ETV Bharat / business

How to Buy LIC E-Term Policy in Online : ఆన్​లైన్​లో ఎల్​ఐసీ ఈ-టర్మ్​ పాలసీ.. ప్రయోజనాలేంటో తెలుసా?

LIC E-Term Plan Online Apply Process : మీరు సంపాదించడం మొదలుపెట్టి ఏదైనా టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసం ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. మీరు ఎక్కడికో వెళ్లకుండా సింపుల్​గా ఆన్​లైన్​లో కొనుగోలు చేసే విధంగా ఈ పాలసీ ఉంది. ఇంతకీ ఆ పాలసీ ఏంటి, దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 12:51 PM IST

How to Buy LIC E-Term Policy
LIC E-Term Plan

LIC E-Term Plan 2023 : ఎవరైనా జీవితంలో సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం జీవిత బీమా. మన ఆదాయానికి అనువైన పాలసీని ఎంచుకుని భవిష్యత్తును భద్రం చేసుకోవాలి. జీవితం అనేది అనిశ్చితితో కూడుకున్నది. అనుకోకుండా ఇంట్లో పెద్దకు లేదా ఇంకెవరికైనా జరగరానిది జరిగినప్పుడు టర్మ్​ ఇన్సూరెన్స్ పాలసీలు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్​ కవరేజీ అందించడం ఈ పాలసీల ప్రత్యేకత. ఎల్​సీఐ అందిస్తున్న ఈ-టర్మ్ పాలసీ కూడా ఈ రకానికి చెందినదే. మిగతా టర్మ్ పాలసీల కంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. అసలు ఎల్​ఐసీ ఈ-టర్మ్ ప్లాన్(LIC E-Term Policy)​ తీసుకోవాలంటే ఏయే ఏయే అర్హతలు ఉండాలి, ఎంత ప్రీమియం చెల్లించాలి, ఈ టర్మ్ ప్లాన్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

LIC E-Term Plan 2023 Details : ఎల్​ఐసీ ఈ-టర్మ్​ పాలసీ కుటుంబానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ ప్లాన్​ను ఎల్ఐసీ ఏజెంట్లు, మధ్యవర్తులు లేకుండా ఇప్పుడు ఆన్​లైన్​లో కూడా తీసుకోవచ్చు. మీ సొంత ఇంటి నుంచే ఈ ప్లాన్​ను కొనుగోలు చేసి సులభంగా నిర్వహించుకునే వెసులుబాటు ఆన్​లైన్​ ద్వారా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్​కు కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

LIC E-Term Policy Eligibilities :

ఎల్​ఐసీ ఈ-టర్మ్ పాలసీ అర్హతలిలా...

  • దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. సాధారణ ఆదాయాన్ని కలిగి ఉండాలి.
  • ఈ ప్లాన్​కు అప్లై చేసుకోవాలంటే కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు. గరిష్ఠ వయస్సు 60 సంవత్సరాలు.
  • ఈ ప్లాన్​లో కనీస పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు.. గరిష్ఠ పాలసీ టర్మ్ 35 ఏళ్లు.
  • కనీసం పది సంవత్సరాల పాటు ఈ పాలసీని కొనుగోలు చేయాలి. అలాగే ఏటా ప్రీమియంలు చెల్లించాలి.
  • ఈ ప్లాన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 10(10)D కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
  • ఈ ప్లాన్‌లో ధూమపానం చేసేవారికి, చేయని వారికి భిన్నమైన ప్రీమియాలు ఉన్నాయి.
  • NRIలు కూడా ఎల్​ఐసీ ఈ-టర్మ్​ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి అర్హులు.
  • పాలసీ వ్యవధి తప్పనిసరిగా 10 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

LIC E-Term Plan 2023 Features : LIC ఈ-టర్మ్ ప్లాన్ దాని అత్యంత ప్రసిద్ధ టర్మ్ బీమా పాలసీలలో ఒకటి. LIC ఈ-టర్మ్ ప్లాన్ అనేది స్వచ్ఛమైన బీమా పాలసీ. కుటుంబ సభ్యునికి మాత్రమే డెత్ బెనిఫిట్‌ను అందిస్తుంది. పాలసీదారు మరణించిన తర్వాత లబ్ధిదారునికి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారు ఎల్‌ఐసీ(LIC) ఈ-టర్మ్ ప్లాన్ కాల వ్యవధిలో జీవించి ఉంటే లబ్ధిదారుడు ఎటువంటి మెచ్యురిటీ బెనిఫిట్‌ను అందుకోరు. ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభం. ఎలాంటి అవాంతరాలు లేని పాలసీగా చెప్పుకోవచ్చు. ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్​ పొగతాగనివారికి కనీసంగా 50లక్షలు, పొగతాగే వారికి 25లక్షలుగా ఉంది. అలాగే వార్షిక ప్రీమియం కనీసం రూ.2,875తో ప్రారంభమవుతుంది.

LIC Jeevan Kiran : ఎల్​ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్​​! మరెన్నో బెనిఫిట్స్​ కూడా!

LIC E-Term Plan Benefits :

ఈ LIC E-టర్మ్ ప్లాన్ ద్వారా కలిగే ప్రయోజనాలివే..

మరణ ప్రయోజనం : పాలసీదారు అనుకోకుండా మరణిస్తే.. అప్పుడు నామినీకి డెత్ బెనిఫిట్ ఎల్​ఐసీ చెల్లిస్తుంది. జీవిత బీమా పాలసీ వ్యవధిలో మరణిస్తే పాలసీ ముగుస్తుంది.

మెచ్యూరిటీ బెనిఫిట్ : ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ లేదా మనుగడ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. ఇది ప్యూర్ టర్మ్ ప్లాన్. జీవిత బీమా చేసిన వ్యక్తి మొత్తం కాల వ్యవధిలో జీవించి ఉంటే, పాలసీ వ్యవధి ముగింపులో పాలసీదారు ఎటువంటి చెల్లింపులను అందుకోరు.

పన్ను ప్రయోజనాలు : ఎల్​ఐసీ ఈ-టర్మ్ ప్లాన్ కోసం పాలసీదారులు చెల్లించే ప్రీమియంలు ఇతర ఎల్​ఐసీ పాలసీల మాదిరిగానే సంవత్సరానికి INR 1.5 లక్షల వరకు సెక్షన్ 80C పన్నుల నుంచి మినహాయించడం జరుగుతోంది. సెక్షన్ 10 ప్రకారం.. నామినీ డెత్ బెనిఫిట్ కూడా పన్ను నుంచి మినహాయిస్తారు.

ప్రీమియం చెల్లింపు : ఈ ప్లాన్​లో ప్రీమియంలను ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతి ద్వారా వార్షిక ప్రాతిపదికన చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ ఈ-టర్మ్ ప్లాన్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చో చూద్దాం..

How to Buy LIC E-Term Policy Online :

మొదట దరఖాస్తుదారుడు ఎల్​సీఐ ఈ-టర్మ్ ప్లాన్​ను కొనుగోలు చేయడానికి www.licindia.in అనే ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • అనంతరం 'ఆన్​లైన్​లో కొనుగోలు చేయండి' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు సమ్ అష్యూర్డ్, పాలసీ టర్మ్ తప్పనిసరిగా ఎంపిక చేసుకుని సమర్పించాలి.
  • ఆపై మీరు మీ పేరు, లింగం, వయస్సు మొదలైన ప్రాథమిక సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • మీరు అందించే సమాచారం అంతా ఖచ్చితమైనదని నిర్ధారించుకొని నమోదు చేయాలి.
  • అన్ని వివరాలను తనిఖీ చేసి, మీరు ధృవీకరించిన తర్వాత వార్షిక చెల్లింపు మోడ్‌ను ఎంచుకోవాలి.
  • చివరగా సబ్మిట్ బటన్​ను క్లిక్ చేసి.. ఆ తర్వాత్ క్రెడిట్ లేదా డెబిట్ లేదా ఆన్​లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి.

LIC Aadhaar Shila Policy : ఎల్​ఐసీ 'సూపర్​ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్​డ్రా!

LIC జీవన్ లాభ్ పాలసీ.. నెలకు రూ.7వేలు చెల్లిస్తే.. రూ.54 లక్షలు మీ సొంతం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.