ETV Bharat / business

'ఆరోగ్య బీమా క్లెయిం' రిజెక్ట్​ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి! - హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేటెస్ట్ న్యూస్

ఆరోగ్య అత్యవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అనుకున్నా సరే.. కొన్నిసార్లు బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Health insurance without denying the claim
ఆరోగ్య బీమా
author img

By

Published : Dec 10, 2022, 5:49 PM IST

బీమా అంటే పాలసీదారుడు, బీమా సంస్థ మధ్య కుదిరే నమ్మకమైన ఒప్పందం. ఇందులో ఏ చిన్న పొరపాటు ఉన్నా.. బీమా సంస్థ చికిత్స ఖర్చును చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ఇందులో కొన్ని అంశాలను గమనిస్తే..
సమాచారంలో తప్పులు..
ఆరోగ్య బీమా దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు పాలసీదారులు కాస్త నిర్లక్ష్యంగానే ఉంటారు. చాలా సందర్భాల్లో వారు దాన్ని కనీసం చూడకుండానే సంతకాలు చేసేస్తుంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడూ ఇలాగే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు తెలిసి, మరికొన్నిసార్లు తెలియకుండానే పొరపాటుగా సమాచారాన్ని అందిస్తుంటారు. పేరులో అక్షర దోషాలు, వయసు తప్పుగా పేర్కొనడం, ధూమపాన అలవాట్లు, వార్షిక ఆదాయం వివరాలను వెల్లడించకపోవడంలాంటివి సాధారణంగా జరిగే పొరపాట్లు. క్లెయిం చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఇలాంటి సందర్భాల్లో బీమా సంస్థ క్లెయింను ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కాబట్టి, దరఖాస్తు నింపేటప్పుడు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది.

చరిత్రను చెప్పకోవడం..
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ వైద్య చరిత్ర గురించి కచ్చితమైన వివరాలను అందించాలి. అన్ని వివరాలూ చెప్పేస్తే.. పాలసీ ఇవ్వరని, ప్రీమియం అధికంగా వసూలు చేస్తారని భావిస్తుంటారు చాలామంది. అన్ని వేళలా ఇలాగే ఉండదు. మీరు ఆరోగ్య వివరాలు దాచిపెట్టి, పాలసీ తీసుకున్నా.. ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు ధూమపానం గురించి పాలసీలో చెప్పలేదు అనుకుందాం.. కానీ, ఏదైనా సందర్భంలో ఆసుపత్రిలో చేరినప్పుడు డాక్టరుకు ఆ సంగతి చెప్పేస్తారు. అలాంటప్పుడు మోసపూరితంగా పాలసీ తీసుకున్నారని బీమా సంస్థ పేర్కొంటుంది. ఇలాంటివి నివారించేందుకు వ్యక్తిగత ఆరోగ్యం గురించి అడిగిన వివరాలన్నీ చెప్పడం మంచిది.

పునరుద్ధరణ మర్చిపోతే..
అనేక సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. బీమా సంస్థలు నెల ముందు నుంచే ఈ విషయంలో పాలసీదారులకు సమాచారాన్ని ఇస్తుంటాయి. కొంతమంది ప్రీమియం మొత్తం సర్దుబాటు కాకపోవడంతో ప్రీమియం చెల్లించరు. కొంతమంది కావాలనే ఆలస్యం చేస్తుంటారు. సాధారణంగా గడువు ముగిసిన 30 రోజుల వరకూ పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. పాలసీ గడువు ముగిసిన వెంటనే బీమా రక్షణ ఆగిపోతుంది. ఈ వ్యవధిలో అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పరిహారం లభించదు అన్న సంగతి మర్చిపోవద్దు.

వేచి ఉండే వ్యవధిలో..
కొత్తగా పాలసీ తీసుకున్నప్పుడు 30 రోజుల వేచి ఉండే వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో కేవలం ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే చికిత్స ఖర్చులు చెల్లిస్తారు. తీవ్రమైన అనారోగ్య కవరేజీ విషయంలోనూ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కనీసం 30 రోజులు జీవించి ఉంటేనే బీమా చేసిన వ్యక్తికి క్లెయిం ప్రయోజనం అందుతుంది. కొన్ని ముందస్తు వ్యాధులకు 2-4 ఏళ్ల పాటు వేచి ఉండే సమయంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లోనూ ఆయా వ్యాధుల చికిత్సకు పరిహారం లభించకపోవచ్చు. కాబట్టి, పాలసీ చేసేటప్పుడే ఈ మినహాయింపుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

నిబంధనలు అర్థం చేసుకోవాలి..
ఒక పథకం లేదా పాలసీని ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. పాలసీ పత్రంలో ఉన్న వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తించదు అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. చాలామంది వీటిని తెలుసుకోకుండా.. క్లెయిం తిరస్కరణకు గురైనప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. భవిష్యత్తులో ఇలాంటి చిక్కులు ఎదురవ్వకుండా.. ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది.

సకాలంలో సమాచారం ఇవ్వకపోతే..
నిర్ణీత వ్యవధిలోగా బీమా కంపెనీకి సమాచారం తెలియజేయకపోతే మీ క్లెయిం తిరస్కరణకు మరో కారణం. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బీమా క్లెయిం చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఆసుపత్రిలో చేరిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు బీమా సంస్థకు వివరాలు తెలియజేయాలి. ఒకవేళ పాలసీదారుడు తెలియజేసే స్థితిలో లేకపోతే.. అతనికి బదులుగా నామినీ లేదా అధీకృత వ్యక్తులు బీమా కంపెనీకి సమాచారం అందించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.