ETV Bharat / business

హోమ్​ లోన్ EMI భారాన్ని - గడువుకన్నా ముందే తీర్చుకోండిలా! - హోమ్ లోన్ ఎలా తగ్గించాలి

How To Reduce Home Loan EMI : హోమ్​ లోన్ తీసుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ.. ఏళ్ల తరబడి EMIలు చెల్లిస్తుంటే.. వడ్డీ రేట్లు పెరిగిపోతుంటే.. భారంగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. EMIల భారాన్ని తగ్గించుకోవడానికి ఎనిమిది ఉత్తమమైన మార్గాలను సూచిస్తున్నారు నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

How To Reduce Home Loan EMI
How To Reduce Home Loan EMI
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 2:59 PM IST

How To Reduce Home Loan EMI : సొంత ఇళ్లు కట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ, అంత పెద్ద మొత్తంలో డబ్బు అందరి దగ్గరా ఉండదు. అందుకే.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి హోమ్‌లోన్స్‌ తీసుకుంటారు. అయితే.. 10, 15, 20 అంటూ సంవత్సరాల తరబడి ఈఎంఐలు చెల్లిస్తూ పోతుంటే.. మొత్తం అప్పు ఎప్పుడు తీరిపోతుందా? అని మదన పడుతుంటారు. అయితే.. టెన్యూర్ కంటే ముందే లోన్ తీర్చడానికి.. 8 ఉత్తమమైన మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు. వాటిగురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

అంతటా ఆరా తీయాలి..
మీరు హోమ్‌లోన్‌ తీసుకోవాలని అనుకున్నప్పుడు.. మార్కెట్లోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలను ఆరా తీయాలి. ఎంత శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయో ఎంక్వైరీ చేయండి. ఫ్రీ ఆన్‌లైన్‌ టూల్స్‌ను ఉపయోగించి ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువగా ఉంది, ఈఎంఐ ఎక్కడ తక్కువ పడుతుంది అనే వివరాలను ఆరా తీసి మీకు అనువైన రుణగ్రహీతను ఎంపిక చేసుకోండి.

ఈఎంఐ ఎంపిక..
మీరు హోమ్‌లోన్‌ టెన్యూర్‌ను ఎక్కువ కాలం సెలెక్ట్‌ చేసుకుంటే.. ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది. కానీ.. హోమ్‌లోన్ టెన్యూర్‌ ఎక్కువ కాలం ఉంటే.. ఓవరాల్​గా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అందువల్ల మీ ఆదాయాన్ని బట్టి.. కాస్త భారమైనా ఈఎంఐ ఎక్కువ చెల్లించేలా చూసుకోండి. చేతిలో డబ్బు ఎంత ఉన్నా తెలియకుండా ఖర్చు అయిపోతుందని మరిచిపోకండి.

హోమ్​ లోన్స్​పై ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ- పైగా బోలెడన్ని బెనిఫిట్స్​!

మంచి క్రెడిట్ స్కోరు..
ఏ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా సరే.. బ్యాంకులు ముందుగా కస్టమర్ల సిబిల్‌ స్కోర్‌ చూస్తాయి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు లోన్‌ మంజూరు చేస్తుంటాయి. కాబట్టి, కస్టమర్లు మంచి క్రెడిట్‌ స్కోర్ మెయింటేన్ చేయండి. మీరు తీసుకున్న లోన్‌ ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఇతర పేమెంట్లు ఏవైనా.. గడువు తేదీ కంటే ముందే చెల్లించండి. ఇలా చేయడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తుంటాయి.

అధికారులతో మాట్లాడండి..
మీకు గృహ రుణం ఇచ్చే బ్యాంకుతో వడ్డీ రేటు విషయంపై భేరసారాలు జరపొచ్చు. మీ ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు అధికారులతో చెప్పి, తక్కువ వడ్డీకే లోను వచ్చేలా చూడమని విజ్ఞప్తి చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది.

ఎక్కువ డబ్బులుంటే చెల్లించండి..
నెలవారీ EMI చెల్లిస్తున్నప్పుడు.. ఒక్కోనెల చేతిలో ఎక్కువ డబ్బు ఉండొచ్చు. అయినప్పటికీ EMI మాత్రమే చెల్లిస్తుంటారు కొందరు. అలా కాకుండా.. చేతిలో ఉన్న డబ్బును కుడా చెల్లించేయండి. ఇలా చేయడం వల్ల EMI భారంతోపాటు వడ్డీ కూడా తగ్గుతుంది. అయితే.. బ్యాంకులో ప్రీ క్లోజర్‌ ఛార్జీలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుని ప్రొసీడ్‌ అవ్వండి.

డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించండి..
మీ ఈఎంఐ భారం తక్కువగా ఉండాలంటే.. మీరు హోంలోన్‌ కోసం మొదట్లో డౌన్‌ పేమెంట్‌ను ఎక్కువగా చెల్లించండి. మీ దగ్గర డబ్బులుంటే లోన్‌లో ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లించండి. ఆ తరవాత మీ ఆదాయానికి తగ్గట్టు ఈఎంఐ తక్కువగా చెల్లించేలా చూసుకోండి.

స్పెషల్ ఆఫర్లు చూడండి..
కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పండగ సీజన్‌లో లేదా మరేదైనా ప్రత్యేక సందర్భాలలో స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. మీరు ఈ సమయంలో గృహరుణం తీసుకుంటే సాధారణ వడ్డీ రేట్ల కంటే ఇంకా తక్కువ రేటుకే హోంలోన్‌ను మంజూరు చేసుకోవచ్చు. కాబట్టి, ఇలాంటి ఆఫర్లను ఏదైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్నాయేమో తెలుసుకోండి.

వేరే బ్యాంకుకు మారండి..
మీరు హోమ్‌లోన్‌ తీసుకున్న బ్యాంకు అధిక వడ్డీని వసూలు చేస్తుంటే.. తక్కువ వడ్డీని అందించే బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీపై అదనపు భారం తగ్గుతుంది. తక్కువ వడ్డీ కూడా పడుతుంది. ఈ ఎనిమిది టిప్స్ పాటించడం వల్ల మీ గృహరుణ వడ్డీ రేటును, EMI భారాన్ని తగ్గించుకోవచ్చు.

క్రెడిట్ కార్డుతో హౌస్​​ రెంట్​ కడుతున్నారా ? ట్యాక్స్ నోటీసులు వస్తాయి జాగ్రత్త!

ఇన్సూరెన్స్ కవరేజ్​ Vs టాక్స్ సేవింగ్​ - ఏది బెటర్​ ఛాయిస్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.