ETV Bharat / business

Savings Account Auto Sweep Facility : సేవింగ్స్​ అకౌంట్​తో రెట్టింపు రాబడి.. 'ఆటో స్వీప్'​ ఉంటే చాలు!

More Returns With Savings Account Auto Sweep Facility : పొదుపు ఖాతాను చాలా మంది కేవలం డబ్బును దాచుకునే ఓ సాధనంగానే చూస్తారు. కానీ, అదే ఖాతా ద్వారా బ్యాంకులు మనకి అందిస్తున్న 'ఆటో స్వీప్ ఫెసిలిటీ'తో కూడా మనం డబ్బును సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By

Published : Aug 16, 2023, 2:34 PM IST

More Returns With Auto Sweep Facility
Returns On Savings Account Auto Sweep Facility

More Returns With Savings Account Auto Sweep Facility : ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరికీ సేవింగ్స్​ అకౌంట్​ ఉంటుంది. ఈ ఖాతాల్లో మనం జమ చేసే సొమ్ముపై బ్యాంకులు 2.50% నుంచి 5.50% వరకు వడ్డీని చెల్లిస్తుంటాయి. ఈ రకమైన అకౌంట్ల ద్వారా ఖాతాదారులు తమకు కావాల్సినప్పుడల్లా డబ్బులను విత్​డ్రా చేసుకోవచ్చు. అదే ఫిక్స్​డ్​ డిపాజిట్లలలో అయితే ఈ సౌలభ్యం ఉండదు. ఇదిలా ఉంటే సేవింగ్స్​ ఖాతాలపై కేవలం నామమాత్రపు రాబడిని మాత్రమే పొందొచ్చని అనుకుంటారు చాలామంది. కానీ, దేశంలోని కొన్ని బ్యాంకులు అందిస్తున్న 'ఆటో స్వీప్​' సౌకర్యంతో కూడా మనం అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మీ సేవింగ్స్​ అకౌంట్​, ఎఫ్​డీల కాంబినేషన్​నే ఆటో స్వీప్ ఫెసిలిటీ అని అంటారు. అంటే మీ పొదుపు ఖాతాకు ఓ నిర్ణీత క్యాష్​ లిమిట్​ను సెట్ చేస్తారు. అనంతరం దాన్ని ఎఫ్​డీకి లింక్​ చేస్తారు. దీని ప్రకారమే ఒకవేళ మీ సేవింగ్స్​ ఖాతా గనుక నిర్ణయించిన క్యాష్​ లిమిట్​ను​ దాటితే గనుక జమ చేసిన అదనపు మొత్తం నేరుగా సేవింగ్స్​ అకౌంట్​ నుంచి ఫిక్స్​డ్​ డిపాజిట్​లోకి బదిలీ అవుతుంది. దీనినే ఆటో స్వీప్​ ట్రాన్స్​ఫర్​ అంటారు. ఇందులో జమ అయ్యే నగదుకు సేవింగ్స్ ఖాతాకు వచ్చే వడ్డీ కంటే కూడా అధిక వడ్డీ వస్తుంది. ఇలా మీరు కేవలం సేవింగ్స్​ ఖాతా ద్వారానే రెట్టింపు రాబడిని పొందాలంటే ముందుగా మీరు సేవింగ్స్​ అకౌంట్​ తెరిచే సమయంలో లేదా మధ్యలో సంబంధిత పొదుపు ఖాతాల్లో ఒక నిర్దిష్టమైన మొత్తం మాత్రమే ఉండే విధంగా క్యాష్​ లిమిట్​ను సెట్​ చేయమని బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనినే థ్రెషోల్డ్ లిమిట్​ అని అంటారు. ఇలా మీరు ఫిక్స్​ చేసిన ఫిగర్​ను గనుక మీ సేవింగ్స్​ ఖాతా దాటితే అందులోని అదనపు సొమ్ము ఆటోమెటిక్​గా ఎఫ్​డీలోకి చేరిపోతుంది.

Savings Account More Returns : ఉదాహరణకు మీకు ఆటో స్వీప్ సదుపాయంతో ఓ సేవింగ్స్​ అకౌంట్​ ఉందనుకుందాం. దీనికి మీరు రూ.10,000 క్యాష్​ లేదా థ్రెషోల్డ్​ లిమిట్​ను సెట్​ చేశారు. అంటే ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే జమ చేయవచ్చు. ఇప్పుడు మీరు రూ.30,000ను మీ పొదుపు ఖాతాలో జమ చేశారు. అయితే మీ థ్రెషోల్డ్ లిమిట్​ గరిష్ఠంగా పది వేలే కాబట్టి మిగతా రూ.20,000 నేరుగా మీ ఎఫ్​డీ ఖాతాకు ట్రాన్స్​ఫర్​ అవుతాయి. దీంతో మీరు రెండు ఖాతాల(పొదుపు, ఎఫ్​డి) నుంచి రిటర్న్స్​ పొందొచ్చు.

విత్​డ్రా చేసుకోవచ్చా..?
Auto Sweep Facility Banks List : ఒకవేళ ఆటో స్వీప్​ ఫెసిలిటీ ద్వారా మీ ఎఫ్​డీకి బదిలీ అయిన డబ్బును మీరు విత్​డ్రా చేసుకోవాలంటే గనుక ఎఫ్​డీని రద్దు చేసుకోవాల్సిన పని లేదు. అదే సాధారణ ఎఫ్​డీలో కాలవ్యవధికి ముందే డబ్బు ఉపసంహరించుకుంటే గనుక దానిని మొత్తానికి రద్దు చేసుకోవాలి. అయితే మీ పొదుపు​ ఖాతాలో మినిమమ్​ బ్యాలెన్స్ గనుక లేకపోతే మీ ఎఫ్​డీ నుంచి అవసరమైన మొత్తాన్ని సేవింగ్స్​ అకౌంట్​కు బదిలీ చేస్తారు. మరోవైపు ఈ ఆటో స్వీప్ సదుపాయం లిక్విడిటీ ప్రయోజనంతో పాటు ఈఎంఐ కాలవ్యవధిని కూడా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసిఐసిఐ బ్యాంక్ సహా దేశంలోని ఇతర బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ ఆటో స్వీప్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.