ETV Bharat / business

అదిరే ఫీచర్లతో ఐఫోన్​ 14 రిలీజ్​.. ధర ఎంతంటే? - ఎయిర్‌పాడ్స్‌ ప్రో

Iphone 14 Launch: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేసింది. దీంతో పాటు కొత్త వాచీ సిరీస్ 8, కొత్త తరం ఎయిర్​పాడ్స్ ప్రోను కంపెనీ తీసుకొచ్చింది. ఆ ఫీచర్లలెేంటో ఓ సారి తెలుసుకుందామా.

iphone 14
ఐఫోన్‌ 14
author img

By

Published : Sep 8, 2022, 8:23 AM IST

Iphone 14 Launch: టెక్‌ దిగ్గజం యాపిల్‌ బుధవారం అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్‌ 14 మోడళ్లను విడుదల చేసింది. దీంతో పాటు కొత్త వాచీ సిరీస్‌ 8, కొత్త తరం ఎయిర్‌పాడ్స్‌ ప్రో, వాచీ ఎస్‌ఈ2లను కంపెనీ తీసుకొచ్చింది.
ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌: ఐఫోన్‌ 14లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ తెర, 14 ప్లస్‌లో 6.7 అంగుళాల తెరను అమర్చారు. మిడ్‌నైట్‌, స్టార్‌లైట్‌, బ్లూ, పర్పుల్‌, ప్రోడక్ట్‌ రెడ్‌ రంగుల్లో లభించనున్నాయి. ఇందులోని బ్యాటరీ ఐఫోన్‌ చరిత్రలోనే అత్యుత్తమమని కంపెనీ చెబుతోంది. ఏ15 బయోనిక్‌ చిప్‌, 12 మెగాపిక్సెల్‌ వెనుక, ముందు కెమేరాలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్‌ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (భారత్‌లో రూ.79,900)గా, ఐఫోన్‌ 14 ప్లస్‌ ప్రారంభ ధర 899 డాలర్లు(భారత్‌లో రూ.89,900)గా నిర్ణయించారు. ఐఫోన్‌ 14 సెప్టెంబరు 16న, 14 ప్లస్‌ అక్టోబరు 7న విపణిలోకి రానున్నాయి.

.

ఐఫోన్‌ 14 ప్రో, ప్రో మ్యాక్స్‌: కొత్త పర్పుల్‌ రంగుతో రూపొందించారు. ఏ16 బయోనిక్‌ చిప్‌, 14 ప్రోలో 6.1 అంగుళాల తెర, 14 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల తెరలు, 48 మెగాపిక్సెల్‌ కెమేరా, డైనమిక్‌ ఐలాండ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్‌ 14 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు(భారత్‌లో రూ.1,29,900), 14 ప్రో మ్యాక్స్‌ ధర 1099 డాలర్లు(భారత్‌లో రూ.1,39,900)గా నిర్ణయించారు. సెప్టెంబరు 16 నుంచి లభించనున్నాయి.

వాచీ సిరీస్‌ 8: కొత్త డిజైన్‌తో అధునాతన సెన్సార్లు, టెక్నాలజీతో ఈ వాచీని తీసుకొచ్చారు. వినియోగదారు తీవ్రమైన కారు ప్రమాదంలో చిక్కుకుంటే గుర్తించే క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఇందులో ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ దీని ప్రత్యేకత. తక్కువ పవర్‌ మోడ్‌లో 36 గంటలు పనిచేస్తుంది. ఈ వాచీ ప్రారంభ ధర 399 డాలర్లు. సెల్యులార్‌ ఎడిషన్‌ కోసం 499 డాలర్లు చెల్లించాలి. సెప్టెంబరు 16 నుంచి విపణిలో అందుబాటులోకి రానున్నాయి.

వాచీ ఎస్‌ఈ2: కొత్త ఎస్‌ఈ మిడ్‌నైట్‌, సిల్వర్‌, స్టార్‌లైట్‌ రంగుల్లో లభించనుంది. క్రాష్‌ డిటెక్షన్‌, ఫాల్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర 249 డాలర్లు కాగా.. జీపీఎస్‌+సెల్యులార్‌ ధర 299 డాలర్లు.

వాచీ అల్ట్రా: క్రాష్‌ డిటెక్షన్‌, కంపాస్‌, డెప్త్‌ గేజ్‌, నైట్‌ మోడ్‌ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 799 డాలర్లు (భారత్‌లో రూ.89,900). సెప్టెంబరు 23 నుంచి లభించనుంది.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో: కొత్త హెచ్‌2 చిప్‌ కలిగిన ఈ హెడ్‌ఫోన్స్‌ 30 గంటల పాటు పనిచేస్తుంది. అయిదు పరిమాణాల్లో లభించనుంది. రెండో తరం ఎయిర్‌పాడ్స్‌ ప్రో ధర 249 డాలర్లు. 23 నుంచి అందుబాటులోకి రానుంది.

ఇవీ చదవండి: ఇకపై బీమా పాలసీలన్నీ డిజిటల్​మయం.. కొత్తవాటికీ నో బాండ్స్​!

కార్పొరేట్‌ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.