How To Improve CIBIL Score With Credit Cards : నేటి కాలంలో మెరుగైన సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీనిని ప్రామాణికంగా తీసుకొనే బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. అయితే కొన్నిసార్లు మన ఆర్థిక లావాదేవీల్లో తెలిసీ, తెలియక చేసే తప్పుల వల్ల.. మన సిబిల్ స్కోర్ అమాంతం తగ్గిపోతుంటుంది. అయితే దానిని తిరిగి ఎలా మెరుగుపరుచుకోవాలో చాలా మందికి తెలియదు. అందుకే.. మనం రోజూ వాడే క్రెడిట్ కార్డుల ద్వారా.. మన సిబిల్ స్కోర్‌ను మరలా ఎలా సులువుగా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
What Is CIBIL Score : క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. అనేది క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరికీ బాగా పరిచయమున్న పదం. వాస్తవానికి సిబిల్ స్కోర్ అనేది.. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అందుకే సిబిల్ స్కోర్‌ను ఆధారం చేసుకుని.. రుణసంస్థలు లేదా బ్యాంకులు తమ వినియోగదారులకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను, క్రెడిట్ లైన్లను మంజూరు చేస్తుంటాయి.
సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మంచిది..?
Good CIBIL Score : మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇది మీ క్రెడిట్ హిస్టరీ, చెల్లింపులు, బాకీ ఉన్న రుణాలతో పాటు ఇతర రుణ సంబంధిత సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికీ క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ 800పైన ఉంటే.. అద్భుతంగా ఉందని అర్థం. 700-800 మధ్య ఉంటే బాగుంది అని అర్థం. 600-700 మధ్య ఉంటే.. ఫర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. క్రెడిట్ స్కోర్ 600 కన్నా తక్కువగా ఉంటే.. ప్రమాదకర స్థాయిలో మీ ఆర్థిక స్థితి ఉందని అర్థం. ఇలాంటి స్కోర్ కలిగిన కస్టమర్స్‌కు లోన్స్ అంత సులువుగా లభించవు.
క్రెడిట్ కార్డులతో మీ 'CIBIL స్కోర్'ను పెంచుకోండిలా..
విచ్చలవిడిగా ఖర్చులు చేయకండి..
Lengthening Your Credit History : ముందుగా మీ క్రెడిట్ హిస్టరీని పొడిగించుకునే ప్రయత్నం చేయండి. సుదీర్ఘమైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. సాధారణంగా మీకు ఎంత మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే అంత మెరుగైన CIBIL స్కోర్ మీ సొంతం అవుతుంది. క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా కాకుండా బాధ్యతాయుతంగా ఉపయోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా సానుకూలమైన క్రెడిట్ హిస్టరీని మీరు క్రియేట్ చేసుకోవడమే కాకుండా దానిని మెయింటేన్ కూడా చేసుకోవచ్చు.
గడువుకు ముందే చెల్లించండి..
Strategic Usage : సాధారణంగా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉపయోగించడం మంచిది కాదు. ఒక వేళ మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండి.. వాటిని సరిగ్గా మేనేజ్ చేయగలిగితే.. కచ్చితంగా మీకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా మీరు అనేక రివార్డులు, బెనిఫిట్స్‌ను పొందవచ్చు. అయితే మీరు మీ సామర్థ్యానికి మించి చేసే ఖర్చులు మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. అందుకని మీ శక్తికి అనుగుణంగా ఖర్చు పెట్టండి. అలాగే మీ క్రెడిట్ కార్డుల బిల్స్‌ను సకాలంలో చెల్లించండి. వీలైతే గడువుకు ముందే చెల్లించే ప్రయత్నం చేయండి. లేదంటే ఆలస్య రుసుములు, వడ్డీలను మీ క్రెడిట్ కార్డు బిల్‌కు అదనంగా జోడిస్తారు. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.
క్రెడిట్ కార్డ్‌లను క్లోజ్ చేయకండి..
Avoid Closing Credit Cards : ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఖాతాలను కలిగిన వారు వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చేసేందుకు చూస్తుంటారు. అయితే ఈ ధోరణి మీ క్రెడిట్ స్కోర్‌పై భారీగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంటున్నారు ఆర్థిక నిపుణులు. వాస్తవానికి మీ క్రెడిట్ చరిత్ర, అలాగే క్రెడిట్ వినియోగ నిష్పత్తి రెండూ మీ ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావం చూపవచ్చు. అందుకని అప్పుడప్పుడు చిన్నపాటి కొనుగోళ్ల కోసం మీ పాత క్రెడిట్ కార్డ్‌లను కూడా వినియోగించండి.
సమయానికి చెల్లించండి..
Timely Repayments : మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా కూడా మీ CIBIL స్కోర్‌ను సులువుగా పెంచుకోవచ్చు. మెరుగైన సిబిల్ స్కోర్ సంపాదించుకునే మార్గాల్లో ఈ పద్ధతి అతిముఖ్యమైనది. ఆలస్యంగా చేసే పేమెంట్స్ మీ క్రెడిట్ స్కోర్‌పై కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి.
30 శాతమే వాడండి..
Understanding Credit Utilization : మీ క్రెడిట్ లిమిట్లో కేవలం 30% లేదా అంతకంటే తక్కువగా వినియోగించేలా చూసుకోండి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాకాకుండా 30 శాతానికి మించి ఖర్చు చేస్తే.. అది చాలా వరకు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
రివార్డులను రీడీమ్ చేసుకోండి..
Redeeming Rewards Regularly : మీరు క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై మీకు తరచూ రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, పాయింట్లు అందిస్తుంటాయి ఆయా బ్యాంకులు. అయితే వీటిని క్రమం తప్పకుండా రిడీమ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇది మంచి ఆలోచన. ఇలా చేస్తే మీరు క్రెడిట్ సేవలను వినియోగించడమే కాకుండా, వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ను కూడా బాధ్యతాయుతంగా వినియోగించుకుంటున్నారని క్రెడిట్ రేటింగ్ సంస్థలు గుర్తిస్తాయి. దీనితో కూడా మీ సిబిల్ స్కోర్ పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
మొత్తంగా మీ బిల్లులను సకాలంలో చెల్లించడం, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచుకోవడం మొదలైనవి మీ CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి దోహదం చేస్తాయి.
Credit Score Improvement Tips : క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ పాటించండి!