New Car Launches In November 2023 : దీపావళి పండుగకు కొత్త కారు లేదా బైక్ కొనాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఈ నవంబర్‌లో తమ లేటెస్ట్ మోడల్ కార్స్, బైక్‌లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అవి ఏమిటంటే..
- న్యూ-జెన్ స్కోడా సూపర్బ్
- న్యూ-జెన్ డస్టర్
- మహీంద్రా బొలెరో నియో ప్లస్
- మెర్సిడెస్ బెంజ్ GLE ఫేస్‌లిఫ్ట్
- మెర్సిడెస్ AMG C43 కార్
- రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్
- ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బైక్
New Gen Skoda Superb Launch : స్కోడా కంపెనీ ఈ నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా న్యూ-జెన్ స్కోడా సూపర్బ్ కార్‌ను లాంఛ్ చేయనుంది. సాలిడ్ ఎక్స్టీరియర్ డిజైన్‌తో దీనిని రూపొందించారు. ఈ కారు ఇంటీరియర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఈ కారులో 13 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సహా, పలు సరికొత్త ఫీచర్లు అమర్చినట్లు తెలుస్తోంది. ఇండియాలో దీనిని పరిమితమైన సంఖ్యలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
New Gen Duster Launch Date : రెనాల్ట్ సబ్ బ్రాండ్ డస్టర్ నవంబర్ 29న పోర్చుగల్‌లో New Gen Duster కారును ప్రదర్శించనుంది. ఈ కారును సీఎంఎఫ్-బీ ఆర్కిటెక్చర్‌తో, బగ్స్టర్ తరహా స్టైలిష్ లుక్‌లో తీర్చిదిద్దారు. యూరోప్‌లో దీనిని పెట్రోల్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వేరియంట్లలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2025 లేదా 2026లో భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది.
Mahindra Bolero Neo Plus Launch Date : మహీంద్రా బొలెరో నియో ప్లస్ కారు అంబులెన్స్ వెర్షన్ ఇప్పటికే విడుదలైంది. డిసెంబర్ నెలలో సివిలియన్-స్పెక్ ఎస్యూవీ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారు 7-సీట్, 9-సీట్ లేఅవుట్‌ల్లో లభ్యం కానుంది. మహీంద్రా బొలెరో నియో ప్లస్ కారులో 2.2లీటర్ mHawk 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.
Mercedes Benz GLE Launch : మెర్సిడెస్ బెంజ్ కంపెనీ నవంబర్ 2న GLE ఫేస్‌లిఫ్ట్‌ను, AMG C43 కార్లను లాంఛ్ చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ ఫేస్‌లిఫ్ట్ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో చాలా అప్డేట్స్ చేశారు. ఇక AMG C43 సెడాన్ కారులో 2.0లీటర్ ఇంజిన్, 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్ ఎలక్ట్రిక్ టర్బోఛార్జర్ అమర్చారు. ఇది 402 పీఎస్ పవర్, 500 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
Royal Enfield Himalayan 452 : ఈ నవంబర్ 7న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ వరల్డ్ ప్రీమియర్ ఏర్పాటుచేయనున్నారు. ఈ బైక్‌లో న్యూ452సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ బైక్‌ను 5 కలర్ వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్‌లో.. ఎల్ఈడీ లైటింగ్, యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, ఆప్షనల్ ట్యూబ్‌లెస్ టైర్స్, సర్క్యులర్ టీఎఫ్టీ కన్సోల్ విత్ టర్న్-టు-టర్న్ నేవిగేషన్, స్విఛబుల్ ఏబీఎస్, రైడ్ మోడ్స్ సహా పలు సూపర్ ఫీచర్లు ఉన్నాయి.
Triumph Scrambler 400X Delivery Date : ట్రయంఫ్ ఈ నవంబర్ నుంచే స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ డెలివరీ చేయనుంది. ఈ బైక్‌లో 398సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇండజిన్ ఉంది. ఇది 40 పీఎస్ పవర్, 37.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ ధర రూ.2.63 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.