Maruti Brezza 2022 price ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైంది. భారత మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు దూకుడుగా వెళ్తోంది. అందులో భాగంగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. ఎస్‌యూవీ బ్రెజా కొత్త వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. అధునాతన హంగులతో కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్లో ఈ కారును తీసుకొస్తున్న కంపెనీ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మాన్యువల్‌తోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో బ్రెజా వెర్షన్ అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
"గత ఎనిమిది నెలల్లో ఇది మా 6వ లాంచ్. ఇది భారత మార్కెట్‌పై మాపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. వాహనదారులకు 'జాయ్ ఆఫ్ మొబిలిటీ' ఫీల్‌ను అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త మోడల్‌ను తీసుకొస్తున్నాం"
-మారుతీ సుజుకీ ఇండియా
మారుతీ సుజుకీ మార్చి 2016లో బ్రెజాతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఆరేళ్లలో 7.5 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇప్పుడు రెండో తరం సరికొత్త బ్రెజాను తీసుకొచ్చింది. అధునాతన హంగులతో దీన్ని తీర్చిదిద్దింది.
ఫీచర్లు ఇవే..
- 1.5లీటర్ పెట్రోల్ ఆధారిత అడ్వాన్స్డ్ కే15 సిరిస్ ఇంజిన్
- మ్యాన్యువల్ వెర్షన్ లీటరు గరిష్ఠంగా 20.15 కిలోమీటర్ల మైలేజ్
- ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 19.80 కిలోమీటర్ల మైలేజ్
- రెండు వెర్షన్స్‌లోనూ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
- హెడ్-అప్ డిస్‌ప్లే
- డిజిటల్ 360 కెమెరా
- ఆరు ఎయిర్‌బ్యాగ్స్
- 20కి పైగా భద్రతా ఫీచర్లు
Maruti Brezza 2022 on road price:
వేరియంట్ | ధర |
Maruti Brezza LXI Manual | రూ. 7,99,000 |
Maruti Brezza VXI Manual | రూ.9,46,500 |
Maruti Brezza ZXI Manual | రూ.10,86,500 |
Maruti Brezza VXI Automatic | రూ.10,96,500 |
Dual Tone Manual | రూ.11,02,500 |
ZXI+ Manual | రూ.12,30,000 |
ZXI Automatic | రూ.12,36,500 |
ZXI+ Dual Tone Manual | రూ.12,46,000 |
Dual Tone Automatic | రూ.12,52,500 |
ZXI+ Automatic | రూ.13,80,000 |
ZXI+ Dual Tone Automatic | రూ.13,96,000 |
ఇదీ చదవండి: జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. కస్టమర్లకే బెనిఫిట్!