ETV Bharat / business

కంపెనీల నయా ప్లాన్​.. పాత సూపర్​ 'బైక్​'ల రీరిలీజ్​.. మీ ఫేవరెట్​ ఏంటి? - యమహా ఆర్​డీ350 మోడిఫైడ్ బైక్

Modified Old Bikes Relaunch In India : తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు.. టూవీలర్​ కంపెనీలు కొత్త కొత్త వ్యూహాలతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన.. పాత టూవీలర్​ రీలాంఛ్​ చేస్తున్నాయి. స్వల్ప మార్పులు చేసి మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. ఆ బైక్స్​ ఏంటి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

modified old bikes relaunch in india Popular Motorcycle Coming Back in india
భారత్​లో పాత బైక్​ల రీ రిలీజ్
author img

By

Published : May 26, 2023, 8:24 PM IST

Updated : May 26, 2023, 9:13 PM IST

Modified Old Bikes Relaunch In India : ప్రపంచంలోనే టూవీలర్​ మార్కెట్​ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో టూవీలర్​ తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. అమ్మకాలు పెంచుకునేందుకు వివిధ బైక్​ కంపెనీలు.. పలు రకాల వ్యూహాలు రచిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మరో సరికొత్త ప్లాన్​తో ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన బైక్​లకు స్వల్ప మార్పులు చేసి తిరిగి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యూహంతో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా యమహా ఆర్​ఎక్స్​ 100, హీరో కరిజ్మా, టీవీఎస్​ ఫియరో 125, కవాసకి ఎలిమినేటర్, యమహా ఆర్​డీ 350 వంటి బైక్స్​ ఉన్నాయి.

యమహా ఆర్​ఎక్స్​ 100..
ఆర్​ఎక్స్​ 100 బైక్​ను తిరిగి మార్కెట్​లోకి తీసుకువస్తున్నట్లు యమహా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. యమహా ఆర్​ఎక్స్​ 100ను కొత్తగా రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశముందని తెలిపింది.

హీరో కరిజ్మా..
కొన్నేళ్ల క్రితం హీరో కరిజ్మా బైక్​ను వాడాలని ప్రతి కాలేజ్​ విద్యార్థి ఓ కలగా ఉండేది. కానీ వివిధ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ కారణంగా.. ఈ బైక్​ ఎక్కువ కాలం పాటు మార్కెట్​లో నిలవలేకపోయింది. అయితే వినియోగదారులను తిరిగి ఆకట్టుకునేందుకు.. కరిజ్మా బైక్​ తిరిగి విడుదల చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. వచ్చే కొన్ని వారాల్లోనే మార్కెట్​లోకి ఈ బైక్​ను కంపెనీ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

  • New Hero Karizma ZMR revealed at a dealer event!

    Can it replicate the success of the original Karizma?

    Image source - ET pic.twitter.com/loCya8XvVa

    — MotorOctane (@MotorOctane) May 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీవీఎస్​ ఫియరో 125..
టీవీఎస్​ కంపెనీకి చెందిన టూవీలర్​లో 'ఫియరో 125' ఓ ట్రేడ్​ మార్క్​గా నిలిచింది. ఈ బైక్​కు చాలా మంది ఫ్యాన్స్ కూడా​ ఉన్నారు. ఈ బైక్​​ తిరిగి మార్కెట్​లోకి వస్తుందన్న సమాచారంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త టీవీఎస్​ ఫియరో.. ఒక రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్​గా విడుదల కావచ్చు. దీన్ని రైడర్ 125 ఆధారంగా కంపెనీ రూపొందించే అవకాశాలు ఉన్నాయి.

కవాసకి ఎలిమినేటర్..
కవాసకి ఎలిమినేటర్​ను ఈ మధ్యకాలంలోనే జపాన్ మార్కెట్​లోకి తిరిగి విడుదల చేసింది కంపెనీ. కొత్తగా 400CC క్రూయిజర్‌తో ఈ బైక్​ను సంస్థ తయారు చేసింది. ఈ బైక్​ 399సీసీతో నింజా 400 ఇంజన్​ కలిగి ఉంది. ఇందులో లిక్విడ్-కూల్డ్, రెండు సమాంతర ఇంజన్​లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 47.5 బీఎచ్​పీ శక్తిని విడుదల చేస్తుంది.

యమహా ఆర్​డీ350..
టూవీలర్​లో​ మంచి క్రేజ్​ సంపాదించుకున్న బైక్​ల్లో.. ఆర్​డీ 350 ఒకటి. ఈ బైక్​ను కూడా త్వరలో మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. బైక్​ ఫీచర్లు, అవుట్​ లుక్​ ఒకేలా ఉండే ఆర్​జెడ్​250, ఆర్​జెడ్​350లను ​యమహా డీ350గా మార్చి అమ్మేందుకు సంస్థ సిద్ధమైంది.​

Last Updated : May 26, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.