Elon Musk On Twitter: ప్రముఖ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ ట్విట్టర్ యాజమాన్యయంతో సంబంధం లేకుండా కొనుగోలు ప్రక్రియను మెుదలు పెట్టారు. ట్విట్టర్‌ను కొనుగోలు చెస్తానని చెప్పిన వారంరోజుల తరువాత.. 46.5 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేశారు. ట్విట్టర్ షేర్ల కొనుగోలుకు మోర్గాన్ స్టాన్లీ.. ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయనే హామీ పత్రాలను మస్క్ సెక్కూరిటీస్ ఎండ్ ఎక్స్చేంజి బోర్డుకు సమర్పించారు. తాను చేసిన ప్రతిపాదనకు ట్విట్టర్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని అందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం 9.2 శాతం వాటాలతో ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్.. 43 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఆఫర్ చేశారు. దీన్ని నిలువరించడానికి ట్విట్టర్ పాయిజన్ పిల్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మస్క్ చర్యతో గురువారం మార్కెట్ ప్రారంభం కాగానే ట్విట్టర్ షేర్ విలువ కొద్దిగా పెరిగి 47 డాలర్లకు చేరుకుంది. కాగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో దాదాపు 279 బిలియన్ల సంపదతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా పేరు గడించారు.
ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్‌షీట్