ETV Bharat / business

క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్​ వైపు చూస్తారా..? - సత్య నాదేళ్ల న్యూస్

Major league cricket: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల క్రికెట్ లీగ్​లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి మేజర్​ లీగ్ క్రికెట్ పేరుతో అమెరికా నిర్వహించే టీ20 టోర్నీకి 42 మిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. ఇందులో సత్య నాదెళ్లనే కీలక ఇన్వెస్టర్​. ఆయన ఇప్పటికే ఓ సాకర్ టీంకు సహ యజమానిగా ఉన్నారు.

satya-nadella
వచ్చే ఏడాది నుంచి అమెరికా మెగా​ క్రికెట్ లీగ్.. సత్య నాదెళ్ల భారీ పెట్టుబడులు
author img

By

Published : May 20, 2022, 11:05 AM IST

Satya Nadella: క్రికెట్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలకనుంది అమెరికా. వచ్చే ఏడాది నుంచి మేజర్ లీగ్​ క్రికెట్​(ఎంఎల్​సీ) పేరుతో కొత్త టోర్నీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టీ20 లీగ్ కోసం ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే 44 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇందులో మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ఇన్వెస్టర్​గా ఉన్నారు. ఆయన ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్​లో సియాటెల్ సౌండర్స్​ సహ యజమాని. ఇప్పుడు క్రికెట్​లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Major league cricket news: ఎంఎల్​సీ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్​ డాలర్లు సమకూరగా.. రానున్న 12 నెలల్లో మరో 76 మిలియన్లు సమాకూర్చనున్నారు. ఎంఎల్​సీ టీ20 లీగ్ కోసం 6 ప్రాంఛైజీలకు అమెరికా క్రికెట్​ అనుమతిచ్చింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడగా ఉన్న క్రికెట్​కు అమెరికాలో కూడా ఆదరణ పెంచాలని ఆ దేశం భావిస్తోంది. అందుకే అక్కడి బడా వ్యాపారవేత్తలు ఈ టోర్నీ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ 120 మిలియన్ డాలర్లతో అమెరికాలో మంచి క్రికెట్​ పిచ్​లున్న స్టేడియాలు ఏర్పాటు చేయడం సహా, ఆటగాళ్లు, అభిమానుల కోసం అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. అమెరికాలో కొత్త తరం క్రికెటర్లను తయారు చేయనున్నారు. అంతేకాదు వచ్చే పదేళ్లలో అక్కడ అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఏటా నిర్వహించే ఎంఎల్​సీలో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ టోర్నీని విజయవంతం చేసి అమెరికాను కూడా క్రికెట్​కు నిలయంగా మార్చాలనుకుంటున్నారు.

Microsoft CEO Satya Nadella: ఎంఎల్​సీ ఇన్వెస్టర్లలో సత్య నాదెళ్ల సహా మడ్రోనా వెంచర్ గ్రూప్​ ఎండీ సోమ సోమసెగార్​, ఆనంద్ రాజరామన్​, వెంకీ హరినారాయణ్(మిల్లివేస్ వెంచర్స్​ అండ్ రాకెట్​షిప్​ వీసిలో సహ వ్యవస్థాపకులు), సంజయ్ గోవిల్​(ఇన్ఫినైట్​ కంప్యూటర్ సోల్యూషన్స్​ వ్యవస్థాపకులు), అనురాగ్ జైన్​, తన్వీర్ అహ్మద్​, బహెటి ఫ్యామిలీ వంటి ప్రముఖులు ఉన్నారు.

Satya Nadella Cricket: ప్రపంచంలో అత్యంత ఆదరణ గల ఆటల్లో క్రికెట్ ఒకటి. భారత్​ ఐపీఎల్​ వంటి మెగా టోర్నీని ఏటా నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా బిగ్​బాష్ లీగ్​కు మంచి స్పందన లభిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్​ వంటి దేశాలు కూడా ఏటా ప్రత్యేక టోర్నీలతో క్రికెట్​ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే అమెరికాలో క్రికెట్​కు అంత ఆదరణ లేదు. ఇప్పుడిప్పుడే ఆ దేశం ఈ ఆటపై దృష్టి సారిస్తోంది. ఎంఎల్​సీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.