ETV Bharat / business

Indian Mobile Congress 2023 : 7వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​లో.. 100 5జీ ల్యాబ్స్​ ప్రారంభించిన మోదీ.. - భారత్​లో 5జీ సేవల విస్తరణ

Indian Mobile Congress 2023 : శుక్రవారం దిల్లీలోని ప్రగతి మైదాన్​లో 7వ ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్​ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 100 5జీ ల్యాబ్స్​ను ప్రారంభించారు.

IMC 2023
Indian Mobile Congress 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 11:26 AM IST

Updated : Oct 27, 2023, 1:34 PM IST

Indian Mobile Congress 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీ, ప్రగతి మైదాన్​లోని భరత్​ మండపంలో 7వ ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్ (IMC)​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ సంస్థలకు 100 5జీ ల్యాబ్స్​ను ప్రదానం చేశారు.

ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోరమ్ అయిన​ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​.. దిల్లీలో మూడు రోజులపాటు అంటే​ అక్టోబర్​ 27 నుంచి అక్టోబర్​ 29 వరకు వరకు కొనసాగనుంది.

ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్​ 2023ని.. డిపార్ట్​మెంట్ ఆఫ్​ టెలికమ్యునికేషన్స్​ (DoT), సెల్యులార్​ ఆపరేటర్స్ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలో టెలికమ్యునికేషన్స్​ అండ్​ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

భారత్​ సారథ్యంలో.. 6జీ
Modi About 6G Services In India : భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించిన ఒక్క సంవత్సర కాలంలోనే.. దేశవ్యాప్తంగా 4 లక్షల 5జీ బేస్​ స్టేషన్లను ఏర్పాటుచేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు మొబైల్ బ్రాడ్​బ్యాండ్ స్పీడ్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 118వ స్థానంలో ఉంటే.. నేడు 43వ స్థానానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ భవిష్యత్​ భారతదేశంలోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

త్వరలోనే 6జీ సేవలను అందించడంలోనూ భారత్ ముందుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సాంకేతికతను మరింత ముందుకు తీసుకుపోవడానికి కావల్సిన వనరులను, పెట్టుబడులను సమకూర్చడానికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని మోదీ ఈ సందర్భంగా పేరుకొన్నారు.

మేడ్ ఇన్​ ఇండియా ఫోన్స్​
Modi About Made In India : ప్రపంచమంతా ప్రస్తుతం భారత్​లో తయారైన ఫోన్లను ఉపయోగిస్తోందని మోదీ తెలిపారు. 2014లో ప్రారంభమైన ఈ కృషి ఫలితంగా.. ఈ 9 ఏళ్లలో భారతదేశం టెక్నాలజీ దిగుమతిదారు స్థానం నుంచి ఎగుమతిదారు స్థానానికి చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు.

"శాంసంగ్ కంపెనీకి చెందిన​ ఫోల్డ్​ 5 మొబైల్స్​, యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐఫోన్​ 15 భారతదేశంలోనే తయారవుతున్నాయి. ఇటీవలే గూగుల్ కూడా భారత్​లోనే తమ పిక్సెల్​ ఫోన్లను తయారుచేస్తామని ప్రకటించింది. ఇవాళ ప్రపంచమంతా ఇండియాలో తయారైన ఫోన్లను ఉపయోగిస్తోంది. ఇది మనకెంతో గర్వకారణం."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

2014లోనే మార్పు మొదలైంది!
Modi About UPA Govt : ప్రధాని మోదీ 7వ మొబైల్ కాంగ్రెస్​లో.. గత యూపీఏ ప్రభుత్వంపైన ఘాటు విమర్శలు చేశారు. '2014 అనేది కేవలం ఒక తేదీకాదు, అది ఒక మార్పునకు నాంది పలికింది' అని వ్యాఖ్యానించారు. 'పాతబడిన ఫోన్లను ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదు. ఒక వేళ ఎవరైనా ఉపయోగించినా, అవి సరిగ్గా పనిచేయవు. ప్రస్తుతం కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ పరిస్థితి కూడా ఇలానే ఉంది' అని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Gold Rate Today 27th October 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

NPS Pension Scheme Get Returns 1 Lakh per Month : రిటైర్మెంట్ తర్వాత నెలకు లక్ష రూపాయల పెన్షన్.. ఈ పథకం తెలుసా..?

Last Updated : Oct 27, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.