ETV Bharat / business

ఫోనులోకి కరెన్సీ నోట్లు... బ్యాంకు ఖాతా, ఇంటర్నెట్ లేకుండానే చెల్లింపులు

కరెన్సీ నోట్లు ఇక మీ అర చేతిలోని ఫోన్‌లోకి రాబోతున్నాయి. భౌతిక కరెన్సీ డిజిటల్‌ రూపంలోకి మారబోతోంది. ఫోన్‌లో ఒక్క మీట నొక్కడం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం లభించబోతోంది. ఇదెలా సాధ్యమంటే?

india-digital-currency
india-digital-currency
author img

By

Published : Oct 29, 2022, 11:53 AM IST

ఇప్పటిదాకా మీ పర్సు లేదా బీరువాలో ఉన్న నోట్లు ఇక మీ అర చేతిలోని ఫోన్‌లోకి రాబోతున్నాయి. భౌతిక కరెన్సీ డిజిటల్‌ రూపంలోకి మారబోతోంది. నోట్లు లెక్క పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఫోన్‌లో ఒక్క మీట నొక్కడం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం లభించబోతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) త్వరలోనే దేశంలో చట్టబద్ధంగా, ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)తో ఇది సాధ్యం కానుంది.

ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వాడుతున్న భౌతిక కరెన్సీ, త్వరలో వాడుకలోకి రానున్న డిజిటల్‌ కరెన్సీకి తేడా ఒక్కటే. భౌతిక కరెన్సీ నోట్లను మనం చేత్తో తాకి లెక్కించగలం. డిజిటల్‌ నోట్లను ఫోన్‌ ద్వారా వాడగలం. భౌతిక కరెన్సీకి సాంకేతిక రూపమే డిజిటల్‌ కరెన్సీ. నోట్ల ముద్రణ, విడుదల, పంపిణీలో ఆర్‌బీఐకి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇది డిజిటల్‌ కరెన్సీ ఈ పరిధిలోకే వస్తుంది. కాబట్టి, వినియోగదారులకు ఎలాంటి అపోహలకూ తావులేదు. నోట్లు, నాణేల మాదిరిగానే డిజిటల్‌ కరెన్సీ ఎవరి దగ్గర ఉంటే వారే దాని యజమానులు.

వాడకం ఎలా?
ఉదాహరణకు ఒక వస్తువును రూ.549కి కొనుగోలు చేశారనుకుందాం. ఆ మొత్తానికి సరిపోయే నోట్లనూ, చిల్లరనూ చెల్లిస్తారు. అదే డిజిటల్‌ కరెన్సీతో ఒకేసారి రూ.549ని బదిలీ చేస్తారు. డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లతో చేసే నగదు బదిలీకి, డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలకు తేడా ఉంది. డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలకు బ్యాంకు ఖాతా, ఇంటర్నెట్‌ అవసరం లేదు. నోట్లను చెల్లించిన దానికంటే సులభంగా ఫోనులో ఉన్న డిజిటల్‌ పర్సు నుంచి లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి డిజిటల్‌ కరెన్సీని నోట్లుగానూ, నోట్లను డిజిటల్‌ కరెన్సీగానూ ఎలాంటి ఛార్జీలు లేకుండా మార్చుకోవచ్చు.

పూర్తిగా భిన్నం..
క్రిప్టో కరెన్సీ లేదా బిట్‌ కాయిన్‌ లావాదేవీలకూ, ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీకి ఏమాత్రం పోలిక లేదు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఎలాంటి నియంత్రణా ఉండదు. భద్రతకు భరోసా లేదు. డిజిటల్‌ కరెన్సీపై ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది. ఎలాంటి నష్టభయమూ ఉండదు.

ఎన్ని రకాలు..
డిజిటల్‌ కరెన్సీ రెండు రకాలుగా రానుంది. బ్యాంకు ఖాతా అవసరం లేకుండా వ్యక్తులు, సంస్థలూ ఆర్థిక లావాదేవీలు వినియోగించుకునేది ఒకటి. ఆర్థిక సంస్థల మధ్య జరిగే భారీ నగదు బదిలీకి ప్రత్యామ్నాయంగా ఖాతా ఆధారిత కరెన్సీ మరోటి రానున్నాయి. తొలి దశలో వినియోగదారులు నిర్వహించే కొన్ని లావాదేవీలకే ఇది పరిమితం కానుంది.

లాభాలేమిటి?

  • నోట్ల ముద్రణ, భద్రత, పంపిణీ తదితరాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.
  • లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఏర్పడి, నల్లధన నియంత్రణకు అవకాశం కలుగుతుంది.
  • విద్యుత్‌, ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ లావాదేవీలను సులభంగా నిర్వహించుకోవచ్చు.
  • దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న సమాంతర కరెన్సీ వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు.
  • వివిధ దేశాలతో నిర్వహించే ఆర్థిక లావాదేవీలు వేగవంతం అవుతాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.