ETV Bharat / business

క్రెడిట్​ స్కోర్​ తగ్గిందా?.. అయితే ఇలా పెంచుకోండి!

తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారు రుణాలు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడంలాంటి విషయంలో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగం ఇచ్చే సమయంలో సంస్థలూ ఈ స్కోరును గమనిస్తున్నాయి. మీ రుణ దరఖాస్తును పరిశీలించేటప్పుడు రుణదాత ప్రధానంగా పరిశీలించే అంశాల్లో క్రెడిట్‌ స్కోరే ముందుంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్కోరు అనుకున్నంత లేకపోతే దాన్ని మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి?

credit score for loans
credit score
author img

By

Published : Dec 18, 2022, 1:10 PM IST

క్రెడిట్‌ స్కోరు తగ్గిందని గుర్తించినప్పుడు వెంటనే దాని కారణాలను విశ్లేషించాలి. సమస్య ఎక్కడుందన్నది తెలుసుకోవాలి. కొన్నిసార్లు మీ క్రెడిట్‌ నివేదికలో దొర్లిన తప్పుల కారణంగానూ స్కోరు తగ్గే అవకాశాలున్నాయి. రుణాలు తీసుకోకపోయినా.. అవసరం లేకపోయినా రుణం కోసం దరఖాస్తు చేయడంలాంటివల్లా క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.

  • కొత్త రుణం కోసం దరఖాస్తు చేసేముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలి. రుణదాతలు సాధారణంగా 750కన్నా అధిక స్కోరున్న దరఖాస్తులనే ఆమోదించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి, ముందుగానే మీ స్కోరును తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే రుణానికి దరఖాస్తు చేయడం, వాటిని తిరస్కరించడంలాంటి కారణాలతో మీ స్కోరు మరింత తగ్గే అవకాశం ఉంది.
  • మీరు ఇప్పటివరకూ తీసుకున్న రుణాలన్నీ ఒకసారి పరిశీలించండి. వేటికి అధిక వడ్డీ చెల్లిస్తున్నారో చూడండి. అధిక వడ్డీ రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను వేగంగా చెల్లించేందుకు తగిన ప్రణాళికను రూపొందించండి. దీనివల్ల ఇతర అప్పులపై కొంత నియంత్రణ వస్తుంది. మీ స్కోరును పెంచుకునేందుకూ దీనివల్ల సులభం అవుతుంది. క్రెడిట్‌ కార్డు ఉన్నప్పుడు వినియోగ నిష్పత్తి వీలైనంత తక్కువగా ఉంచుకునేలా చూసుకోవాలి. గరిష్ఠంగా 30-40 శాతానికి మించి కార్డును వినియోగించుకూడదు.
  • రుణ వాయిదాలు, కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ఒక అలవాటుగా మారాలి. మీ స్కోరును ప్రభావితం చేసే అంశాల్లో ఇదొకటి. ఒక ఆలస్యపు చెల్లింపు.. ఇన్నాళ్లూ మీరు కాపాడుకున్న స్కోరును దెబ్బతీయొచ్చు. మీ చెల్లింపులన్నీ నేరుగా బ్యాంకు ఖాతా నుంచి వెళ్లేలా చూసుకోండి.
  • హామీలేని అప్పులే ఎక్కువగా తీసుకుంటే క్రెడిట్‌ స్కోరుపై దాని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి, ఇంటి రుణం, బంగారంపై రుణంలాంటివీ ఉండేలా చూసుకోండి. దీనివల్ల స్కోరు మెరుగ్గా ఉంటుంది.
  • ఈఎంఐలు భారంగా అనిపించినప్పుడు రుణ నిబంధనలు సవరించాలని రుణదాతను అడగండి. రుణ వ్యవధిని పెంచుకోవడం ద్వారా వాయిదా మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఇబ్బందుల్లేకుండా వాయిదాలను చెల్లించేందుకు వీలవుతుంది.
  • రుణం కావాలంటూ.. ఒకేసారి ఒకటికి మించి దరఖాస్తులు చేయొద్దు. మీరు అప్పుల కోసం ఆరాటపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. ఇలా మీరు దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ స్కోరు తగ్గుతుంది. స్కోరు తక్కువగా ఉన్నప్పుడు.. సాధ్యమైనంత వరకూ కొత్త రుణాల కోసం దరఖాస్తు చేయకపోవడమే మంచిది.
  • మీ క్రెడిట్‌ నివేదికను తరచూ తనిఖీ చేసుకోండి. దీనివల్ల నివేదికలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని వెంటనే సరిచేసుకునేందుకు వీలవుతుంది. కార్డు బిల్లులు చెల్లించకపోవడం వల్ల స్కోరుపై ప్రభావం పడుతుంటే.. ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా వివాదాలున్నప్పుడు బ్యాంకు, కార్డు సంస్థతోపాటు, క్రెడిట్‌ బ్యూరోలకూ ఫిర్యాదు చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.