ETV Bharat / business

MMSC Vs SSY : సుకన్య సమృద్ధి యోజన Vs మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్​.. ఏది బెస్ట్ ఆప్షన్​? - ssy scheme interest rate

MMSC Vs SSY In Telugu : కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్​ సేవింగ్​ సర్టిఫికెట్​ అనే రెండు పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బాలికలు, మహిళల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Sukanya Samriddhi Yojana
Mahila Samman Saving Certificate
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 5:03 PM IST

MMSC Vs SSY : కేంద్ర ప్రభుత్వం మగువల కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్​ సేవింగ్​ సర్టిఫికెట్​ (MSSC)' పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ చిన్న పొదుపు పథకాన్ని రూపొందించడం జరిగింది. అదే విధంగా ఆడ బిడ్డల భవిష్యత్ కోసం, వారి స్వావలంబన కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) స్కీమ్​ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్​ సేవింగ్​ సర్టిఫికెట్​ స్కీమ్​
Mahila Samman Saving Certificate Details :

  1. పెట్టుబడి వ్యవధి : 2 సంవత్సరాలు
  2. పెట్టుబడి పరిధి : కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్​ చేయవచ్చు.
  3. వడ్డీ రేటు : కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ జమ అవుతుంది.
  4. ఉపసంహరణ (విత్​డ్రావెల్​) : స్కీమ్​లో చేరిన ఒక సంవత్సరం తరువాత, ఖాతాదారుడు తను ఇన్వెస్ట్​ చేసిన మొత్తంలో 40 శాతం వరకు విత్​డ్రా చేసుకోవచ్చు.
  5. మెచ్యూరటీ : ఉదాహరణకు 2023 అక్టోబర్​లో ఖాతా తెరిస్తే, 2025 అక్టోబర్​లో మెచ్యూర్​ అవుతుంది.
  6. అర్హతలు : వయస్సుతో సంబంధం లేకుండా.. మహిళలు అందరూ ఈ పొదుపు పథకంలో చేరవచ్చు.

అకౌంట్​ ఓపెన్​ చేయడం ఎలా?
మహిళలు సమీపంలోని బ్యాంక్​ లేదా పోస్టు ఆఫీస్​కు వెళ్లి, మహిళా సమ్మాన్​ సేవింగ్​ సర్టిఫికెట్​ స్కీమ్​ కోసం దరఖాస్తును సమర్పించాలి. అలాగే ఆధార్​, పాన్​ లాంటి కేవైసీ పత్రాలను సబ్మిట్​ చేయాలి. తరువాత మీకు వీలైనంత మొత్తాన్ని నగదు లేదా చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి.

సుకన్య సమృద్ధి యోజన
Sukanya Samriddhi Yojana Scheme Details :

  1. అర్హతలు : 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరు మీద ఖాతా తెరవవచ్చు.
  2. వడ్డీ రేటు : డిపాజిట్​ చేసిన మొత్తంపై 8% వడ్డీ ఇస్తారు.
  3. పెట్టుబడి పరిధి : సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
  4. పెట్టుబడి కాలం : ఆడపిల్లకు 15 ఏళ్లు వచ్చే వరకు మదుపు చేయవచ్చు.
  5. ఉపసంహరణ : అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు దాటిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం వరకు అమౌంట్​ను విత్​డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు దాటిన తరువాత స్కీమ్​లోని అమౌంట్​ మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవచ్చు.
  6. పన్ను ప్రయోజనాలు : ఆదాయ పన్ను చట్టం సెక్షన్​ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఖాతా తెరవడం ఎలా?
ఏదైనా బ్యాంక్​ లేదా పోస్ట్​ ఆఫీస్​లో 10 సంవత్సరాలలోపు వయస్సున్న బాలిక పేరు మీదుగా తల్లిదండ్రులు 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతాను తెరవచ్చు.

ముఖ్యమైన బేధాలు!
Mahila Samman Saving Certificate Vs Sukanya Samriddhi Yojana :

1. పాలసీ వ్యవధి :

  • మహిళా సమ్మాన్ సేవింగ్​ సర్టిఫికెట్ (MMSC)​ స్కీమ్​ అనేది ఒక షార్ట్​ టెర్మ్​ స్కీమ్​.
  • సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఒక లాంగ్​ టెర్మ్ స్కీమ్​.

2. అర్హతలు :

  • MSSC స్కీమ్​ ప్రధానంగా వయోజనులైన మహిళ కోసం ఉద్దేశించినది.
  • SSY స్కీమ్ అనేది ప్రత్యేకంగా 10 ఏళ్లలోపు బాలికల కోసం రూపొందించిన పథకం.

3. పెట్టుబడి లక్ష్యం :

  • మహిళల స్వావలంబన, ఆర్థిక సాధికారత కోసం MSSC స్కీమ్​ ఉపయోగపడుతుంది.
  • బాలికల విద్య, వివాహం మొదలైన అవసరాల కోసం SSY పథకం అక్కరకు వస్తుంది.

మీకు గనుక అవకాశం ఉంటే.. ఈ రెండు ప్రభుత్వ పథకాలను కచ్చితంగా ఉపయోగించుకోవడం మంచిది.

Things To Check Before Buying Land : భూమి కొంటున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.