ETV Bharat / business

చిల్లర సమస్యకు చెక్​- క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో కాయిన్స్​- ఎలా విత్​ డ్రా చేయాలో తెలుసా?

QR Based Coin Vending Machine : దేశంలో చిల్లర సమస్యను తగ్గించడానికి ఆర్‌బీఐ కాయిన్‌ బేస్‌డ్ వెండింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వెండింగ్‌ మిషిన్లను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

QR Based Coin Vending Machine
QR Based Coin Vending Machine
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 9:56 AM IST

QR Based Coin Vending Machine : దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో బ్యాంకుల వద్ద ఎక్కువ క్యూ లైన్లు ఉండటంతో చాలా మంది డిజిటల్​ పేమెంట్ల వైపు మొగ్గు చూపారు. దేశంలో ఎక్కడ ఉన్న వారికైనా సురక్షితంగా నగదును బదిలీ చేసే సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్లను ఎంచుకున్నారు. అయితే ఈ పేమెంట్‌ల వల్ల చిల్లర సమస్యలు కొంత మేర తగ్గినా.. మిగతా చోట్ల చిల్లర తప్పని సరిగా అవసరం అవుతోంది.

కాగా, చిల్లర సమస్యను తొలగించడానికి రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాయిన్ బేస్‌డ్ క్యూఆర్‌ కోడ్ వెండింగ్ మెషీన్లను (క్యూసీవీఎం-QCVM) ప్రవేశపెట్టింది. వీటిని తొలుత దేశంలోని 12 నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం డబ్బులను విత్​ డ్రా చేసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో.. అలాగే నోట్లకు బదులు కాయిన్స్​ కావాలనుకునేవారికి ఈ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెషిన్లలో స్క్రీన్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం వల్ల కావాల్సిన నాణేలను పొందవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును చెల్లించి నాణేలు పొందొచ్చు. ఈ క్యూఆర్‌ కోడ్‌ కాయిన్‌ బెస్‌డ్‌ మెషీన్లను మొదట రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్స్​.. వంటి ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. క్యూసీవీఎంల నిర్వహణను బ్యాంకులు నిర్వహిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

క్యూసీవీఎంలు ఎక్కడ ఉన్నాయి?

క్యూసీవీఎంలు ప్రస్తుతం దేశంలోని 12 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాలు:

  • బెంగుళూరు
  • చెన్నై
  • దిల్లీ
  • గుజరాత్
  • హైదరాబాద్
  • ఇండోర్
  • జైపూర్
  • ఝార్ఖండ్
  • కోల్‌కతా
  • లఖ్​నవూ
  • ముంబయి
  • పుణె

క్యూసీవీఎం ప్రయోజనాలు:

  • సులభతరం: క్యూసీవీఎం ద్వారా కాయిన్స్​ పొందడం చాలా ఈజీ.
  • నోట్లే అవసరం లేదు: క్యూసీవీఎంలు.. వినియోగదారులు నోట్లను ఉపయోగించకుండానే నాణేలను పొందేందుకు అనుమతిస్తాయి.
  • డిజిటల్ చెల్లింపులు: క్యూసీవీఎంలు యూపీఐ సాంకేతికత ఆధారంగా పనిచేస్తాయి. ఇది డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
  • 24/7 అందుబాటులో ఉంటుంది: QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లు 24/7 అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా కాయిన్స్​ పొందవచ్చు.

క్యూఆర్‌ కోడ్‌ మిషిన్ల నుంచి చెల్లింపులను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మీకు దగ్గరలో ఉన్న కాయిన్ వెండింగ్ మెషిన్‌ను సందర్శించండి.
  • UPI యాప్‌తో QR కోడ్‌ని స్కాన్ చేయండి.
  • మీకు అవసరమైన కాయిన్స్​ సెలక్ట్‌ చేసుకుని పేమెంట్ చేయండి.
  • పేమెంట్‌ పూర్తైన తరవాత మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నగదు డెబిట్ అవుతుంది. తర్వాత మీరు కాయిన్స్​ తీసుకోవచ్చు.
  • ఇలా సులభంగా మీరు స్మార్ట్ ఫోన్‌ సహాయంతో యూపీఐ యాప్‌లను ఉపయోగించి చిల్లరను సేకరించవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

డిసెంబర్​​లో 6 రోజులపాటు బ్యాంకులు బంద్​ - AIBEA సమ్మె ఎఫెక్ట్​!

అనవసర ఖర్చులు పెరిగిపోయాయా? ఈ సింపుల్ టెక్నిక్స్​తో డబ్బు ఆదా!

మీ పిల్లల పేరుపై ఎఫ్​డీ అకౌంట్​​ ఓపెన్ చేయాలా? - బ్యాంకుల నయా రూల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.