ETV Bharat / business

LIC Aadhaar Shila Policy : ఎల్​ఐసీ 'సూపర్​ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్​డ్రా! - బెస్ట్​ ఎల్​ఐసీ పాలసీ 2023

LIC Aadhaar Shila Policy Benefits : ప్రముఖ బీమా సంస్థ ఎల్​ఐసీ ఓ సూపర్​ పాలసీని తమ వినియోగదారులకు అందిస్తోంది. అదే 'ఎల్​ఐసీ ఆధార్​ శిలా'. ఈ పథకంలో రోజుకు రూ.87 ఇన్వెస్ట్​ చేస్తే మెచ్యురిటీ సమయానికి ఏకంగా రూ.11లక్షలను పాలసీ హోల్డర్​ పొందొచ్చు. మరి ఈ పాలసీకి ఎవరు అర్హులు, సంవత్సరానికి ఎంత ప్రీమియం చెల్లించాలి, మెచ్యురిటీ పీరియడ్​ ఎంత వంటి తదితర వివరాలు మీ కోసం.

LIC Aadhaar Shila Policy Benefits
ఎల్​ఐసీ 'సూపర్​ పాలసీ'.. రోజుకు రూ.87లు ఇన్వెస్ట్​ చేయండి.. మెచ్యురిటీ సమయానికి రూ.11 లక్షలు..
author img

By

Published : Aug 9, 2023, 9:30 PM IST

Updated : Aug 10, 2023, 12:39 PM IST

LIC Aadhaar Shila Policy Benefits : లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎల్​ఐసీ) తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తుంటుంది. ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే 'ఎల్​ఐసీ ఆధార్​ శిలా' పేరుతో మరో సూపర్​ పాలసీ ప్లాన్​ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 మదుపు చేస్తే ప్లాన్​ మెచ్యురిటీ గడువు ముగిసేసరికి అక్షరాల రూ.11 లక్షలను పాలసీ హోల్డర్​ పొందొచ్చు. దీంతో అత్యవసర ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కొచ్చు.

'ఎల్​ఐసీ ఆధార్​ శిలా' అనేది వ్యక్తిగత లైఫ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్. దీనిని ముఖ్యంగా మహిళల కోసమే మాత్రమే తీసుకొచ్చారు. ఈ స్కీమ్​ను తీసుకున్న వారెవరైనాసరే పాలసీ మెచ్యురిటీ సమయానికి ఓ నిర్దిష్టమైన పెద్దమొత్నాన్ని పొందుతారు. అంతేకాకుండా పాలసీ హోల్డర్​ దురదృష్టవశాత్తు మరణిస్తే గనుక వారి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతుంది కూడా.

వీరు మాత్రమే అర్హులు..
LIC Aadhaar Shila Eligibility : ఈ స్కీమ్ కింద పాలసీ తీసుకోవాలంటే బాలిక లేదా మహిళ వయసు 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి కచ్చితంగా ఆధార్​ ధ్రువపత్రం ఉండాలి. ఈ ప్లాన్​ కాలవ్యవధిని 10 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే ప్లాన్​ మెచ్యురిటీ సమయానికి మహిళ గరిష్ఠ వయసు 70 ఏళ్లు మించకూడదు. అయితే స్కీమ్​ కాలవ్యవధి గరిష్ఠంగా 20 సంవత్సరాలు ఉన్నా.. మహిళ ఎంత కాలానికి ప్లాన్​ను కొనుగోలు చేయాలనేది ఆమె ఏ వయసులో దానిని తీసుకుంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 55 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ కేవలం 15 సంవత్సరాల మెచ్యురిటీ పీరియడ్​ కలిగిన ప్లాన్​ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 18 లేదా 20 సంవత్సరాలకు పాలసీని తీసుకునే అవకాశం ఆమెకు ఉండదు ఎందుకంటే పాలసీ మెచ్యురిటీ పీరియడ్​ గరిష్ఠంగా 70 ఏళ్లు మాత్రమే కాబట్టి. కాగా, ఈ పథకం కింద హామీ మొత్తం(సమ్​ అష్యూర్డ్​) మొత్తాన్ని కనిష్ఠంగా రూ.2 లక్షలు, గరిష్ఠంగా రూ.5 లక్షలుగా ఫిక్స్​ చేశారు.

రోజుకు రూ.87.. ఆ సమయానికి రూ.11 లక్షలు..
Best LIC Policies For Ladies : మీరు రోజుకు రూ.87 చొప్పున ఇన్వెస్ట్​ చేసి మెచ్యురిటీ సమయానికి అక్షరాల రూ.11 లక్షలు సొంతం చేసుకోవాలనుకుంటే గనుక 'ఎల్​ఐసీ ఆధార్​ శిలా పాలసీ'(LIC Aadhaar Shila)ని ఓ బెటర్ ఆప్షన్​గా చెప్పొచ్చు. ఇలా మీరు ఏడాదికి వార్షిక ప్రీమియం కింద రూ.31,755 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయసున్న ఓ మహిళ 10 ఏళ్ల వ్యవధి కలిగిన ప్లాన్​ను ఎంచుకున్నారనుకుందాం. అలా ఆమెకు 70 ఏళ్ల వచ్చేసరికి కేవలం రూ.3,17,550 మాత్రమే ప్రీమియం కింద చెల్లిస్తుంది. మెచ్యురిటీ పీరియడ్​ గరిష్ఠంగా 70 ఏళ్లే కాబట్టి. ఆ సమయానికి పాలసీ హోల్డర్​కు అక్షరాల రూ.11 లక్షలు అందుతాయి. మొత్తంగా ఎల్​ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్​ ద్వారా జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలతో పాటు భవిష్యత్తులో వచ్చే అత్యవసర ఆర్థిక ఇబ్బందులను మహిళలు ఎదుర్కునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది, అలాగే మీ కుటంబానికి భద్రతను కల్పిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Last Updated : Aug 10, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.