ETV Bharat / business

New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి మారిన ఫైనాన్సియల్​ రూల్స్.. ప్రజలపై డైరెక్ట్ ఎఫెక్ట్​!.. పూర్తి వివరాలు ఇవే.. - అక్టోబర్​లో వచ్చిన కొత్త టాక్స్ రూల్స్

New Financial Rules From October 1st 2023 In Telugu : 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్​ 1తో ప్రారంభమైంది. దీనితో కొత్తగా తెచ్చిన ట్యాక్స్ రూల్స్​ అన్నీ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

New Financial Rules in October 1st 2023
New Financial Rules From October 1st 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 1:36 PM IST

New Financial Rules From October 1st 2023 : కొత్తగా మారిన పన్ను నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. డీమ్యాట్​, ట్రేడింగ్ అకౌంట్​కు నామినీ లింక్; చిన్న పొదుపు ఖాతాలకు ఆధార్​, పాన్​ లింక్​; బర్త్​ సర్టిఫికేట్​ రూల్స్ అన్నీ ఇవాల్టి (అక్టోబర్​ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు రూ.2000 నోట్ల మార్పిడి/ డిపాజిట్ గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించడం జరిగింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగానికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి​!
Birth Certificate mandatory for Government Jobs : అక్టోబర్​ 1 నుంచి ఆధార్​ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా బర్త్​ సర్టిఫికేట్​ తప్పనిసరి. అలాగే స్కూల్​ అడ్మిషన్​, డ్రైవింగ్​ లైసెన్స్​, ఓటర్ కార్డ్​​, మ్యారేజ్ రిజిస్ట్రేషన్​లకు కూడా బర్త్ సర్టిఫికేట్​ కచ్చితంగా ఉండి తీరాలి. జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం ప్రకారం, ఈ రూల్​ 2023 అక్టోబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

పన్ను భారం పెరిగింది!
TCS Rules From October 2023 : ఇటీవలే తీసుకొచ్చిన ట్యాక్స్​ రూల్స్​ అక్టోబర్​ 1 నుంచి అమల్లో వచ్చాయి. దీని ప్రకారం ఓవర్సీస్​లో మీ క్రెడిట్​ కార్డు వినియోగ పరిమితి రూ.7 లక్షలకు మించితే 20 శాతం ట్యాక్స్​ను వసూలు చేస్తారు. అయితే వైద్యం సహా విద్యకు సంబంధించి ఖర్చులు ఉంటే గనుక 5 శాతం పన్నును మాత్రమే విధిస్తారు. అలాగే విదేశీ విద్య కోసం రూ.7 లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం 0.5 శాతం ట్యాక్స్​ను విధిస్తారు.

సేవింగ్స్​ ఖాతాలకూ ఆధార్!
Aadhar Link To Savings Account : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు సహా ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారు సెప్టెబర్​ 30లోగా తమ ఆధార్, పాన్​ వివరాలను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించి ఉండాలి. ఇలా చేయనివారి ఖాతాలు అక్టోబర్ 1 నుంచి స్తంభించిపోతాయి. అంటే సదరు ఖాతాదారులు తమ అకౌంట్​ ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయలేరు. ఎప్పుడైతే తమ ఖాతాలకు ఆధార్, పాన్​ లింక్ చేస్తారో.. అప్పుడే మళ్లీ అవి యాక్టివేట్ అవుతాయి.

రూ.2000 నోట్ల మార్పిడి గడువు పొడగింపు!
2000 Deposit Date Extension : ఆర్​బీఐ రూ.2000 నోట్లు మార్పిడి/ డిపాజిట్ గడవును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈలోగా రూ.2000 నోట్లను సమీపంలోని బ్యాంకుల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ గడువు దాటిన తరువాత కూడా.. అంటే అక్టోబర్ 8 తరువాత కూడా వీటి లీగల్ టెండర్​ కొనసాగుతుంది. కానీ ప్రజలు ఇండియన్ పోస్టు ద్వారా తమ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను ఆర్​బీఐ ఇష్యూ ఆఫీస్​కు పంపించాల్సి ఉంటుంది. అది కూడా రూ.20,000 పరిమితి వరకే. అందుకే త్వరపడడం మంచిది.

డీమ్యాట్​, ట్రేడంగ్​ అకౌంట్లకు నామినీ ఏర్పాటు!
Demat Nomination Last Date : డీమ్యాట్ అకౌంట్​కు నామినీని ఏర్పాటు చేసుకునే గడువును సెబీ 2021 జనవరి 1 వరకు పొడిగించింది. కనుక గడువులోగా ఖాతాదారులు అందరూ తమ డీమ్యాట్​, ట్రేడింగ్ ఖాతాలకు నామినీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేదంటే మీ ఖాతాలను ఫ్రీజ్​ చేయడం జరుగుతుంది. వాస్తవానికి జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు ఎలాగైతే నామినీలను ఏర్పాటు చేసుకుంటామో.. స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్​ చేసేందుకు వాడే డీమ్యాట్​ అకౌంట్​కు కూడా అలానే నామినీని ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే, పెట్టుబడి పెట్టిన వ్యక్తికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. అతని/ఆమె ఖాతాలో ఉన్న పెట్టుబడులను, ఫండ్‌ యూనిట్లను వారి వారసులు క్లెయిం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకే నామినీ వివరాలను జతచేయటం తప్పనిసరి చేస్తూ సెబీ సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం డీమ్యాట్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీని ఏర్పాటు చేసుకోవాల్సిందే.

Gas Cylinder Price Hike : గ్యాస్​ వినియోగదారులకు షాక్​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధర.. ఎంతంటే?

Gold Rate Today 1st October 2023 : స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.