LPG Cylinder Subsidy: వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే వర్తించనుంది. ఇతర గృహ వినియోగదారులు మాత్రం మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ 'వంట గ్యాస్‌పై 2020 జూన్ నుంచి రాయితీని చెల్లించడం లేదు' అని తెలిపారు.
'కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన సందర్భంలోనే ఉజ్వల లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 చొప్పున సంవత్సరానికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1003 ఉండగా ఉజ్వల పథకం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.200 చొప్పున జమచేస్తున్నాం. దీంతో వారు రూ.803 చెల్లించాల్సి ఉంటుంది' అని పంకజ్ జైన్ వివరించారు. మిగిలిన గృహ వినియోగదారులకు గ్యాస్ రాయితీ లభించబోదని, మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దేశప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు