ETV Bharat / business

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు అమ్మిన మెర్సిడెస్​

Most expensive car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది మెర్సిడెస్​. 1950ల నాటి ఈ కారుకు వేలం పాటలో రికార్డు ధర పలికింది.

mercedes-worlds-most-expensive-car
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారను విక్రయించిన మెర్సిడెస్​
author img

By

Published : May 20, 2022, 2:47 PM IST

Mercedes Most expensive car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును విక్రయించినట్లు తెలిపింది దిగ్గజ సంస్థ మెర్సిడెస్. 1955 నాటి మెర్సిడెస్ బెంజ్​ ఎస్​ఎల్ఆర్​ కూపే మోడల్​ వేలం పాటలో 142 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయినట్లు తెలిపింది. కార్ల చరిత్రలోనే మరే ఇతర కారుకు ఇంత ధర పలికిన దాఖలాలు లేవు. ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును గ్లోబల్ స్కాలర్​షిప్ ఫండ్ కోసం ఉపయోగిస్తామని మెర్సిడెస్ తెలిపింది.

2018లో 1963లో తయారైన ఫెర్రారీ 250 జీటీఓకు వేలంపాటలో 70మిలియన్​ డాలర్లు దక్కాయి. ఆ తర్వాత మెర్సిడెస్ కారుకే భారీ ధర పలికింది. 67 ఏళ్ల నాటికి మెర్సిడెస్ బెంజ్​ ఎస్​ఎల్ఆర్​ కూపే మోడల్​లో రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. అప్పటి చీఫ్​ ఇంజినీర్​ పేరు ఈ కారుకు పెట్టారు. గంటకు 186 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 300 హార్స్​పవర్​తో 8 సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. కారు డోర్లు పైకి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా డ్రైవర్​కు రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత.

mercedes-worlds-most-expensive-car
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారను విక్రయించిన మెర్సిడెస్​

మే 5న జర్మనీలోని స్టట్​గర్ట్​లో మెర్సిడెస్ బెంజ్​ మ్యూజియంలో ఈ వేలం పాటను ప్రైవేటుగా అతికొద్ది మంది సమక్షంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఎవరు దక్కించుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వేలంపాటలో పాల్గొన్న కార్ డీలర్​ బ్రయాన్ రాబోల్డ్ మాత్రం తన క్లయింట్ కోసం కారను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్​ వైపు చూస్తారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.