ఓయో బిగ్ షాక్.. 600 మంది ఉద్యోగులు తొలగింపు - ఓయో ఉద్యోగులకు ఉద్వాసన
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రిలేషిన్‌షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్లు ఓయో తెలిపింది.
దేశీయ కంపెనీల్లోనూ ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. బైజూస్, జొమాటో వంటి కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టగా.. తాజాగా ఆతిథ్య సేవలందించే ఓయో సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొలగించనుంది. అదే సమయంలో రిలేషిన్‌షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్లు ఓయో తెలిపింది.
కంపెనీ సంస్థాగత మార్పుల్లో భాగంగా ఉద్యోగాల సంఖ్య తగ్గించుకునే ప్రక్రియ చేపట్టినట్లు ఓయో తెలిపింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, ఓయో వెకేషన్ టీమ్స్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుండగా.. రిలేషన్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్‌లో కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. మొత్తం 3,700 మంది ఉద్యోగుల్లో 10 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 600 మందిని తొలగించి.. కొత్తగా 250 మందిని కొత్తగా నియమించుకుంటున్నట్లు పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్ ఇన్సురెన్స్ కొనసాగుతుందని తెలిపింది. భవిష్యత్‌లో ఆయా విభాగాల్లో నియామకాలు చేపట్టినప్పుడు తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ తెలిపారు.