ETV Bharat / business

Reliance Jio Special Offers : జియో ప్రీపెయిడ్​ ప్లాన్స్​పై స్పెషల్ ఆఫర్స్​.. మరికొద్ది రోజులే ఛాన్స్​! - రిలయన్స్ జియో స్పెషల్ డిస్కౌంట్స్ 2023

Reliance Jio Special Offers In Telugu : రిలయన్స్ జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన ప్రీపెయిడ్​ ప్లాన్స్​పై బంపర్ ఆఫర్స్​, బోనస్​ బెనిఫిట్స్​ అందిస్తోంది. అలాగే అడిషనల్ డేటాను కూడా ఉచితంగా ఇస్తోంది. ఈ ఆఫర్స్​ కేవలం సెప్టెంబర్​ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ఈ జియో ఆఫర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Reliance Jio celebrates 7th anniversary with bonus benefits on prepaid plans
Reliance Jio Special Offers
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 3:59 PM IST

Reliance Jio Special Offers : రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్​ న్యూస్​. రిలయన్స్ జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఎంపిక చేసిన ప్రీపెయిడ్​ ప్లాన్స్​పై అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ముఖ్యంగా రూ.299 ప్లాన్​పై 7జీబీ ఎక్స్​ట్రా డేటా, రూ.749 ప్లాన్​పై 14జీబీ ఎక్స్​ట్రా డేటా ఇస్తోంది. అలాగే రూ.2,999 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్​పై ఏకంగా 21జీబీ వరకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం సెప్టెంబర్​ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఎక్స్​ట్రా బెనిఫిట్స్​ కూడా!
Jio 7th Anniversary Prepaid Plan Offers : రిలయన్స్ జియో ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​లపై అదనపు డేటా మాత్రమే కాదు.. మెక్​డొనాల్డ్స్​​​, రిలయన్స్ డిజిటల్​, ఫ్లైట్స్​, హోటల్స్​, ఆజియో, నెట్​మెడ్స్ కొనుగోళ్లుపై కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ :
Jio 299 Plan Benefits : రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్​ను రీఛార్జ్​ చేసుకున్నవారికి.. అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్​, 100 ఎస్​ఎంఎస్​, సహా రోజువారిగా 2జీబీ డేటా లభిస్తుంది. అయితే జియో 7వ వార్షికోత్సవ ఆఫర్​ కింద అదనంగా 7జీబీ డేటాను ఉచితంగా అందుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ :
Jio 749 Plan Benefits : రూ.749 జియో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి.. అపరిమిత వాయిస్ కాలింగ్​ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రతి రోజూ 100 ఎస్​ఎంఎస్​లు, 2జీబీ డేటా చొప్పున లభిస్తాయి. దీనితో పాటు రెండు 7జీబీ డేటా కూపన్లు కూడా అదనంగా దొరుకుతాయి. అంటే ఏకంగా 14జీబీ అనేది వినియోగదారులకు లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్​ వ్యాలిడిటీ 90 రోజులు.

రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్​ :
Jio 2999 Plan Offer : రూ.2,999 యాన్యువల్ జియో ప్రీపెయిడ్ ప్లాన్​ తీసుకున్నవారికి అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్​ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే రోజువారీగా 100 ఎస్​ఎంఎస్​లు, 2.5జీబీ చొప్పున డేటా లభిస్తాయి. స్పెషల్ ఆఫర్ కింద మూడు 7జీబీ కూపన్లు అందుతాయి. అంటే వినియోగదారునకు ఏకంగా 21జీబీ అదనంగా లభిస్తుంది.

కాంప్లిమెంటరీ ఆఫర్స్​
Jio 2999 Complimentary Benefits :

  • రూ.2,999 జియో ప్రీపెయిడ్ ప్లాన్​ తీసుకున్నవారికి కాంప్లిమెంటరీగా మెక్​డొనాల్డ్స్​ మీల్​ పర్చేస్​ ఆఫర్ లభిస్తుంది. రూ.149 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే మీల్స్​ కొనుగోలు చేసినవారికి ఈ ఆఫర్​ పనికొస్తుంది.
  • ఈ జియో యాన్యువల్ ప్రీపెయిడ్ తీసుకున్నవారికి రిలయన్స్ డిజిటల్​ స్టోర్​లో 10 శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. అలాగే ఫ్లైట్​ టికెట్​ బుకింగ్ చేస్తే రూ.1500 వరకు ధర తగ్గింపు లభిస్తుంది. అలాగే యాత్రా వెబ్​సైట్ ద్వారా హోటల్​ రూమ్​ బుక్​ చేస్తే 15 శాతం (గరిష్ఠంగా రూ.4000) వరకు తగ్గింపు లభిస్తుంది.
  • రూ.2,999 ప్లాన్ తీసుకున్న యూజర్లకు ఆజియోపై 20% డిస్కౌంట్​, నెట్​మెడ్స్​పై 20 శాతం డిస్కౌంట్​ (గరిష్ఠంగా రూ.800) వరకు లభిస్తుంది.
  • మీరు ఈ స్పెషల్ జియో ఆఫర్స్​ను.. జియో అధికారిక వెబ్​సైట్​ లేదా జియో యాప్​ ద్వారా పొందవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ స్పెషల్ ఆఫర్స్ ఈ సెప్టెంబర్​ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.