ETV Bharat / business

రూ.99కే స్నాక్స్.. అన్​లిమిటెడ్ పాప్​కార్న్​, పెప్సీ.. PVR బంపర్ ఆఫర్.. ఆ ట్వీట్ కారణంగానే.. - PVR Cinemas Snacks

PVR Cinemas Snacks Price : ప్రముఖ మల్టీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్.. తమ థియేటర్లలో విక్రయంచే స్నాక్స్, పెప్సీ ధరలను భారీగా తగ్గించింది. ఇకపై రూ. 99కే అపరిమిత పాప్​కార్న్, పెప్సీ పొందవచ్చని ఆఫర్​ను ప్రకటించింది.

pvr cinemas offers on snacks
స్నాక్స్​పై పీవీఆర్ భారీ ఆఫర్
author img

By

Published : Jul 13, 2023, 2:16 PM IST

PVR Cinemas popcorn Price : ప్రముఖ మల్టీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్.. తమ థియేటర్లలో స్నాక్స్, పెప్సీ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇకపై వీక్​ డేస్​లో రూ. 99కే స్నాక్స్​ కాంబో అందిస్తున్నట్లు వెల్లడించింది. వీకెండ్​లో అపరిమితమైన పాప్​కార్న్, పెప్సీని పొందే ఆఫర్​ను పీవీఆర్ ప్రకటించింది. ఓ సామాన్య సినీప్రియుడు.. పీవీఆర్​లో అధిక​ ధరలపై చేసిన ట్వీట్​కు స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ జరిగింది..
ఉత్తర్​ప్రదేశ్ నొయిడా 'పీవీఆర్​ సినిమాస్'​లో మూవీ చూసేందుకు వెళ్లిన త్రిదిప్​ కే మండల్​ అనే వ్యక్తికి.. అక్కడ అధిక ధరల షాక్ తగిలింది. రెగ్యులర్​ సైజ్​ చీజ్​ పాప్​కార్న్​, 600 మిల్లీ లీటర్ల ఓ కూల్​డ్రింక్​కు థియేటర్ నిర్వాహకులు వసూల్ చేసిన బిల్లు చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ బిల్లు ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసి.. " నొయిడా పీవీఆర్ సినిమాస్​లో.. 55 గ్రాముల చీజ్​ పాప్​కార్న్​ ధర రూ. 460, 600 మిల్లీలీటర్ల పెప్సీ ధర రూ.360గా ఉంది. మొత్తం రూ.820. ఇది అమెజాన్ ప్రైమ్​ వార్షిక చందాకు దాదాపు సమానం. ప్రజలు సినిమాలకు వెళ్లకపోవడంలో ఆశ్చర్యం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం చాలా కష్టం" అని రాసుకొచ్చారు.

  • Rs 460 for 55gm of cheese popcorn, Rs 360 for 600ml of Pepsi. Total Rs 820 at @_PVRCinemas Noida.

    That’s almost equal to annual subscription of @PrimeVideoIN.

    No wonder people don’t go to cinemas anymore. Movie watching with family has just become unaffordable. pic.twitter.com/vSwyYlKEsK

    — Tridip K Mandal (@tridipkmandal) July 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్వీట్​ వైరల్..
త్రిదిప్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మల్టీప్లెక్స్​లు స్నాక్స్, పెప్సీ​​కు అంతంత ఛార్జీలు వసూల్ చేయడం పట్ల నెటిజన్లు మండిపడ్డారు. త్రిదిప్​ చేసిన పోస్ట్​కు కొన్ని గంటల్లోనే ఏకంగా 2.6 మిలియన్ల వ్యూస్​, 22 వేలకుపై చిలుకు లైక్​లు వచ్చాయి. 4,652 మంది ఈ పోస్ట్​ను రీట్వీట్​ చేశారు.

PVR Cinemas popcorn offer : ట్విట్టర్​లో వైరల్​గా మారిన పోస్ట్​కు పీవీఆర్ సినిమాస్ స్పందించింది.'మేము అందరి అభిప్రాయాలను గౌరవిస్తాము. అందుకని భారత్​లో ఉన్న ప్రతి సినిమా ప్రేమికుడి కోసం మేము ఈ అప్డేట్​ ప్రకటిస్తున్నాము' అంటూ ట్వీట్​ చేసింది. "ఇకపై సోమవారం - గురువారం (ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) వరకు రూ. 99కే బర్గర్/ సమోసా/ సాండ్​విచ్, 450ఎంఎల్ పెప్సీ తీసుకోవచ్చు. అలాగే వీకెండ్ (శుక్రవారం - ఆదివారం) రోజుల్లో అపరిమితమైన పాప్​కార్న్​, పెప్సీ పొందొచ్చు" అని పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.