ETV Bharat / business

జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు.. ఏప్రిల్​లో రూ.1.68 లక్షల కోట్లు - 2022 ఏప్రిల్ జీఎస్టీ

GST collection: జీఎస్టీ వసూళ్లు మరో రికార్డు సృష్టించాయి. ఇదివరకెన్నడూ లేని స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.

GST COLLECTION
GST COLLECTION
author img

By

Published : May 1, 2022, 1:42 PM IST

Updated : May 1, 2022, 2:02 PM IST

GST collection April 2022: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడనంతగా వసూళ్లు వచ్చాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42లక్షల కోట్లు.. రెండో అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్​లో.. రూ.25 వేలు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. 2021 ఏప్రిల్​లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది.

ఏప్రిల్​లో వసూలైన రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్టీ రూపంలో రూ.33,159 కోట్లు, ఎస్​జీఎస్టీ రూపంలో రూ.41,793 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.81,939 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్టీ చెల్లింపులు సులభంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.42 లక్షల కోట్లుగా నమోదు కాగా... ఇందులో కేంద్ర జీఎస్టీ కింద రూ.25.830 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్టీ కింద రూ.74,470 కోట్లు( అందులో దిగుమతులపై పన్ను వసూళ్ల ద్వారా రూ.39,131 కోట్లు వచ్చాయి.), సెస్​ కింద రూ.9,417 కోట్లు(అందులో దిగుమతుల ద్వారా రూ.981 కోట్లు) వచ్చాయి.

ఇదీ చదవండి: మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవు! జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి!!

Last Updated : May 1, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.