ETV Bharat / business

SBI Annuity Deposit Scheme : ఒకసారి డిపాజిట్​ చేస్తే.. ప్రతి నెలా ఆదాయం గ్యారెంటీ!.. ఈ SBI స్కీమ్​ గురించి తెలుసా? - ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అర్హతలు

SBI Annuity Deposit Scheme In Telugu : ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు సాధారణ బ్యాంకింగ్‌ సేవలతో పాటు అనేక రకాల పొదుపు, మదుపు పథకాలను అందిస్తోంది. అందులో ఒకటి ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌. ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసి.. ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయంగా పొందాలని అనుకునేవారికి ఇది సరైన పథకం. దీని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

SBI Annuity Deposit Scheme Interest rate
SBI Annuity Deposit Scheme
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 8:51 AM IST

SBI Annuity Deposit Scheme : భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ మదుపరుల కోసం అనేక మంచి స్కీమ్స్​ను అందిస్తోంది. అందులో ప్రధానమైనది ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్​. దీనిలో ఒకేసారి (లప్సమ్​) పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్​ చేసి.. నెలవారీగా (పెన్షన్​ మాదిరిగా) ఆదాయం పొందవచ్చు.

ఇది బెస్ట్ ఆప్షన్​
మనలో చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టి.. ప్రతినెలా ఆదాయం పొందాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బయట వడ్డీలకు తిప్పడం అంత సురక్షితం కాదు. అలా అని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే.. కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడక తప్పదు. పోనీ ఎక్కడైనా మదుపు చేద్దామంటే.. కచ్చితంగా రాబడి వస్తుందన్న హామీ ఉండదు. అందుకే పెద్ద మొత్తంలో డబ్బు ఉండి.. నెలవారీగా ఆదాయం పొందాలని ఆశించే వారందరికీ ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌ సరిగ్గా సరిపోతుంది.

నెలవారీ ఆదాయం గ్యారెంటీ!
SBI Annuity Deposit Scheme Benefits : ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్​ స్కీమ్​లో మదుపు చేసిన వారికి, తరువాతి నెల నుంచే పేమెంట్స్ అందుతాయి. దీనిలో ప్రిన్సిపల్ అమౌంట్​, వడ్డీ రేటు రెండు కలిసి ఉంటాయి. అంటే.. మీరు కట్టిన మొత్తం సొమ్ములో కొంత భాగం, వడ్డీ కలిసి.. మీకు మంత్లీ ఇన్​స్టాల్​మెంట్​గా లభిస్తాయి.

స్కీమ్ కాల వ్యవధి ఎంత?
SBI Annuity Deposit Scheme Interest Rate : మదుపరులు 3 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు, 10 ఏళ్ల కాల వ్యవధులతో ఈ ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్​ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే స్కీమ్ వడ్డీ రేట్లు.. ఇదే కాలవ్యవధులు కలిగిన టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లకు సమానంగా ఉంటాయి. మిగతా మదుపరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఈ టర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు లభిస్తుంది.

సాధారణ ప్రజలకు ఆయా కాలవ్యవధులను అనుసరించి 2.90% - 5.40% వరకు వడ్డీ రేటు అందిస్తారు. సీనియర్ సిటిజన్లకు 3.40% - 6.20% వరకు వడ్డీ లభిస్తుంది.

ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయవచ్చు!
SBI Annuity Deposit Scheme Investment Limit ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్​ స్కీమ్​లో కనిష్ఠంగా రూ.25,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకానికి గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు అత్యవసరం ఏర్పడితే.. మీ డిపాజిట్ మొత్తంలో 75% వరకు రుణం తీసుకోవచ్చు. అలాగే ఈ డిపాజిట్​ స్కీమ్​ను మీకు నచ్చిన ఏ ఎస్​బీఐ బ్రాంచ్​కైనా బదిలీ చేసుకోవచ్చు.

ఈ పథకానికి అర్హులు ఎవరు?
SBI Annuity Deposit Scheme Eligibility : భారతీయ పౌరులందరికీ ఈ ఎస్​బీఐ యాన్యుటీ డిపాజిట్​ స్కీమ్‌లో చేరేందుకు అర్హత ఉంది. మైనర్ల పేరు మీద కూడా పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ కేటగిరీ కస్టమర్లు మాత్రం ఈ పథకంలో చేరడానికి వీలు పడదు.

ఎస్​బీఐ యాన్యుటీ స్కీమ్ ఫీచర్స్!
SBI Annuity Deposit Scheme Features :

  • భారతదేశంలోని అన్ని ఎస్‌బీఐ శాఖల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
  • నెలకు కనీసం రూ.1,000 యాన్యుటీ అందేలా డిపాజిట్‌ చేయాలి. అంటే కనీస మొత్తం రూ.25,000 వరకు మదుపు చేయాలి.
  • వాస్తవానికి ఈ స్కీమ్​లో డిపాజిట్‌ చేయాల్సిన మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.
  • 7-45 రోజుల నుంచి 5-10 ఏళ్ల కాలపరిమితిల్లో డిపాజిట్‌ చేయొచ్చు.
  • ఎస్​బీఐ టర్మ్‌ డిపాజిట్‌కు వర్తించే వడ్డీరేట్లనే.. యాన్యుటీ ప్లాన్‌కు కూడా వర్తింపజేస్తారు.
  • ప్రతినెలా అందించే యాన్యుటీ మొత్తాన్ని.. పాలసీదారుని బ్యాంకు పొదుపు లేదా కరెంటు ఖాతాలో జమ చేస్తారు.
  • దేశంలోని ఏ ఎస్‌బీఐ బ్రాంచికైనా ఈ పథకాన్ని బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
  • వ్యక్తిగత ఖాతాలు ఉన్నవారు మాత్రమే నామినీని ఏర్పాటు చేసుకోవడానికి అర్హులు. జాయింట్ ఖాతాలు ఉన్నవారు నామినీని ఏర్పాటు చేసుకోవడానికి వీలుపడదు.
  • ఈ స్కీమ్​లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. మీరు ఏ తేదీనైతే డిపాజిట్‌ చేస్తారో.. ప్రతినెలా అదే రోజున యాన్యుటీ అందుతుంది. ఒకవేళ ఆ తేదీ (29, 30, 31 లాంటి తేదీలు) ఏదైనా నెలలో లేనట్లయితే వచ్చే నెల మొదటి రోజు యాన్యుటీ మొత్తం పాలసీదారు ఖాతాలో జమ అవుతుంది.
  • ప్రతినెలా యాన్యుటీ అందుకోవడమే కాదు.. మిగిలిన మొత్తంపై 75% వరకు రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌ పొందవచ్చు.
  • లోన్‌ తీసుకుంటే యాన్యుటీ మొత్తం.. లోన్‌ ఖాతాలో డిపాజిట్‌ అవుతుంది.
  • టర్మ్ డిపాజిట్ యూనివర్సల్ పాస్‌బుక్ ద్వారా భర్తీ చేయబడింది.
  • రూ.15 లక్షలు వరకు చేసే డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. అయితే, టర్మ్‌ డిపాజిట్‌ నిబంధనల ప్రకారం, కచ్చితంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ డిపాజిటర్‌ మరణిస్తే.. మిగిలిన మొత్తాన్ని నామినీకి లేదా చట్టపరమైన వారసులకు అందిస్తారు. పైగా ఎలాంటి పెనాల్టీ విధించరు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.5 లక్షలను ఐదేళ్ల కాలపరిమితితో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేశాడనుకుందాం. ఈ మొత్తానికి ప్రస్తుతం ఉన్న టర్మ్‌ డిపాజిట్‌ రేట్ల ప్రకారం 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన సదరు వ్యక్తికి నెలకు దాదాపు రూ.9,750 స్థిరమైన యూన్యుటీ అందుతుంది. దీంట్లో రూ.2,710 వడ్డీ కాగా.. మిగిలిన మొత్తాన్ని రూ.5 లక్షల డిపాజిట్‌ నుంచి చెల్లిస్తారు. ఇలా ప్రతి నెలా డిపాజిట్‌ కొంత మొత్తం మేర తగ్గుతూ వస్తుంది. అందువల్ల నెలనెలా వచ్చే వడ్డీ సైతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. సింపుల్​గా చెప్పాలంటే.. ప్రతినెలా యాన్యుటీ మొత్తంలో డిపాజిట్‌ నుంచి చెల్లించే వాటా పెరుగుతూ ఉంటుంది.

2000 Notes Exchange Last Date Extended : రూ.2000 నోట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన.. డిపాజిట్​/ ఎక్స్ఛేంజ్​​ గడువు అక్టోబర్ 7 వరకు పెంపు!

Amazon Great Indian Festival 2023 : అమెజాన్ పండుగ సేల్​..​ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్​పై 80%.. టీవీలపై 60% వరకు డిస్కౌంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.