ETV Bharat / business

బ్యాంక్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ - మినిమం బ్యాలెన్స్ లేకపోయినా నో పెనాల్టీ!

RBI New Guidelines In Telugu : మినిమం బ్యాలెన్స్ మెయింటైన్​ చేయని ఖాతాదారులపై బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదని ఆర్​బీఐ స్పష్టం చేసింది. ఇన్ఆపరేటివ్​గా ఉన్న ఖాతాను తిరిగి యాక్టివేట్​ చేయడానికి కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్దేశించింది. పూర్తి వివరాలు మీ కోసం.

inoperative accounts in India
RBI New Guidelines
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 2:40 PM IST

RBI New Guidelines : ఇన్​ఆపరేటివ్​ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా, బ్యాంకులు ఖాతాదారులపై ఎలాంటి జరిమానాలు విధించకూడదని రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. స్కాలర్​షిప్​ డబ్బుల కోసం, డైరెక్ట్ బెనిఫిట్​ బదిలీల కోసం తెరచిన ఖాతాలను రెండేళ్లకు మించి ఉపయోగించకపోయినా, వాటిని ఇన్​ఆపరేటివ్​ అకౌంట్​లుగా పరిగణించకూడదని పేర్కొంది.

ఏప్రిల్ 1 నుంచి అమలు
క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆర్​బీఐ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వీటిలో భాగంగానే ఇన్​ఆపరేటివ్​ బ్యాంకు ఖాతాల గురించి స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనలు అన్నీ ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, మినిమం బ్యాలెన్స్ లేదని, రెండేళ్లుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదనే నెపంతో, బ్యాంకులు ఖాతాదారులపై పెనాల్టీలు వేయకూడదు.

"క్లెయిమ్ చేయని డిపాజిట్లను, అసలైన ఖాతాదారులకు లేదా వారి నామినీలకు లేదా కుటుంబీకులకు అందించేందుకు ఈ తాజా నిబంధనలు ఉపకరిస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి ఆర్​బీఐ సహా బ్యాంకులు అన్నీ గణనీయంగా కృషి చేస్తున్నాయి."
- ఆర్​బీఐ సర్క్యులర్​

కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్​లు​, ఈ-మెయిల్స్​, లెటర్స్ పంపించి, క్లెయిమ్ చేయని వారి ఖాతాల గురించి స్పష్టంగా తెలియజేయాలి. ఒక వేళ ఖాతాదారుడు స్పందించకపోతే, అతనిని పరిచయం చేసిన వ్యక్తిని లేదా నామినీలను కచ్చితంగా సంప్రదించాలి.

అదనపు ఛార్జీలు, పెనాల్టీలు బంద్​!
'ఇన్​యాక్టివ్​ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్​ లేకపోయినా, ఖాతాదారులపై బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదు. ఇన్ఆపరేటివ్​గా ఉన్న ఖాతాను తిరిగి యాక్టివేట్​ చేయడానికి కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు' అని ఆర్​బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

పెరుగుతున్న అన్​క్లెయిమ్డ్ డిపాజిట్లు
ఆర్​బీఐ నివేదిక ప్రకారం, గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య 28 శాతం పెరిగింది. స్పష్టంగా చెప్పాలంటే, 2022 మార్చి చివరినాటికి రూ.32,934 కోట్ల విలువైన క్లెయిమ్​ చేయని డిపాజిట్లు ఉంటే, 2023 మార్చి చివరి నాటికి వాటి విలువ రూ.42,272 కోట్లకు పెరిగింది.

10 ఏళ్లకు పైగా ఆపరేట్ చేయకపోతే?
పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ఆపరేట్ చేయని బ్యాంకు ఖాతాలలోని సొమ్మును, ఆర్​బీఐ నిర్వహించే డిపాజిటర్​ అండ్ ఎడ్యుకేషన్ ఆవేర్​నెస్​ ఫండ్​కు బదిలీ చేస్తారు.

నిబంధనల అతిక్రమణ జరుగుతూనే ఉంది!
మినిమం బ్యాలెన్స్​లు నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ వేయకూడదని, బ్యాంకులకు గతంలోనే ఆర్​బీఐ నిర్దేశించింది. అంతేకాదు సదరు ఖాతాలు నెగిటివ్ బ్యాలెన్స్​లోకి వెళ్లకుండా చూడాలని కూడా స్పష్టం చేసింది. కానీ నేటికీ చాలా బ్యాంకులు పెనాల్టీలు విధిస్తూనే ఉన్నాయి.

ఆధార్ పేపర్​లెస్​​ ఆఫ్​లైన్​ e-KYC - 'ఎమ్ఆధార్'​ నయా ఫీచర్​

755 రూపాయలకే రూ.15 లక్షల ప్రమాద బీమా! పిల్లల చదువులకు అదనంగా మరో రూ.1లక్ష కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.