ETV Bharat / business

'జీఎస్​టీ'కి ఐదేళ్లు.. నెలకు రూ.లక్ష కోట్లకు పైగా వసూళ్లు! - జీఎస్​టీ ఐదేళ్లు పూర్తి

వాణిజ్య పన్నుల ఎగవేతలను నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను చట్టం(జీఎస్‌టీ). దేశచరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్‌టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్‌ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. ఐదేళ్లలో జీఎస్​టీ విధానంలో జరిగిన మార్పులు తదితర వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

gst five years
gst five years
author img

By

Published : Jul 1, 2022, 10:52 AM IST

GST Five Years: దేశ చరిత్రలోనే అతి పెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం నిన్నటితో (జూన్‌ 30) అర్ధ దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. బాలారిష్టాలతో మొదలైన దీని ప్రయాణం ఆ తర్వాత ఎన్నో మార్పు చేర్పులకు లోనైంది. ఈ కొత్త పరోక్ష పన్నుల విధానంపై ఆరంభంలో వ్యాపారులు, వినియోగదారుల్లో చాలా గందరగోళం నెలకొంది. పన్ను రిటర్న్‌ల దాఖలులో సమస్యలు, ఏ వస్తువుకు జీఎస్‌టీ వర్తిస్తుంది? వేటికి మినహాయింపు ఉంది? అనే విషయంలో అయోమయం సహా పలు రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు అయ్యింది. అయితే వీటిల్లో చాలా వరకు ప్రభుత్వం ప్రస్తుతం పరిష్కరించింది. రిటర్న్‌ల ప్రక్రియను సరళీకరించడంతో పాటు పలు రకాల ఉత్పత్తులకు జీఎస్‌టీ రేట్లను మార్పు చేసింది.

జీఎస్‌టీపై అవగాహన పెంచే కార్యక్రమాలనూ చేపట్టింది. జీఎస్‌టీకి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొని వచ్చేందుకు, పారదర్శకతకూ ఈ పన్నుల విధానం దోహదపడింది. పన్నుల ఎగవేతకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. ప్రస్తుతం నెలకు రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్‌టీ వసూలు కావడం సర్వసాధారణమైంది. గత నాలుగు నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే) రూ.1.40 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలవుతూ వస్తోంది. జూన్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉందని అంచనా.

అలా ఆరంభమై.. 2017 జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చింది. జీఎస్‌టీలో ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, వ్యాట్‌ సహా 17 రకాల పన్నులను, 13 సెస్సులను విలీనం చేశారు. దీని వల్ల ప్రజలకు పన్ను మీద పన్ను చెల్లించాల్సిన భారం తప్పినట్లయ్యింది. జీఎస్‌టీ విధానంలో 4 పన్ను రేట్ల శ్లాబులు (5%, 12%, 18% 28%) ఉన్నాయి. జీఎస్‌టీకి ముందు పన్ను మీద పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఓ వినియోగదారు సగటున 31 శాతం వరకు పన్ను కట్టాల్సి వచ్చేదని అంచనా. ఈ నాలుగు పన్ను రేట్లు కాకుండా పసిడి, ఆభరణాలు, ఖరీదైన రాళ్లపై ప్రత్యేకంగా 3 శాతం; కోసిన, మెరుగుపెట్టిన వజ్రాలకు 1.5 శాతం మేర జీఎస్‌టీ రేటు విధిస్తున్నారు.

విలాసవంత వస్తువులు, హానికారక ఉత్పత్తులపై అత్యధిక జీఎస్‌టీ రేటు 28 శాతంతో పాటు సెస్సు కూడా విధిస్తున్నారు. సెస్సు రూపంలో వసూలయ్యే డబ్బులను పరిహార నిధిలో జమ చేస్తున్నారు. జీఎస్‌టీ అమలు కారణంగా రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ పరిహార నిధిలో జమ చేసిన నిధులను వాడుతున్నారు. అయితే ఐదేళ్ల వరకు మాత్రమే రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారాన్ని చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. జూన్‌ 30తో ఈ గడువు కూడా ముగిసింది. కరోనా పరిణామాలతోనే రెండేళ్లు గడిచినందున పరిహారం చెల్లింపును కొనసాగించాలంటూ చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. దీనిపై ఆగస్టు మొదటివారంలో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రాలతో కలిసి ముందుకు.. జీఎస్‌టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా లేదంటే మార్పు చేర్పులు చేయాలన్నా అది జీఎస్‌టీ మండలి చేతిలోనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఈ జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఫలానా ప్రతిపాదనపై జీఎస్‌టీ మండలిలో విస్తృత చర్చ జరిపాకే నిర్ణయం వెలువడుతుంది. ఇప్పటివరకు 47 జీఎస్‌టీ మండలి సమావేశాలు జరిగాయి. జీఎస్‌టీ చట్టంలో సవరణలు సహా పలు రకాల చర్యలు, నిర్ణయాలకు ఈ సమావేశాలు వేదికయ్యాయి. తాజాగా జరిగిన సమావేశంలోనూ పలు వస్తువుల పన్ను రేట్లలో మార్పులు చేయడంతో పాటు రిటర్న్‌ల సరళీకరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.

జీఎస్‌టీ విధానానికి జీఎస్‌టీ నెట్‌వర్క్‌ వెన్నెముకలా పనిచేస్తోంది. పన్నుల ఎగవేత నియంత్రణకు, పన్నుల విధానంలో పారదర్శకతకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పొచ్చు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌, విమాన ఇంధనం, విద్యుత్‌ను ఇంకా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాలేదు. వీటికి కూడా జీఎస్‌టీ వర్తింపజేస్తే.. వినియోగదారుకు పన్నుల మీద పన్ను కట్టే భారం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ దిశగా ప్రభుత్వం ఎప్పుడు అడుగులు వేస్తుందో చూడాలి.

ఇవీ చదవండి: జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్​.. కస్టమర్లకే బెనిఫిట్​!

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.