RBI Launches UDGAM For Unclaimed Deposits: సంవత్సరాల తరబడి బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను (ఎవరూ క్లెయిమ్ చేయని) వాటి హక్కుదార్లకు అప్పగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. కుటుంబ సభ్యులకు తెలీని పెట్టుబడులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మరిచిపోయిన వాటి గురించి ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో.. విడివిడిగా ఒక్కో బ్యాంక్ సైట్‌లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చేది. పదుల సంఖ్యలో ఉన్న బ్యాంక్ సైట్లలోకి వెళ్లి కనుక్కోవడం చాలా శ్రమతో పాటు కాలయాపనతో కూడిన పని. అయితే ఈ కొత్త పోర్టల్ ద్వారా ఆ వివరాలన్నీ ఒకేచోట తెలుస్తాయి.
Rupee Internationalisation RBI : రూపాయి అంతర్జాతీయీకరణ సాధ్యమేనా?
RBI UDGAM Portal: ఉద్గం (Unclaimed Deposits – Gateway to Access inforMation) పేరిట గత కొన్ని రోజుల క్రితం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (REBIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS) భాగస్వామ్యంతో ఈ పోర్టల్ రూపొందింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు అన్నీ ఈ పోర్టల్‌లో కనిపిస్తాయి. డిపాజిటర్ పేరు, ఇతర వివరాలతో వెతికితే.. ఆ వ్యక్తికి ఏదైనా బ్యాంక్‌లో అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ ఉంటే తెలుస్తుంది. తద్వారా ఆ డిపాజిట్‌ను క్లెయిమ్ చేసుకోవడం సులభం అవుతుంది. ప్రస్తుతానికి ఉద్గం పోర్టల్‌లో కొన్ని బ్యాంకులు చేరాయి. అవి..
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Union Bank of India)
- ధనలక్ష్మి బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సౌత్ ఇండియన్ బ్యాంక్
- DBS బ్యాంక్ ఇండియా
- సిటీ బ్యాంక్
ఈ బ్యాంకుల్లో ఉన్న అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఉద్గం పోర్టల్‌లో చూడవచ్చు. మిగతా బ్యాంకులను కూడా ఈ పోర్టల్‌కు లింక్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ సంవత్సరం(2023) అక్టోబరు 15 నాటికి, అన్ని బ్యాంకులను దశలవారీగా ఉద్గం పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
అసలు అన్-క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏమిటి?:
What is Unclaimed deposits: 10 సంవత్సరాలకు మించి ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉండిపోయిన డిపాజిట్లను అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పిలుస్తారు. బ్యాంక్ ఖాతాలు, పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేసి మరిచిపోవడం లేదా డిపాజిట్ చేసిన వ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల వాటి గురించి కుటుంబ సభ్యులకు తెలీకపోవడం అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లకు కారణం.
Required Documnets to Check Unclaimed Deposits in UDGAM: ఉద్గం పోర్టల్‌లో అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవాలంటే వీటిలో ఖాతాదారుడికి సంబంధించిన ఓ డాక్యుమెంటు కచ్చితంగా ఉండాలి.
- ఖాతాదారు పాన్ కార్డ్/ Voter ID/డ్రైవింగ్ లైసెన్స్/పాస్‌పోర్ట్
Damaged Currency Exchange : మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా?.. సింపుల్‌గా మార్చుకోండిలా!
ఉద్గం పోర్టల్‌లో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ వివరాలను ఎలా తెలుసుకోవాలి..?
How to Check Unclaimed deposits through UDGAM Portal..?
- ముందుగా గూగుల్‌లో ఉద్గం అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.(https://udgam.rbi.org.in )
- Unclaimed Deposits ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత Register ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఫోన్ నెంబర్, పేరు, తదితర వివరాలు ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
- అనంతరం మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- అప్పుడు స్క్రీన్ మీద వివరాలు ఎంటర్ చేయాలి. అవి ఖాతాదారు పేరు, బ్యాంక్, పాన్ లేదా ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్టు నెంబర్ ఎంటర్ చేయాలి.
- అనంతరం పుట్టినరోజును ఎంటర్ చేసి.. Search ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి.
- అప్పుడు స్క్రీన్ మీద అన్క్లైమ్డ్ వివరాలు కనిపిస్తాయి.
Rs 2000 Notes Exchange News : రూ.2 వేల నోట్లపై RBI కీలక ప్రకటన.. 93% నోట్లు వాపస్!