ETV Bharat / business

Q3లో అదరగొట్టిన జియో.. లాభాల్లో 28% వృద్ధి.. ఆదాయం కూడా.. - Reliance October December Quarterly Results 2022

టెలికాం విభాగం జియో మూడో త్రైమాసికంలో రూ.4,638 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 28.3 శాతం అధికం. అయితే రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మాత్రం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ నికర లాభం 15 శాతం క్షీణత నమోదు చేసింది.

reliance-industries-and-jio-october-december-quarterly-results-2022
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూడో త్రైమాసిక ఫలితాలు 2022
author img

By

Published : Jan 20, 2023, 9:26 PM IST

Updated : Jan 20, 2023, 10:35 PM IST

రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో మూడో త్రైమాసికంలో రూ.4,638 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే 28.3 శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం రూ.19,347 కోట్ల నుంచి రూ.22,993 కోట్లకు పెరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 134 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నికర లాభం 15 శాతం క్షీణత నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.18,549 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ఈ సారి రూ.15,792 కోట్లు ఆర్జించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.1,91,271 కోట్ల నుంచి రూ.2,20,592 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
కాగా, క్యూ3 ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్​ అంబానీ మాట్లాడారు. సవాలుతో కూడిన వాతావరణంలోనూ వ్యాపార బృందాలు అద్భుతమైన పనితీరును కనబరిచాయని ప్రశంసించారు.

Last Updated : Jan 20, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.