ETV Bharat / business

క్రెడిట్ స్కోర్​ తగ్గిందా? ఈ సింపుల్​ టిప్స్​తో పెంచుకోండిలా! - క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలా

How To Improve Credit Score In Telugu : అనివార్య కారణాలతో మీ క్రెడిట్ స్కోర్ అమాంతం తగ్గిపోయిదా? మళ్లీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలానో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో చెప్పిన టిప్స్​ పాటిస్తే.. మళ్లీ మీ క్రెడిట్ స్కోర్​ను చాలా సులువుగా పెంచుకోవచ్చు.

how to improve credit score
Smart Tips to Increase Your CIBIL Score Quickly
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 1:40 PM IST

How To Improve Credit Score : క్రెడిట్ స్కోర్ అనేది​ మీ ఆర్థిక పరిస్థితికి, క్రమశిక్షణకు, అప్పు తీర్చగలిగే సామర్థ్యానికి ఒక కొలమానం లాంటిది. అయితే కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ తగ్గవచ్చు. అయితే దీనికోసం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మంచి క్రెడిట్ స్కోర్​ను సాధించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం!
ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే.. కచ్చితంగా మీ క్రెడిట్​ స్కోర్ తగ్గుతుంది. వాస్తవానికి క్రెడిట్ స్కోర్ అనేది అప్పటికప్పుడు తగ్గిపోవడం అంటూ జరగదు. మీ రుణ వాయిదాలను, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనివార్యంగా తగ్గుతుంది. అదే మీరు సకాలంలో ఈఎంఐలను, క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తూ ఉంటే.. కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

స్కోర్ పెరగాలంటే..
క్రెడిట్ స్కోర్​ను మెరుగుపరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. రుణాలను సకాలంలో చెల్లించడమే. ఒక వేళ మీకు అధిక సంఖ్యలో రుణాలు లేదా క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే.. వాటన్నింటిని ఒకే దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నం చేయాలి. దీని వల్ల రుణాల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా సులభంగా వాటిని తీర్చేందుకు వీలవుతుంది. మీకు గనుక ఈ ఆలోచన ఉంటే.. వెంటనే బ్యాంకులను సంప్రదించండి.

పరిమితికి మించి వాడకూడదు!
క్రెడిట్ కార్డు వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా జాగ్రత్తపడాలి. తీసుకున్న క్రెడిట్​ను సకాలంలో చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

అనవసర ఖర్చులు పెట్టకూడదు!
చాలా మంది అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులను వాడడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఒక వేళ అనవసర రుణాలు చేస్తే.. అప్పుల ఊబిలో చిక్కుకుపోవడం గ్యారెంటీ!

హామీతో రుణాలు తీసుకుంటే..
హామీ లేని రుణాలు అధికంగా తీసుకుంటే.. మీ క్రెడిట్‌ స్కోరు తగ్గే ఆస్కారం ఉంటుంది. కనుక, వ్యక్తిగత రుణాలు, బంగారు రుణాలు మీ డెట్​ పోర్టుఫోలియోలో ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు అప్పుల విషయంలో బాధ్యతాయుతంగా ఉన్నట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భావిస్తాయి.

ఎన్​పీఏ - చిక్కులు
మూడు నెలలకు మించి రుణ వాయిదాలు చెల్లించకపోతే.. బ్యాంకులు ఆ అప్పులను NPA (నాన్​-పెర్ఫార్మింగ్​ అసెట్​)గా మారుస్తాయి. దీనితో మీకు లేనిపోని చిక్కులు ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు రుణవాయిదాలను సకాలంలో చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి.

సెటిల్​మెంట్ వద్దు!
అనుకోని పరిస్థితుల్లో రుణ వాయిదాలు చెల్లించడం వీలు కాకపోతే.. బ్యాంకులు మిమ్మల్ని సెటిల్‌మెంట్‌ చేసుకోమని సూచిస్తుంటాయి. అయితే సాధ్యమైనంత వరకూ దీనిని చివరి అవకాశంగానే చూడాలి. బ్యాంకు అడగగానే సెటిల్​మెంట్​కు అంగీకరించకూడదు. ఎందుకంటే, సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు లేదా రుణసంస్థలు ఏమాత్రం ఇష్టపడవు.

మీ పొరపాటు లేకన్నా..
కొన్నిసార్లు మన పొరపాటు ఏమీ లేకున్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గినట్లు చూపిస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే మీ క్రెడిట్ నివేదికను నిశితంగా పరిశీలించండి. మీకు సంబంధంలేని రుణాలు ఏమైనా ఉన్నాయో, లేదో చెక్​ చేసుకోండి. అలాంటివి గమనిస్తే.. వెంటనే మీ బ్యాంక్​కు, క్రెడిట్​ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి.

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. EMI భారం యథాతథం!

ఆర్థిక లక్ష్యం నెరవేరేలా - పన్ను తక్కువగా ఉండేలా - ప్లాన్​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.