ETV Bharat / business

దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్​, అదిరే ఫీచర్లు మీ సొంతం! - మహింద్రా కార్లపై దివాళీ స్పెషల్ ఆఫర్స్

Mahindra XUV 400 SUV Diwali Offer : మీరు ఈ దివాళీకి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో ధమాకా ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా తమ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mahindra XUV 400
Mahindra XUV 400
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 2:45 PM IST

Massive Discount on Mahindra XUV 400 Electric Car : పండగ సీజన్​లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా కొన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అందులో భాగంగానే తమ కంపెనీ నుంచి తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400)పై ఏకంగా రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Diwali 2023 Massive Offers on Mahindra Cars : ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో మహీంద్రా (Mahindra Auto) కంపెనీ తన తొలి ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారు XUV 4000ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో దీపావళి(Diwali 2023) సందర్భంగా మహీంద్రా తన ఎలక్ట్రిక్ కారు XUV 400పై రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్​ అందిస్తోంది. కంపెనీ ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.15.99 లక్షలుగా ప్రకటించింది. వేరియంట్​ను బట్టి ధర ఉంటుంది.

ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. దివాళీ సీజన్ సందర్భంగా డీలర్లు టాప్-స్పెక్ EL వేరియంట్‌పై రూ. 3.5 లక్షల వరకు, ESCతో కూడిన EL వేరియంట్‌పై రూ. 3 లక్షల వరకు, అలాగే లోయర్​-స్పెక్‌ EC trimపై రూ. 1.5 లక్షల వరకు నగదు తగ్గింపులను అందిస్తున్నారు. ఈ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV కారు ఆటో ఎక్స్‌పో 2021లో ప్రదర్శనకు ఉంచిన eXUV300 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV కారు ప్రస్తుత మార్కెట్​లో టాటా నెక్సాన్ EV, MG ZS EV వంటి వాటితో పోటీపడుతుంది.

మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV డిజైన్:

  • మహీంద్రా XUV 400 పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాతో కొత్త హెడ్‌లైట్‌లతో ఇంటిగ్రేటెడ్ డీఆర్​ఎల్స్, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది.
  • ఈ కారు ముందు భాగంలో కాపర్ ట్విన్ పీక్స్ లోగోను కూడా కలిగి ఉంది.
  • ఇది విశాలమైన C-సెగ్మెంట్ e-SUV.
  • ఈ కొత్త EV ప్రత్యేకమైన కాపర్ ఇన్‌సర్ట్‌లు, పియానో-బ్లాక్, డైమండ్ కట్ 16" అల్లాయ్ వీల్స్‌తో అధిక కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌తో వస్తుంది.
  • ఈ కారు శాటిన్ కాపర్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఎలక్ట్రిక్ టెయిల్ ల్యాంప్‌లను కూడా కలిగి ఉంది.

Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : దీపావళికి మంచి కారు కొనాలా?.. రూ.15 లక్షల బడ్జెట్​లో బెస్ట్ కార్స్ ఇవే!

మహీంద్రా XUV 400 ఫీచర్లు:

  • ఈ ఎలక్ట్రిక్ కారులో 17.78cm టచ్‌స్క్రీన్, Android Auto, Apple CarPlay కోసం మొదటి-ఇన్-సెగ్మెంట్ ప్రత్యేక అప్లికేషన్ ఉంది.
  • అలాగే ఇది స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీతో పాటు బ్లూ సెన్స్, 60+ క్లాస్ లీడింగ్ కనెక్టివిటీ ఫీచర్‌లు కలిగే ఉండే మొబైల్ యాప్‌తో వస్తుంది.
  • శాటిన్-కాపర్, బ్లూ బ్యాక్ లైటింగ్‌తో కూడిన ఆల్-బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్స్‌ కూడా ఉన్నాయి.
  • అదే విధంగా ఈ కారు పెద్ద ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్:

  • మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈసీ వేరియంట్‌లో 34.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 375 km ప్రయాణించవచ్చు.
  • మరో వేరియంట్ ఎక్స్‌యూవీ 400 ఈఎల్‌లో 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 456 km ప్రయాణించవచ్చు.
  • ఈ రెండు వేరియంట్లలోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ 110 కిలోవాట్‌ శక్తిని, 310 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • 150 km టాప్‌ స్పీడ్‌తో.. కేవలం 8.3 సెకన్లలో 0-100 km వేగాన్ని అందుకుంటుందని.. దీని గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. అని కంపెనీ పేర్కొంది.
  • ఈ కారులో ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు.
  • అలాగే బెస్ట్-ఇన్-ఇండస్ట్రీ డస్ట్ వాటర్‌ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్, డిస్క్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, పుష్‌ బటన్‌ స్టార్ట్‌ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

కారు కొనడానికి లోన్‌ కావాలా? తక్కువ వడ్డీకే ఎస్‌బీఐ రుణం! ఈజీ ఈఎంఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.