ETV Bharat / business

పిల్లల భవితకు భరోసా.. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేయండిలా.. - చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ

పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకే, వీలైనంత మొత్తాన్ని పెట్టుబడులకు కేటాయిస్తూ.. భవిష్యత్‌ ఖర్చులకు సిద్ధంగా ఉంటారు. విద్యా ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి మించి రాబడి ఆర్జించే మార్గాల్లో మదుపు చేయాలి. అదే  సమయంలో ఆర్జించే కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు వారి చదువులకు ఎలాంటి ఆటంకం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ప్రణాళిక ఉంటే తప్ప ఈ రెండింటినీ సాధించడం అంత సులభం కాదు.

insurance plan for child education
insurance plan for child education
author img

By

Published : Dec 4, 2022, 12:47 PM IST

పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించినప్పుడే సంపద సృష్టి సాధ్యం అవుతుంది. పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, బంగారం, స్థిరాస్తులు ఏదైనా సరే.. సొంత నిధులతో వీటిలో పెట్టుబడులు కొనసాగిస్తూ ఉండాలి. సంపాదించే వ్యక్తి కుటుంబానికి దూరం అయినప్పుడు ఏమిటి పరిస్థితి? ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు భరోసాగా ఉండాలంటే పిల్లల బీమా పథకాలను ఎంచుకోవచ్చు. ఈ పాలసీలు ప్రత్యేకంగా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు పిల్లల చదువులకు అవసరమయ్యే నిధులను సమకూర్చే లక్ష్యంతో రూపొందించినవి. బీమా పాలసీ తీసుకున్న తల్లిదండ్రులు లేనప్పుడు, బీమా కంపెనీ ఆ ఖర్చులను భరిస్తుంది. ఏ ఇతర బీమా పాలసీలతో పోల్చి చూసినా పిల్లల పాలసీలు కాస్త ప్రత్యేకమైనవిగానే చెప్పొచ్చు. బీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాతా ఈ పాలసీ కొనసాగుతుంది. ఈ పాలసీల్లో ఉండే వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పరిహారం కేవలం పిల్లల ఉన్నత చదువులు, వారి ఇతర ఖర్చులకు మాత్రమే వాడుకునేలా నిబంధనలు ఉంటాయి.

పరిహారం రెండుసార్లు..
పిల్లల పాలసీలు (చైల్డ్‌ ఇన్సూరెన్స్‌) పాలసీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. రెండుసార్లు పరిహారం లభించడం. బీమా తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు వెంటనే నామినీకి పరిహారం అందిస్తుంది. ఆ తర్వాత పాలసీ వ్యవధి తీరే వరకూ బీమా సంస్థ పాలసీదారుడికి బదులు ప్రీమియాలను చెల్లిస్తుంది. దీనివల్ల పాలసీ కొనసాగుతుందన్నమాట. ఆ తర్వాత వ్యవధి ముగిసిన వెంటనే మరోసారి నామినీకి పాలసీ విలువను చెల్లిస్తుంది. ఉన్నత చదువులు, వారి వివాహం తదితర ఖర్చులకు అనుగుణంగా వ్యవధులను నిర్ణయిస్తారు.

అవసరాన్ని బట్టి..
పిల్లల పాలసీల్లో ఎండోమెంట్‌ ప్లాన్‌, యూనిట్‌ ఆధారిత పాలసీలూ (యులిప్‌) అందుబాటులో ఉన్నాయి. తక్కువ నష్టభయం ఉండాలని భావించే వారు ఎండోమెంట్‌ పాలసీలను పరిశీలింవచ్చు. ఇందులో బీమా సంస్థ బోనస్‌, లాయల్టీ అడిషన్‌లాంటివి అందిస్తుంటుంది. రాబడి 6 శాతం వరకూ ఉండొచ్చు. యులిప్‌ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరో పదేళ్ల తర్వాతే పిల్లలకు డబ్బు అవసరం ఉంటుందని భావించినప్పుడు యులిప్‌లలో ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. లక్ష్యానికి సమీపిస్తున్నప్పుడు కనీసం మూడేళ్ల ముందునుంచీ ఈ పెట్టుబడులను డెట్‌లోకి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడులను కాపాడుకోవచ్చు. వ్యవధి తీరిన తర్వాత ఎండోమెంట్‌ పాలసీ విలువను చెల్లిస్తుంది. యులిప్‌ తీసుకుంటే.. వ్యవధి తీరిన తర్వాత ఫండ్‌ విలువను చెల్లిస్తాయి. మధ్యలోనే పాలసీదారుడు కుటుంబానికి దూరమైతే.. నిర్ధారించిన విధంగా పరిహారాన్ని అందిస్తాయి. ముందే చెప్పినట్లు.. పాలసీని ఎంచుకునేటప్పుడు కచ్చితంగా వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం ఉండేలా చూసుకోవాలి. నష్టభయం భరించే సామర్థ్యం, పిల్లల అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ఏ రకం పాలసీలను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

ముందునుంచే...
సంపాదన ప్రారంభమైనప్పటి నుంచే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం తర్వాత తనపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళికలు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన వెంటనే వారి 21 ఏళ్ల ఆర్థిక అవసరాలకు ఒక రక్షణ కల్పించాలి. ఉన్నత చదువుల ఖర్చు పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. ప్రముఖ విద్యా సంస్థల్లో ఇప్పుడు అవుతున్న ఖర్చు ఎంత? 15 ఏళ్ల తర్వాత ఎంత కావచ్చు అనే అంచనా వేసుకోవాలి. అప్పుడే సరైన మొత్తాన్ని మదుపు చేసేందుకు వీలవుతుంది. కేవలం పెట్టుబడులతోనే అన్నీ సాధ్యం కాకపోవచ్చు. అనుకోని పరిస్థితులనూ ఊహించి, అందుకు అనుగుణంగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. మీరు పెట్టే పెట్టుబడులు అధిక రాబడినిచ్చేలా ఉండాలి. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు మీ పోర్ట్‌ఫోలియోలో ఉండేలా చూసుకోవాలి. ఉన్నత చదువు కోసం మన దగ్గరున్న మొత్తం సరిపోకపోతే విద్యా రుణం తీసుకోవచ్చన్న సంగతి గుర్తు పెట్టుకోండి.

టర్మ్‌ ప్లాన్‌తో..
ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం వార్షిక ఆదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా ఉండాలి. దీనికోసం టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలని చెబుతుంటారు. కేవలం బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అనుకోని పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక రక్షణ అందిస్తుంది. కచ్చితంగా మీ ఆదాయంలో 15-20 శాతం వరకూ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలి. టర్మ్‌ పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్లను కలిపి ఎంచుకోవాలి. దీనివల్ల ఆర్థిక భరోసాతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికీ అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

మూడేళ్లకు ఒకసారే ప్రీమియం! లాంగ్​టెర్మ్​ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.