పెట్రోల్​పై రూ.20, డీజిల్​పై రూ.14.. మళ్లీ ధరలు పెంచక తప్పదా? - డీజిల్​ రేట్లు

Petrol price hike in India: ప్రభుత్వ రంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు కొంతకాలంగా వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఇటీవల కేంద్రం కూడా పెట్రోల్​పై రూ.8​, డీజిల్​పై రూ.6 మేర ఎక్సైజ్​ సుంకం తగ్గించింది. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రైవేట్​ ఆయిల్​ కంపెనీలు మాత్రం లబోదిబోమంటున్నాయి. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నాయి. కారణం ఏంటి?

Selling diesel at Rs 20-25/ltr loss, petrol at Rs 14-18/ltr loss: Pvt retailers to govt

author img

By

Published : Jun 19, 2022, 2:31 PM IST

Petrol price hike in India: కొద్దిరోజులుగా దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం లీటర్​ పెట్రోల్​పై రూ.8, డీజిల్​పై రూ. 6 మేర ఎక్సైజ్​ సుంకం తగ్గించింది. ప్రభుత్వ రంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు ధరల్ని స్థిరంగా కొనసాగిస్తున్నా.. మళ్లీ వినియోగదారులపై భారం మోపక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణం.. ప్రైవేట్​ రిటెయిలర్స్​. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగించడం తమ వల్ల కాదని జియో-బీపీ, షెల్​ పీఎల్​సీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ ఆయిల్​ కంపెనీలు తేల్చిచెబుతున్నాయి.

పెట్రోల్​, డీజిల్​ను తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని.. లీటర్​ పెట్రోల్​పై రూ. 20-25, డీజిల్​పై రూ.14-18 మేర నష్టపోతున్నామని ఇంధన మంత్రిత్వ శాఖకు తెలిపాయి ప్రైవేట్​ రిటెయిలర్స్​. వీలైనంత త్వరగా జోక్యం చేసుకొని.. సమస్యకు పరిష్కారం చూపాలని కోరాయి.

ఆయిల్​ మార్కెట్​లో 90 శాతం ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలోనే ఉంది. ఆ సంస్థలు పెట్రోల్​, డీజిల్​ను తక్కువ ధరకు విక్రయిస్తుండగా.. ప్రైవేటు సంస్థలపై భారం పడుతోంది. ఫలితంగా విక్రయం తగ్గి, వినియోగదారులను కోల్పోవాల్సి వస్తోంది.

2021 నవంబర్​ నుంచి.. 2022 మార్చి 21 వరకు అంటే దాదాపు 137 రోజులు.. పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా కొనసాగాయి. 5 నెలల తర్వాత 2022 మార్చి 22న తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. అదీ ఉక్రెయిన్​- రష్యా యుద్ధం కారణంగా క్రూడ్​ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో పెంచాల్సి వచ్చిందని కేంద్రం వివరణ ఇచ్చింది. వరుసగా 14 రోజులు.. సగటున 80 పైసల చొప్పున ఇంధన ధరలు పెంచుకుంటూ వెళ్లాయి చమురు సంస్థలు. మళ్లీ ఏప్రిల్​ 6 నుంచి స్థిరంగా ఉంచాయి.

ఈ నేపథ్యంలోనే.. రిటెయిలింగ్​ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్​ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్​ఐపీఐ) పేర్కొంది. అందుకే.. ప్రైవేట్​ రిటెయిలర్స్​కు మద్దతుగా నిలవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఇటీవల లేఖ కూడా రాసింది. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకపోతే భారీగా నష్టాలు వస్తున్నాయని.. ఇది డీలర్స్​, ట్రాన్స్​పోర్టర్స్​, ప్రత్యక, పరోక్ష ఉద్యోగులు అందరిపైనా ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. రీటెయిల్​ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనకు సరైన వాతావరణం కల్పించాలని కోరింది.

ఇవీ చూడండి: అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.234, డీజిల్​ రూ.263

సొంత వాహనాలు పెరిగాయి... పెట్రోల్, డీజిల్ వాడకమూ పెరిగింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.