ETV Bharat / business

Oneplus And Realme To Exit India TV Market : వన్​ప్లస్, రియల్​మీ టీవీలు వాడుతున్నారా? అయితే ఓ షాకింగ్ న్యూస్! - వన్​ప్లస్ రియల్​మీ లేటెస్ట్ న్యూస్

Oneplus And Realme To Exit India TV Market : భారీ ఆఫర్లతో మధ్యతరగతి ప్రజలకు టీవీలను తక్కువ ధరకు అందించే రెండు దిగ్గజ కంపెనీలు తమ వ్యాపారాలను భారత్​లో నిలిపివేస్తున్నాయి. అవి ఏ కంపెనీలో? ఎందుకు భారత్​లో టీవీ రంగంలో వ్యాపారాన్ని నిలిపివేస్తున్నాయో తెలుసుకుందాం.

oneplus and realme to exit india tv market

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 2:32 PM IST

Oneplus And Realme To Exit India TV Market : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ దిగ్గజ కంపెనీలు వన్​ప్లస్​, రియల్​మీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్​లో టీవీల ఉత్పత్తి, అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని జాతీయ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. అయితే స్మార్ట్​ఫోన్ల విభాగంలో ఆ రెండు కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయని కథనంలో పేర్కొంది.

వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు టీవీల అమ్మకాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. పండగల సమయాల్లో డిస్కౌంట్లు, భారీ ఆఫర్లు ఇచ్చి, తక్కువ ధరలకే వినియోగదారులకు టీవీలను అందిస్తుంటాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి వాటి కారణంగా ఇటీవల కాలంలో భారత్​లో స్మార్ట్ టీవీలకు ఆదరణ పెరిగింది. అంతేగాక క్రికెట్ ప్రపంచ కప్​నకు ఆతిథ్యం ఇవ్వడం, వరుసగా పండగల సీజన్ కావడం వల్ల టీవీల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఈ సమయంలో చైనా దిగ్గజ కంపెనీలు భారత్​లో టెలివిజన్ రంగంలో వ్యాపారాలు నిలిపివేయడం గమనార్హం.

ఎల్​జీ, శామ్​సంగ్​, సోనీ, పెనాసోనిక్​ వంటి కంపెనీలు టెలివిజన్ రంగంలో భారత్​లో రాణించాయి. అంతేగాక షావోమీ , టీసీఎల్​ వంటి కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి అమ్మకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్​లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు స్మార్ట్​ఫోన్ల వ్యాపారంలో కొనసాగుతాయని.. కానీ భారత్​లో టెలివిజన్ రంగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయని సంబంధిత వ్యాపార వర్గాలు తెలిపాయి.

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నివేదిక ప్రకారం.. 2023 మొదటి అర్ధ భాగంలో భారత్​లో స్మార్ట్ టీవీల అమ్మకాలు​ 8 శాతం పెరిగాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో దాదాపు 4.5 మిలియన్ యూనిట్లు టీవీలు భారత్​కు​ దిగుమతి అయ్యాయని ఐడీసీ వెల్లడించింది. వినియోగదారులు స్మార్ట్​ టీవీల ధరలు తగ్గడం వల్ల ఎక్కువగా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషించింది.

అమ్మకాలలో బ్రాండ్​ల పరంగా షావోమి 14 శాతంతో టెలివిజన్​ మార్కెట్​లో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్​సంగ్ 13 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఎల్‌జీ 12 శాతం అమ్మకాలతో మూడో స్థానం, టీసీఎల్ 8 శాతం నాలుగో స్థానం, వన్‌ప్లస్ 7 శాతం ఐదో స్థానంలో నిలిచింది.

అదిరే ఫీచర్లతో 'వన్​ ప్లస్​' స్మార్ట్​ ఫోన్లు, టీవీలు.. వాటి ధరెంతో తెలుసా?

Oneplus Open Launch : వన్​ప్లస్​ తొలి ఫోల్డబుల్​ ఫోన్​ లాంఛ్.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.